Sunday, August 28, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17850 ఫైన బుల్లిష్          

(ఆగస్ట్ 29-సెప్టెంబర్ 2 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17559 (-199)

గత వారంలో నిఫ్టీ 17345 - 17727 పాయింట్ల మధ్యన కదలాడి 199 పాయింట్ల నష్టంతో  17559 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17850 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్  అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17107, 16570, 16803, 16982 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17950      బ్రేక్ డౌన్ స్థాయి : 17150

నిరోధ స్థాయిలు : 17750, 17850, 17950 (17650 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17350, 17250, 17150 (17450 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం 2 నుంచి వృశ్చికంలోని విశాఖ పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- సింహంలోని మఖ పాదం 4 - పుబ్బ పాదం 1 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం 4 - హస్త పాదం 1 మధ్యలో బుధ సంచారం

- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4 - సింహంలోని మఖ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని కృత్తిక పాదం 4లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 3 లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1-2 మధ్యలో కన్య నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 

--------------------------------- 

ప్రారంభ సెషన్ బలం (సోమవారానికి) 

తిథి : భాద్రపద శుక్ల విదియ                            

నక్షత్రం : ఉత్తర             

అప్రమత్తం :     ఆర్ద్ర, స్వాతి. శతభిషం నక్షత్ర;  తుల, కుంభ రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  10.31

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 9.51 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 2.17 వరకు మెరుగ్గాను, ఆ తర్వాత చివరి వరకు నిలకడగాను  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.50 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17660, 17775      మద్దతు : 17465, 17375
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, August 21, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17350 దిగువన బేరిష్          

(ఆగస్ట్ 22-26 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17758 (+60)

గత వారంలో నిఫ్టీ 17711 - 17992 పాయింట్ల మధ్యన కదలాడి 60 పాయింట్ల లాభంతో  17758 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17350 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్  అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 16863, 16422, 16824, 16998 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18150      బ్రేక్ డౌన్ స్థాయి : 17350

నిరోధ స్థాయిలు : 17950, 18050, 18150 (17850 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17550, 17450, 17350 (17650 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- మిథునంలోని ఆర్ద్ర పాదం 1 నుంచి కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- సింహంలోని మఖ పాదం 2-3 మధ్యలో రవి సంచారం 

- కెన్యాలోని ఉత్తర ఫల్గుణి పాదం 2-3 మధ్యలో బుధ సంచారం

- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని కృత్తిక పాదం 4లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 3-4 మధ్యలో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి : శ్రావణ బహుళ ఏకాదశి                           

నక్షత్రం : ఆర్ద్ర            

అప్రమత్తం :    ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; కర్కాటక, వృశ్చిక  రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  12.38

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.20 నుంచి 12.30 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 2.45 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17860, 17950      మద్దతు : 17650, 17550
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, August 15, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17300 దిగువన బేరిష్        

(ఆగస్ట్ 16-19 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17698 (+300)

గత వారంలో నిఫ్టీ 17360 - 17725 పాయింట్ల మధ్యన కదలాడి 300 పాయింట్ల లాభంతో  17698 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17300 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్  అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 16588, 16317, 16825, 16993 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18100      బ్రేక్ డౌన్ స్థాయి : 17300

నిరోధ స్థాయిలు : 17900, 18000, 18100 (17800 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17500, 17400, 17300 (17600 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- మీనంలోని రేవతి పాదం 3 నుంచి వృషభంలోని కృత్తిక పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4 - సింహంలోని మఖ పాదం 1 మధ్యలో రవి సంచారం 

- సింహంలోని పుబ్బ పాదం 4 - ఉత్తర ఫల్గుణి పాదం 1 మధ్యలో బుధ సంచారం

- కర్కాటకంలోని పుష్యమి పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని కృత్తిక పాదం 3లో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 4లో రాహువు, కన్యలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (మంగళవారానికి) 

తిథి : శ్రావణ బహుళ పంచమి                          

నక్షత్రం : రేవతి           

అప్రమత్తం :    కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర;  మేష, కర్కాటక  రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15810.85   (-24.50)   

ట్రెండ్ మార్పు సమయం :  3.00

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.43 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 3.08 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.50 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 3 గంటలకు క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17790, 17890      మద్దతు : 17600, 17550
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, August 14, 2022

భార‌త వారెన్ బ‌ఫెట్ రాకేష్ ఝున్ ఝున్ వాలా ఇక లేరు

"భార‌త వారెన్ బ‌ఫెట్"గా ప్ర‌ఖ్యాతి గ‌డించిన స్టాక్ మార్కెట్ గురు రాకేష్ ఝున్ ఝున్ వాలా ఆదివారం ఉద‌యం క‌న్ను మూశారు. ఆయ‌న వ‌య‌సు 62 సంవ‌త్స‌రాలు. గ‌త కొద్ది కాలంగా ఆయ‌న మూత్ర‌పిండాల వ్యాధితో బాధ ప‌డుతున్నారు. ఆయ‌న డ‌యాల‌సిస్ పై ఉన్నారు. ఇటీవ‌లే ఆయ‌నకు యాంజియోప్లాస్టీ కూడా జ‌రిగింది.  గ‌త కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న వీల్ చెయిర్ లో కూచుని మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు క‌నిపించారు. తాను ఎంతో ఇష్ట‌ప‌డి ప్రారంభించిన ఆకాశా ఎయిర్ ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో కూడా వీల్ చెయిర్ లోనే ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆదివారం ఉద‌యం ఆయ‌నకు గుండెపోటు రావ‌డంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. కాని అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. ఆక‌స్మిక గుండెపోటు కార‌ణంగానే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు స‌ర్టిఫికెట్ ఇచ్చారు. రాకేష్ కు భార్య‌, ముగ్గురు సంతానం ఉన్నారు. ఇన్వెస్ట‌ర్‌, వ్యాపార‌వేత్త‌, ట్రేడ‌ర్ అయిన ఝున్ ఝున్ వాలా బిగ్ బుల్ గా ప్ర‌ఖ్యాతి గ‌డించారు. 5.8 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ఆయ‌న దేశంలో 36వ సంప‌న్న భార‌తీయుడుగా ఫోర్బ్స్ 2021లో ప్ర‌క‌టించింది. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారి కుమారుడైన రాకేష్ స్వ‌యంగా చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌. 

రూ.5 వేల‌తో ఈక్విటీల్లో అడుగు

కేవ‌లం రూ.5 వేల పెట్టుబ‌డితో రాకేష్ ఝున్ ఝున్ వాలా ఈక్విటీ మార్కెట్ ప్ర‌యాణం ప్రారంభించారు. త‌న తండ్రి పెట్టుబ‌డులు స‌మ‌తూకం చేయ‌డం గ‌మ‌నించిన త‌న‌కు బాల్య‌ద‌శ నుంచే ఈక్విటీ మార్కెట్ పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి ఏర్ప‌డింద‌ని ఝున్ ఝున్ వాలా ఇటీవ‌ల కొన్ని ఇంట‌ర్వ్యూల్లో తెలిపారు. కేవ‌లం 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో 1985లో ఆయ‌న తొలి పెట్టుబ‌డి పెట్టారు. ఆ డ‌బ్బు కూడా త‌న బంధువు నుంచి అప్పుగా తెచ్చుకున్నారు. ఆయ‌న పెట్టుబ‌డిని ప్రారంభించే స‌మ‌యానికి బిఎస్ఇ సెన్సెక్స్  150 పాయింట్లుంది. ఇప్పుడ‌ది 60000 స‌మీపంలో ట్రేడ‌వుతోంది.  పెట్టుబ‌డుల్లో రిస్క్ తీసుకోగ‌ల స్వ‌భావం కీల‌క‌మ‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ అందుకు సిద్ధ‌మై రంగంలోకి రావాల‌ని ఆయ‌న స‌ల‌హా ఇస్తారు. ఎప్పుడూ విజ‌య‌ప‌థంలో ఉన్న షేర్ల‌ను ఎంపిక చేసుకుంటూ ఆయ‌న మార్కెట్ గురుగా ఎదిగారు. 36కి పైగా కంపెనీల్లో ఆయ‌న పెట్టుబ‌డులున్నాయి. వాటిలో గ‌డియారాలు, ఆభ‌ర‌ణాల త‌యారీ కంపెనీ, టాటా గ్రూప్ కంపెనీల్లో ఒక‌టైన టైటాన్ పెట్టుబ‌డి కీల‌క‌మైన‌ది. టైటాన్ లో ఆయ‌న‌కు గ‌ల 5.05 శాతం పెట్టుబ‌డుల విలువ రూ.11 వేల కోట్లు. ఆప్టెక్ లో ఆయ‌న గ‌రిష్ఠ పెట్టుబ‌డి (23.37 శాతం వాటా) కాగా స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ (17.49 శాతం), మెట్రో బ్రాండ్స్ (14.43 శాతం), ఎన్ సిసి లిమిటెడ్ (2.62 శాతం) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

తొలి పెట్టుబ‌డితోనే లాభం

1986లో ఆయ‌న ఈక్విటీ మార్కెట్  పెట్టుబ‌డుల నుంచి భారీ లాభం అందుకున్నారు. టాటా టీకి చెందిన 5000 షేర్లు రూ.43 ధ‌ర‌లో కొన‌గా మూడు నెల‌ల్లోనే ఆ స్ర్కిప్ రూ.143కి చేరింది. కేవ‌లం మూడేళ్ల వ్య‌వ‌ధిలో ఆయ‌న రూ.20 ల‌క్ష‌ల నుంచి 25 ల‌క్ష‌లు ఆర్జించారు. ఆయ‌న‌కు రేర్ ఎంట‌ర్ ప్రైజ్  పేరిట  స్టాక్ ట్రేడింగ్ కంపెనీ కూడా ఉంది. త‌న పేరులోని మొద‌టి రెండ‌క్ష‌రాలు రా, త‌న భార్య రేఖ పేరులోని తొలి రెండ‌క్ష‌రాలు ర్ తీసుకుని కంపెనీ పేరు పెట్టుకున్నారు. రేఖ కూడా స్వ‌యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట‌ర్‌.

ఝున్ ఝున్ వాలా పెట్టుబ‌డులున్న కంపెనీలివే...

స్టార్ హెల్త్, రాలీస్ ఇండియా, కెన‌రాబ్యాంక్‌, ఇండియ‌న్ హోట‌ల్స్ కంపెనీ, ఆగ్రోటెక్ ఫుడ్స్, న‌జారా టెక్నాల‌జీస్‌, టాటా మోటార్స్.

మీడియా, ఆప్టెక్ కంపెనీల‌కు చైర్మ‌న్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  అలాగే వైస్రాయ్ హోట‌ల్స్, కాంక‌ర్డ్ బ‌యోటెక్‌, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీల్లో బోర్డుల్లో ఆయ‌న డైరెక్ట‌ర్ గా ఉన్నారు. 

బాల్యం, విద్యాభ్యాసం

ఝున్ ఝున్ వాలా 1960 జూలై 5వ తేదీన ఒక రాజ‌స్తానీ కుటుంబంలో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి ఆదాయ‌పు ప‌న్ను శాఖ క‌మిష‌న‌ర్ గా ప‌ని చేశారు. సిడెన్ హామ్ క‌ళాశాల‌లో డిగ్రీ పూర్తి చేసుకున్న త‌ర్వాత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఎన్ రోల్ అయ్యారు. 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...