Sunday, November 24, 2024

ఈ వారంలో 24300 పైన బుల్లిష్

నవంబర్ 25-29 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  23907 (+375) 
  
గత వారంలో నిఫ్టీ 23956 - 23263 పాయింట్ల మధ్యన కదలాడి 375 పాయింట్ల లాభంతో 23907 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 24300  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 
- 20, 50, 100, 200 డిఎంఏలు 23562, 23644, 23909, 24482 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 24300      బ్రేక్ డౌన్ స్థాయి : 23400
నిరోధ స్థాయిలు : 24100, 24200, 24300 (24000 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 23700, 23500, 23400 (23800 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü కన్యలోని ఉత్తర  పాదం 2 నుంచి తులలోని పునర్వసు పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü  వృశ్చికంలోని అనురాధ పాదం 2 - 4 మధ్యలో రవి సంచారం 
ü  వృశ్చికంలోని జ్యేష్ఠ  పాదం 4 లో వక్రగతిలో  బుధ సంచారం
ü ధనుస్సులోని పుబ్బ  పాదం 3 - ఉత్తరాషాఢ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü వృశ్చికంలోని పుష్యమి పాదం 3లో కుజ సంచారం
ü వృషభంలోని మృగశిర పాదం 1 - రోహిణి పాదం 4లో కర్కాటక నవాంశలో వక్రగతిలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4లో మీన నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం        

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి :  కార్తీక బహుళ దశమి                                                               

నక్షత్రం : ఉత్తర            
అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి. శతభిషం నక్షత్ర; కన్య, మకర రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 11.47
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.35 వరకు నిలకడగాను, తదుపరి 12.25 వరకు మెరుగ్గాను ట్రేడ్ కావచ్చు. తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 12.15 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 24000, 24100     మద్దతు : 23810, 23710
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...