Friday, January 12, 2024

కొత్త ఏడాదిలో కొత్త రికార్డులు

సూచీలను పరుగెత్తించిన బుల్ 


ఐటి రంగంలోని టిసిఎస్, ఇన్ఫోసిస్ ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో శుక్రవారం స్టాక్  మార్కెట్ సూచీలు కొత్త రికార్డుల దిశగా పరుగులు తీశాయి. టెక్నాలజీ, రియాల్టీ, ఆయిల్ కంపెనీలు కూడా ర్యాలీలో పలు పంచుకున్నాయి. రూపాయి పటిష్టత కూడా మార్కెట్ కు మరింత బలం చేకూర్చింది. మొత్తం మీద సర్వత్రా సానుకూల పవనాలతో సెన్సెక్స్ 847.27 పాయింట్ల  లాభంతో కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి 72568.45 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 247.35 పాయింట్ల లాభంతో 21894.55 వద్ద ముగిసింది. ఇంట్రా డే లో సెన్సెక్స్ 72720.96 పాయింట్లు, నిఫ్టీ 247.35 పాయింట్లు లాభపడ్డాయి.   

టిసిఎస్, ఇన్ఫోసిస్ లదే జోరు 

శుక్రవారం  టిసిఎస్, ఇన్ఫోసిస్ షేర్లు పరుగులు తీసి సూచీలు రికార్డ్ స్థాయిలకు పరుగులు తీయడానికి దోహదపడ్డాయి. టిసిఎస్  షేర్  4 శాతం లాభపడి రూ.3881.70 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.53,239.2 కోట్ల మేరకు పెరిగింది. ఇన్ఫోసిస్ షేర్  8 శాతం లాభపడి రూ.1612.20 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.48,652.73 కోట్ల మేరకు పెరిగింది.     

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...