Sunday, November 27, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18925 పైన బుల్లిష్       

(నవంబర్ 28-డిసెంబర్ 2 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18533 (+225)

గత వారంలో నిఫ్టీ 18136 - 18528 పాయింట్ల మధ్యన కదలాడి 225 పాయింట్ల లాభంతో 18533 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18925 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17926, 17704, 17001, 17036 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18925      బ్రేక్ డౌన్ స్థాయి : 18125

నిరోధ స్థాయిలు : 18725, 18825, 18925 (18625 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18325, 18225, 18125 (18425 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- ధనుస్సులోని ఉత్తరాషాఢ పాదం 4 నుంచి మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని అనురాధ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 

- వృశ్చికంలోని జ్యేష్ఠ  పాదం 2-4 మధ్యలో బుధ సంచారం

- వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 1లో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 

--------------------------------- 

మిడ్ సెషన్ శక్తివంతం (సోమవారానికి) 

తిథి : మార్గశిర శుక్ల సప్తమి                                

నక్షత్రం : ఉత్తరాషాఢ                

అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; కుంభ, వృషభ  రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  10.27

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ నిలకడగా ప్రారంభమై 10.25 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి 12.15 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.48 వరకు మెరుగ్గాను, తదుపరి చివరి వరకు నిలకడగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11 గంట సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.30 తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.45  సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18625, 18725     మద్దతు : 18450, 18350
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, November 20, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18700 పైన బుల్లిష్          

(నవంబర్ 21-25 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18308 (-42)

గత వారంలో నిఫ్టీ 18210 - 18442 పాయింట్ల మధ్యన కదలాడి 42 పాయింట్ల నష్టంతో 18308 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18700 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17749, 17652, 16970, 17013 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18700      బ్రేక్ డౌన్ స్థాయి : 17900

నిరోధ స్థాయిలు : 18500, 18600, 18700 (18400 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18100, 18000, 17900 (18200 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  
- కన్యలోని చిత్త పాదం 2 నుంచి వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని అనురాధ పాదం 1-2 మధ్యలో రవి సంచారం 

- వృశ్చికంలోని అనురాధ పాదం 3 నుంచి అనురాధ  పాదం 2 మధ్యలో బుధ సంచారం

- వృశ్చికంలోని అనురాధ పాదం 3 నుంచి జ్యేష్ఠ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 2లో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 

--------------------------------- 

ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి : కార్తీక బహుళ త్రయోదశి                               

నక్షత్రం : చిత్త                 

అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; తుల, కుంభ  రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  12.28

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మెరుగ్గా ప్రారంభమై 11.18 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి 12.42 వరకు నిలకడగాను, తదుపరి 2.19 వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 1 గంట సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18400, 18450     మద్దతు : 18200, 18150
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, November 13, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 18750 పైన బుల్లిష్        

(నవంబర్ 14-18 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  18350 (+233)

గత వారంలో నిఫ్టీ 17969 - 18350 పాయింట్ల మధ్యన కదలాడి 233 పాయింట్ల లాభంతో  18350 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18750 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17510, 17571, 16953, 16993 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18750      బ్రేక్ డౌన్ స్థాయి : 17950

నిరోధ స్థాయిలు : 18550, 18650, 18750 (18450 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18150, 18050, 17950 (18250 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 
గ్రహగతులివే...  
- కర్కాటకంలోని పునర్వసు పాదం 4 నుంచి సింహంలోని పుబ్బ పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- తులలోని విశాఖ పాదం 4 నుంచి వృశ్చికంలోని విశాఖ పాదం 4 మధ్యలో రవి సంచారం 

- వృశ్చికంలోని విశాఖ పాదం 3 నుంచి అనురాధ  పాదం 2 మధ్యలో బుధ సంచారం

- వృశ్చికంలోని విశాఖ పాదం 4 నుంచి అనురాధ పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని మృగశిర పాదం 2లో వక్రగతిలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 2లో రాహువు, తులలోని స్వాతి పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 

--------------------------------- 

ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి : కార్తీక బహుళ షష్ఠి                               

నక్షత్రం : పునర్వసు                

అప్రమత్తం :    అశ్విని, మఖ, మూల నక్షత్ర; సింహ, ధనుస్సు  రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  1.13

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ నిలకడగా ప్రారంభమై 1.09 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి 2.47 వరకు నిస్తేజంగాను, ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.05 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18470, 18550     మద్దతు : 18250, 18150
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Thursday, November 3, 2022

ఫెడ్‌, బిఓఇ వ‌డ్డీరేట్ల భారీ పెంపు

 అమెరికాలో నాలుగో వ‌రుస పోటు

జ‌డ‌లు విచ్చి క‌రాళ నృత్యం చేస్తున్న ద్ర‌వ్యోల్బ‌ణానికి క‌ళ్లెం వేయ‌డానికి అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్‌, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ భారీగా వడ్డీపోటు వేశాయి. అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ వ‌డ్డీరేటును 0.75 శాతం పెంచింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఈ ఏడాది జూలై నుంచి వ‌డ్డీరేటును 0.75 శాతం వంతున పెంచ‌డం వ‌రుస‌గా ఇది నాలుగో సారి. ఫ‌లితంగా ఇప్ప‌టివ‌ర‌కు 3-3.25 శాతం మ‌ధ్య‌న ఉన్న క‌నీస‌ వ‌డ్డీరేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి చేరింది. 2008 త‌ర్వాత అమెరికాలోవ‌డ్డీరేటు ఇంత గ‌రిష్ఠ స్థాయిలో ఉండ‌డం ఇదే ప్ర‌థ‌మం. అయితే రాబోయే రోజుల్లో ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గే ఆస్కారం ఉన్నందు వ‌ల్ల డిసెంబ‌రు పాల‌సీలో వ‌డ్డీరేటు పెంపు ఇంత భారీ స్థాయిలో ఉండ‌క‌పోవ‌చ్చున‌ని అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ చీఫ్ జెరోమ్ పోవెల్ చెప్పారు. 

మూడు ద‌శాబ్దాల్లో బీఓఈ భారీ వ‌డ్డీపోటు

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా వ‌డ్డీరేటును 0.75 శాతం మేర‌కు పెంచింది. మూడు ద‌శాబ్దాల కాలంలో (1992 త‌ర్వాత‌)  బిఓఇ ఇంత భారీగా వ‌డ్డీరేటును పెంచ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఉక్రెయిన్ యుద్ధం కార‌ణంగా పెరిగిపోయిన ద్ర‌వ్యోల్బ‌ణంతో పాటు మాజీ ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్ త‌ప్పుడు విధానాల దుష్ప్ర‌భావం నుంచి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాపాడేందుకు బిఓఇ ఈ చ‌ర్య తీసుకుంది. ఈ పెంపుతో ఇప్పుడు యుకెలో క‌నీస వ‌డ్డీరేటు 3 శాతానికి చేరింది. తాము వ‌డ్డీరేటును ఈ స్థాయిలో పెంచి ఉండ‌క‌పోతే ద్ర‌వ్యోల్బణం మ‌రింత తీవ్రస్థాయికి పెరిగిపోతుంద‌ని బీఓఈ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ బెయిలీ అన్నారు. బ్రిట‌న్ లో ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణం నాలుగు ద‌శాబ్దాల గ‌రిష్ఠ స్థాయిలో క‌ద‌లాడుతోంది. ద్రవ్యోల్బ‌ణానికి క‌ళ్లెం వేయ‌డం కోసం బిఓఇ గ‌త ఎనిమిది విడ‌త‌లుగా  వ‌డ్డీరేట్లు పెంచుకుంటూ వ‌స్తోంది. స‌రిగ్గా ఒక‌టిన్న‌ర నెల‌ల క్రిత‌మే 0.50 శాతం పెంచింది. అయినా ద్ర‌వ్యోల్బ‌ణం ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌డుతున్న సూచ‌న‌లు లేక‌పోవ‌డంతో వ‌డ్డీరేటును మూడు ద‌శాబ్దాల కాలంలో క‌నివిని ఎరుగ‌నంత భారీగా పెంచింది. 

సుదీర్ఘ మాంద్యం ముప్పు

బ్రిట‌న్ ప్ర‌పంచంలోనే సుదీర్ఘ మాంద్యం అంచుల్లో ఉన్న‌ట్టుగా భ‌య‌ప‌డుతున్న నేప‌థ్యంలో బిఓఇ ఈ చ‌ర్య తీసుకుంది. 2024 జూన్ నాటికి రెండు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి పాటు సాగే మాంద్యంలోకి ప్ర‌వేశించ‌నున్న‌ట్టు జాతీయ గ‌ణాంకాల కార్యాల‌యం హెచ్చ‌రిస్తోంది.. 1955 త‌ర్వాత సుదీర్ఘ మాంద్యం ఇదే అవుతుంది. కేంద్ర బ్యాంకు వ‌డ్డీరేట్ల‌ను సుదీర్ఘ కాలం పాటు పెంచుతూ పోవ‌డం మంచిది కాద‌నే విష‌యం అంగీక‌రిస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం నెల‌కొన్న అస్థిర‌త‌లు విధాన‌క‌ర్త‌లు "బ‌ల‌వంతంగా స్పందించేలా చేస్తున్నాయి" అని ఆండ్రూ బెయిలీ చెప్పారు. 

ద్ర‌వ్యోల్బ‌ణంతో కేంద్ర‌బ్యాంకుల పోరాటం

సుమారుగా ప్ర‌పంచ దేశాల‌న్నీ ద్ర‌వ్యోల్బ‌ణంతో కుత‌కుత‌లాడిపోతున్నాయి. త‌మ చేతుల్లో లేని అంత‌ర్జాతీయ ప‌రిస్థితులే ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణం రెక్క‌లు విచ్చ‌డానికి  కార‌ణం. అందులోనూ ఇటీవ‌ల కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణంపై బ్యాంకుల క‌ఠిన చ‌ర్య‌లు మ‌రింత ఉదృతం అయ్యాయి. 2019 సంవ‌త్స‌రంలో ప్ర‌పంచంపై కోర‌లు సాచిన కొవిడ్-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావం నుంచి దేశాలు కోలుకుంటున్న స‌మ‌యంలో ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం విరుచుకుప‌డింది. ఈ యుద్ధం కార‌ణంగా ఏర్ప‌డిన క్రూడాయిల్ కొర‌త‌, ఇత‌ర‌త్రా స‌ర‌ఫ‌రా లోపాల కార‌ణంగా క్రూడాయిల్ ధ‌ర‌లు చుక్క‌ల‌నంటాయి. దాని ప్ర‌భావంతో ప్ర‌పంచ దేశాల్లో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగిపోయాయి. సెప్టెంబ‌రు నెల‌లోనే యుకెలో ఆహార వ‌స్తువుల ధ‌ర‌లు 14.6 శాతం పెరిగాయి. యుకెలో స‌హ‌జ‌వాయువు టోకు ధ‌ర‌లు కేవ‌లం 12 నెల‌ల కాలంలోనే  ఐదు రెట్లు పెరిగిపోయాయి. దీనికి తోడు మాంసం, రొట్టె, పాలు, గుడ్ల ధ‌ర‌లు కూడా చుక్క‌ల‌నంటాయి. వీట‌న్నింటి ప్ర‌భావం వ‌ల్ల‌  స‌గ‌టు జీవి జీవితం దుర్భ‌రంగా మారింది. ఆ ర‌కంగా ధ‌ర‌లు ఆగ‌స్టు నాటికి గ‌రిష్ఠ స్థాయికి చేరిన‌ప్ప‌టి నుంచి ఈ ధ‌ర‌లు 50 శాతం మేర‌కు త‌గ్గాయి. కాని రాబోయేది చ‌లికాలం కావ‌డం వ‌ల్ల గ్యాస్ ధ‌ర‌లు మ‌రోసారి చుక్క‌ల‌నంటే ప్ర‌మాదం ఉంది. ఇవ‌న్నీ బిఓఇ ఈ క‌ఠిన చ‌ర్య తీసుకునేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి.

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...