Thursday, October 14, 2021

సెన్సెక్స్ @ 61000

ఈక్విటీ మార్కెట్ లో రికార్డు ర్యాలీ అడ్డూ, ఆపూ లేకుండా కొన‌సాగుతోంది. కేవ‌లం 21 రోజుల వ్య‌వ‌ధిలో సెన్సెక్స్ మ‌రో 1000 పాయింట్లు లాభ‌ప‌డి 61000 పాయింట్ల మైలురాయిని దాటింది. సెప్టెంబ‌ర్ 24వ తేదీన సెన్సెక్స్ 60000 పాయింట్ల మైలురాయిని దాటింది. స్థూల ఆర్థికాంశాలు ప‌టిష్ఠంగా ఉండ‌డం, సానుకూల ప్ర‌పంచ సంకేతాల న‌డుమ ఈక్విటీ సూచీ గురువారంనాడు కూడా రికార్డు స్థాయిలో ప‌రుగు తీసింది. ఈక్విటీ సూచీలు లాభ‌ప‌డ‌డం వ‌రుస‌గా ఇది ఆరో రోజు.  సెన్సెక్స్ 568.90 పాయింట్లు లాభ‌ప‌డి 61305.95 వ‌ద్ద క్లోజ‌యింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 61353.25 పాయింట్ల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. నిఫ్టీ 176.80 పాయింట్లు లాభ‌ప‌డి 18338.55 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో 18350.25 స్థాయిని తాకింది. దీంతో వారం మొత్తంలో సెన్సెక్స్ 1246.89 పాయింట్లు, నిఫ్టీ 443.35 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. అక్టోబ‌ర్ 6వ తేదీ నుంచి సాధించిన వ‌రుస లాభాల‌తోబిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.10,56,157.81 కోట్లు పెరిగి రూ.2,72,76,704.86కి చేరింది.  

శుక్ర‌వారం సెల‌వు

ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శుక్ర‌వారం స్టాక్‌మార్కెట్ కు సెల‌వు. 


No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...