Sunday, February 8, 2026

ఈ వారంలో 26100 పైన బుల్లిష్

ఫిబ్రవరి 09-13 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 
  
నిఫ్టీ   :  25694 (+868) 
గత వారంలో నిఫ్టీ 26373-25492 పాయింట్ల మధ్యన కదలాడి 868 పాయింట్ల లాభంతో 25049 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 26100 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 
- 20, 50, 100, 200 డిఎంఏలు 25445, 25803, 25657, 25254 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉన్నప్పుడే దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతంగా భావించాలి. 

బ్రేకౌట్ స్థాయి : 26100      బ్రేక్ డౌన్ స్థాయి : 25400
నిరోధ స్థాయిలు : 25900, 26000, 26100 (25800 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 25500, 25400, 25300 (25600 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...

ü తులలోని విశాఖ పాదం 1 నుంచి ధనుస్సులోని మూల పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü   కుంభంలోని ధనిష్ఠ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü  కుంభంలోని శతభిషం పాదం 2 - 4  మధ్యలో  బుధ సంచారం
ü  కుంభంలోని ధనిష్ట పాదం 4  - శతభిషం పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü  మకరంలోని శ్రవణం  పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
ü మిథునంలోని పునర్వసు పాదం 2లో వృషభ నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 3లో రాహువు, సింహంలోని పుబ్బ పాదం 1లో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం      
--------------------------------- 

ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి :  మాఘ బహుళ అష్టమి        

నక్షత్రం : విశాఖ               

అప్రమత్తం :    అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు

ట్రెండ్ మార్పు సమయం : 11.43

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.38 వరకు మెరుగ్గా ఉండి తర్వాత మధ్యాహ్నం 12.22 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.22 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. . 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల  సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 25775, 25840     మద్దతు : 25570, 25500
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, February 1, 2026

నిర్మ‌ల‌మ్మ మంత్రం "జ‌నాక‌ర్ష‌ణ కాదు...జ‌న‌నాడే ప్ర‌ధానం"


దివారం ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస‌గా తొమ్మిదో బ‌డ్జెట్ ప్ర‌తిపాదించి చ‌రిత్ర సృష్టించారు. ఈ బ‌డ్జెట్ ఎన్నో విశేషాల స‌మాహారంగా ఉంది. బిజెపి అధికారాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న రెండు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఈ బ‌డ్జెట్ ఒకింత జ‌నాక‌ర్ష‌కంగా ఉంటుంద‌ని భావించిన వారికి నిరాశ త‌ప్ప‌లేదు. ఆమె సొంత రాష్ర్టం త‌మిళ‌నాడుతో పాటు కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నాయి. త‌మిళ‌నాడుకు చెందిన చేనేత శ‌క్తికి చిహ్నంగా ఆమె కంచీవ‌రం సిల్క్ చీర క‌ట్టుకుని స్వ‌రాష్ర్టం ప‌ట్ల అభిమానం చాటుకున్నారు. మోదీ ప్ర‌భుత్వంలో సుదీర్ఘ‌కాలం ప‌ని చేసిన ఆర్థిక మంత్రి ఆమె.

- బ‌డ్జెట్ త‌యారీలో "జ‌నాక‌ర్ష‌ణ కాదు...జ‌న‌నాడే ప్ర‌ధానం" అన్న మంత్రాన్ని తాను అనుస‌రించాన‌ని ఆమె ప్ర‌క‌టించారు. అందుకు దీటుగానే 85 నిముషాల పాటు సాగిన  బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఎలాంటి మెరుపులు లేదా ఆశ్చ‌ర్య‌ప‌రిచే అంశాలు లేవు. 

- "విక‌సిత్ భార‌త్ యంగ్ లీడ‌ర్స్ డైలాగ్ 2026లో ప్ర‌ధాన‌మంత్రికి యువ‌త నుంచి అనేక ఇన్నోవేటివ్ ఐడియాలు వ‌చ్చాయి. వాటిలోని ప‌లు ఐడియాలే ఈ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌కు స్ఫూర్తి. అందువ‌ల్ల ఇది పూర్తిగా యువ‌శ‌క్తి చోద‌క బ‌డ్జెట్" అని నిర్మ‌ల అన్నారు. 

- పేద‌లు, స‌మాజంలో నిరాద‌ర‌ణ‌కు, నిరాక‌ర‌ణ‌కు గుర‌వుతున్న వ‌ర్గాల సంక్షేమ‌మే న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ సంక‌ల్పం అని ఆమె నొక్కి చెప్పారు. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి ప్ర‌తిప‌క్షాల నుంచి కూడా ఎలాంటి అవాంత‌రాలు ఎదురు కాలేదు. 

- ఆమె గ‌తంలో ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్ల త‌ర‌హాలో త‌మిళ నానుడులేవీ లేవు. ఈ సారి ఏ భాష‌కు చెందిన నానుడుల‌కైనా దూరంగా ఉండాల‌ని ఆవిడ భావించిన‌ట్టున్నారు.

- నూత‌నంగా నిర్మించి ఇటీవ‌లే ప్రారంభించిన క‌ర్త‌వ్య భ‌వ‌న్‌లో త‌యారైన ఈ తొలి బ‌డ్జెట్ మూడు సంక‌ల్పాల‌ను ప్ర‌క‌టించింది. ఇంత‌కు ముందు బ‌డ్జెట్ల‌న్నీ రాష్ర్ట‌ప‌తి భ‌వ‌న్ స‌మీపంలోని నార్త్‌బ్లాక్‌లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలో త‌యార‌య్యేవి.

- బ‌డ్జెట్ ప్ర‌క‌టించిన మూడు సంక‌ల్పాలు...సుస్థిర ఆర్థిక వృద్ధిలో వేగం పెంపు, ఆకాంక్ష‌ల సాధ‌న‌-సామ‌ర్థ్యాల నిర్మాణం, స‌బ్ కా సాత్‌-స‌బ్ కా వికాస్‌. ఈ ఏడాది బ‌డ్జెట్ అంతా ఈ మూడు సంక‌ల్పాల సిద్ధికే అంకితం అయింది.

మోదీ సార‌థ్యంలోని మా ప్ర‌భుత్వం "మాట‌లు కాదు...కార్యాచ‌ర‌ణ‌, సంస్క‌ర‌ణ‌, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కే నిర్ణ‌యాత్మ‌కంగా పెద్ద‌పీట వేసింది" అని నిర్మ‌ల బ‌డ్జెట్ ప్రారంభంలో ప్ర‌క‌టించారు. 

"దేశంలో నిజాయ‌తీప‌రులైన ప‌న్ను చెల్లింపుదారులున్నారు. వారు బ‌కాయిల‌న్నీ చెల్లించి వివాదాల‌కు తెర దించాల‌నుకుంటున్నారు. కాని పెనాల్టీ అన్న వ్య‌తిరేక భావంతో వారంద‌రూ ముందుకు రావ‌డంలేదు. ఇప్పుడు వారు పెనాల్టీకి బ‌దులుగా అద‌నంగా కొంత సొమ్ము చెల్లించ‌డం ద్వారా కేసుల నుంచి విముక్తులు కావ‌చ్చు" అన్న ప్ర‌క‌ట‌న‌తో జైహింద్ అంటూ ఆమె బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగించారు. 




ఈ వారంలో 26100 పైన బుల్లిష్

ఫిబ్రవరి 09-13 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  25694 (+868 )   గత వారంలో నిఫ్టీ 26373-25492 పాయింట్ల మధ్యన కదలాడి...