BIZ NEWS
Friday, June 5, 2026
రెపోరేటు యథాతథం
Tuesday, April 14, 2026
భారతీయుల ఇళ్లు... "బంగారం ఖజానా"లు
భారతీయుల ఇళ్లు బంగారం ఖజానాలుగా మారాయి. ఇటీవల అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు చారిత్రక గరిష్ఠ స్థాయిలకు చేరినప్పటికీ భారతీయులకు బంగారంపై మోజు మాత్రం తగ్గలేదు.భారతీయ గృహస్థుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కేంద్రీయ బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కన్నా అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అసోచాం తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. భారతదేశ ప్రస్తుతం బంగారం నిల్వల విషయంలో ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్నదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) చెబుతోంది. భారత్ వద్ద ప్రస్తుతం 880 టన్నుల బంగారం నిల్వలున్నాయని, ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం అమెరికా వద్ద ఉన్న బంగారం నిల్వల్లో ఇది పదింట ఒకటో వంతు కన్నా అధికమేనని తెలిపింది.
గోల్డ్ ఇటిఎఫ్ అంటే ఏమిటి?
భౌతికంగా కాకుండా యూనిట్ల రూపంలో బంగారంలో పెట్టుబడులకు అవకాశం కల్పించేవే గోల్డ్ ఇటిఎఫ్‌లు. అంతర్జాతీయ, దేశీయ విపణిలో బంగారం ధరల ఆధారంగా ఈ యూనిట్ల విలువ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. సాధారణంగా మనం కొనే బంగారం ఆభరణాలు, కడ్డీలు, నాణాల రూపంలో ఉంటే ఈ యూనిట్లు డీమ్యాట్ లేదా పత్రాల రూపంలో ఉంటాయి. ప్రతీ యూనిట్ విలువ ఒక గ్రాము బంగారంతో సమానం. పైగా వాటిని అత్యధిక స్వచ్ఛత గల బంగారం ధరతో దీటుగా నిర్ణయిస్తారు.
Wednesday, April 8, 2026
మత్తు వదిలింది..బుల్ రంకె వేసింది
కొద్ది నెలలుగా నిద్రమత్తులో ఉన్న బుల్ ఒక్కసారిగా మత్తు వదిలించుకుని రంకె వేసింది. తమ మధ్య సాగుతున్న యుద్ధానికి అమెరికా, ఇరాన్ రెండు వారాల విరామం ప్రకటించడం, బ్యారెల్ క్రూడాయిల్ ధర 94 డాలర్లకు దిగి రావడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడడం వంటి పరిణామాలన్నీ ఈక్విటీ మార్కెట్లో సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ఆర్‌బిఐ నూతన ఆర్థిక సంవత్సరానికి (2026-27) ప్రకటించిన తొలి ద్వైమాసిక పరపతి సమీక్షలో రెపోరేటు యథాతథ స్థితిని కొనసాగించడం కూడా మార్కెట్‌ను ఉత్తేజితం చేసింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో ఏర్పడిన ర్యాలీ సైతం మన మార్కెట్‌కు ఎనలేని శక్తిని అందించింది. ఇన్ని సానుకూలతల మధ్య బుధవారం ఈక్విటీ మార్కెట్ చాలా బలంగా ప్రారంభమై రోజంతా అదే జోరును కొనసాగించింది. ఇటీవల కాలంలో కనివిని ఎరుగని విధంగా ప్రధాన ఈక్విటీ సూచీలు 4 % పైగా లాభపడ్డాయి. అలాగే ఈక్విటీ సూచీలు వరుసగా ఐదు సెషన్లుగా ర్యాలీలో ఉన్నాయి.
- ఉదయం నుంచి అద్భుతమైన లాభాల్లో ఉన్న సెన్సెక్స్ 2946.32 పాయింట్ల లాభంతో 77,562.90 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 3018.96 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 77,635.54 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.
- ఐదు సంవత్సరాల కాలంలో సెన్సెక్స్‌కు అత్యుత్తమ ట్రేడింగ్ దినం ఇదే.
- బిఎస్ఇలోని షేర్లలో 3859 స్టాక్‌లు లాభాలతో ముగియగా 537 స్టాక్‌లు మాత్రమే నష్టపోయాయి. 101 స్టాక్‌లు తటస్థంగా ఉండిపోయాయి.
- బిఎస్ఇ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 4.93%, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 4.01% లాభపడ్డాయి.
- నిఫ్టీ ఇంట్రాడేలో 901.5 పాయింట్ల లాభంతో 24,025.15 స్థాయిని తాకింది. చివరికి 873.70 పాయింట్ల నికర లాభంతో 23,997.35 వద్ద ముగిసింది.
- నిఫ్టీ గత 11 నెలల కాలంలో ఒక్క రోజులో నమోదు చేసిన గరిష్ఠ లాభం ఇదే.
- బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 13.89% పతనమై 94.09 డాలర్లు పలికింది.
- డాలర్ మారకంలో భారతీయ కరెన్సీ రూపాయి 47 పైసలు లాభపడి 92.59 వద్ద ముగిసింది.
- రంగాల వారీ సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. రియల్టీ ఇండెక్స్ గరిష్ఠంగా 6.76% లాభపడింది.
ప్రపంచ మార్కెట్లలోనూ అదే జోరు
ప్రపంచ మార్కెట్లలో కూడా విశేషమైన ర్యాలీ చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 6.87%, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ 5.39% లాభపడ్డాయి. షాంఘై ఎస్ఎస్ఇ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ కూడా మంచి ర్యాలీలు సాధించాయి.
Monday, April 6, 2026
ఈ వారంలో 23100 పైన బుల్లిష్
ఏప్రిల్ 06-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్
------------------------------
తిథి : చైత్ర శుక్ల చతుర్దశి
నక్షత్రం : ఉత్తర
అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు
ట్రెండ్ మార్పు సమయం :ఉదయం 9.59
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 12.54 వరకు మెరుగ్గా ఉండి తర్వాత మధ్యాహ్నం 3.56 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1 గంట సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Tuesday, March 31, 2026
చీకట్లో చిరుదివ్వె 2026-27...
2026 ఆర్థిక సంవత్సరాన్నిఈక్విటీ మార్కెట్‌కు రెండు ధ్రువాలుగా అభివర్ణించవచ్చు. ప్రథమార్ధం మన మార్కెట్ల బలానికి, ఆశావహ దృక్పథానికి చిహ్నం అయితే ద్వితీయార్ధం ప్రత్యేకించి మార్చి త్రైమాసికం మార్కెట్లపై ప్రపంచ పరిణామాల ప్రభావానికి ప్రతీకగా పరిగణించాలి. దేశీయంగా చక్కని లిక్విడిటీ, రాబడుల్లో నిలకడ, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో ఈ ఏడాది ఎంతో ఆశావహంగా ప్రారంభమయింది. 2025 కాలెండర్ సంవత్సరం ముగింపు సమయంలో మార్కెట్లు రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరాయి. కాని భౌగోళిక, రాజకీయ కల్లోలం చివరి త్రైమాసికంలో మార్కెట్‌ను కల్లోల సంద్రంలోకి నెట్టింది. మార్కెట్ సెంటిమెంట్ పాతాళానికి పడిపోయింది.
Monday, March 30, 2026
అయ్యో...రూపాయి
భారత కరెన్సీ రూపాయి 2026 ఆర్థిక సంవత్సరంలో భారీ పతనాన్ని చవి చూసింది. గత ఏప్రిల్ నుంచి మార్చి 30 మధ్య కాలంలో ఏకంగా 9.88% పతనాన్ని నమోదు చేసింది. 14 సంవత్సరాల కాలంలో రూపాయికిది అతి భారీ పతనం. ఇంతకు ముందు 2012 ఆర్థిక సంవత్సరంలో డాలర్ మారకంలో రూపాయి విలువ 12.4% పడిపోయింది. కరెంట్ అకౌంట్ లోటు 4.2 శాతానికి దూసుకుపోయింది. ఒక్క రూపాయే కాదు...ఇతర ఆసియా దేశాల కరెన్సీలు కూడా 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టపోయాయి. జపాన్ యెన్ 6%, ఫిలిప్పీన్స్ పెసో 5.74% క్షీణించాయి.
ఎందుకలా జరిగింది..?
మన మార్కెట్ నుంచి గత ఏడాది కాలంలో విదేశీ నిధులు భారీ ఎత్తున తరలిపోవడం రూపాయిని బలహీనపరిచింది. దీనికి తోడు పెరిగిన క్రూడాయిల్ ధరలు, ప్రపంచ కరెన్సీలతో డాలర్ బలపడడం, ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు, వ్యవస్థలో లిక్విడిటీ కొరత కూడా రూపాయిని కుంగదీశాయి. 2026 సంవత్సరం విదేశీ ఉప్పెన వంటిదని, దేశీయ పరిస్థితుల వల్ల కాకుండా విదేశీ పరిణామాలకే రూపాయి కుప్పకూలిందని దక్షిణ కొరియాకు చెందిన షిన్‌హాన్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ సునాల్ సోధానీ అన్నారు. ప్రధానంగా భారత దిగుమతి ఆధారనీయత పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందని చెప్పారు. భారతీయ వస్తు, సేవలపై అమెరికా భారీగా సుంకాలు విధించడంతో ఈ పతనం తీవ్రత మరింత పెరిగిందని, దానికి పశ్చిమాసియా సంక్షోభం అగ్నికి ఆజ్యం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడాయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లకు పై స్థాయికి దూసుకుపోయి రూపాయిని కోలుకోలేని దెబ్బ తీసింది. నానాటికీ పతమవుతున్న రూపాయిని ఆదుకునేందుకు ఈ ఏడాది కాలంలో జనవరి వరకు ఆర్‌బిఐ 5507.3 కోట్ల డాలర్లను మార్కెట్లో విక్రయించినా ఫలితం లేకపోయింది. చిట్టచివరికి సంవత్సరం చివరి రోజున (మార్చి 30) ఒక దశలో 95 స్థాయి కన్నా దిగజారిన రూపాయి 94.70 వద్ద ఏడాదికి ముగిసింది.
Sunday, March 22, 2026
ఈ వారంలో 23500 పైన బుల్లిష్
------------------------------
నక్షత్రం : కృత్తిక
అప్రమత్తం : ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు
ట్రెండ్ మార్పు సమయం :ఉదయం 9.44; మధ్యాహ్నం 3.16
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 9.37 వరకు నిలకడగా ఉండి తర్వాత మధ్యాహ్నం 1.56 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Sunday, March 15, 2026
కుర్రాళ్లోయ్...కుర్రాళ్లు - ఖర్చుల్లో పెద్దోళ్లు
2030 నాటికి దేశ జనాభాలో 27 శాతానికి చేరనున్న యువతరం దేశంలో వ్యయాలకు చోదకశక్తిగా మారనున్నారు. వారు 1.3 లక్షల కోట్ల డాలర్ల వినియోగాన్ని శాసిస్తూ వినియోగ మార్కెట్ల దిశను నిర్దేశించనున్నట్టు రెడ్‌సీర్ స్ర్టాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదికలో తెలిపింది. వారు ప్రధానంగా అనుభవం, సుస్థిరత, డిజిటల్ సానుకూలతలపై దృష్టి సారించనున్నట్టు అంచనా వేసింది. 1997 నుంచి 2012 సంవత్సరాల మధ్య కాలంలో జన్మించిన వారు మార్కెట్ ధోరణులను ఏ విధంగా శాసించనున్నారనే అంశంపై రెడ్‌సీర్ ఆ నివేదిక ప్రచురించింది.
రెపోరేటు యథాతథం
పశ్చిమాసియా సంక్షోభం ప్రత్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను భయ కంపితుల్ని చేస్తున్న వాతావరణంలో భారత రిజర్వ్ బ...





