Sunday, June 30, 2024

ఈ వారంలో 24850 పైన బుల్లిష్

జూలై 1-5 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  24011 (+510
) 
  
గత వారంలో నిఫ్టీ 24174 - 23350 పాయింట్ల మధ్యన కదలాడి 510 పాయింట్ల లాభంతో 24011 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 24850  కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 23985, 23746, 23600, 23212 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

- దీర్ఘకాలిక, మధ్యకాలిక ధోరణులు రెండూ బుల్లిష్ గానే ఉన్నాయి. ఈ వారాంతానికి 23700 కన్నా ఫైన ముగిస్తే స్వల్పకాలిక ధోరణి కూడా బుల్లిష్ అవుతుంది.   

బ్రేకౌట్ స్థాయి : 24350      బ్రేక్ డౌన్ స్థాయి : 23700

నిరోధ స్థాయిలు : 24225, 24325, 24425 (24110 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 23800, 23700, 23600 (23900 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 
 
Ø  గ్రహగతులివే...
ü మేషంలోని భరణి  పాదం 1 నుంచి మిథునంలోని ఆర్ద్ర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü  మిథునంలోని ఆర్ద్ర పాదం  3-4 మధ్యలో రవి సంచారం 
ü  మిథునంలోని పుష్యమి 1-3 మధ్యలో   బుధ సంచారం
ü మిథునంలోని పునర్వసు పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం
ü మేషంలోని భరణి పాదం 2లో కుజ  సంచారం
ü వృషభంలోని రోహిణి పాదం 1-2 మధ్యలో మేష నవాంశలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2లో వృషభ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1లో రాహువు, కన్యలోని హస్త పాదం 3లో కేతువు ధనుస్సు, మిథున నవాంశల్లో సంచారం        

--------------------------------- 


ప్రారంభం, ముగింపు మెరుగు (సోమవారానికి)  

తిథి :  జ్యేష్ఠ బహుళ దశమి                                                           

నక్షత్రం : భరణి      
అప్రమత్తం :   మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; మేష, సింహ రాశి జాతకులు    

ట్రెండ్ మార్పు సమయం : 12.09

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.35 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 1.42 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.   
 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 11.30 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 24100, 24200     మద్దతు : 23910, 23825
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదేకానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారంఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలిటెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమేవ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయిఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడుఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, June 23, 2024

ఈ వారంలో 23700 ఫైన బుల్లిష్

జూన్ 24-28 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  23501 (+35) 
   
గత వారంలో నిఫ్టీ 23671 - 21398 పాయింట్ల మధ్యన కదలాడి 35 పాయింట్ల లాభంతో 23501 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 23700  కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 23538, 23488, 23218, 22956 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

- దీర్ఘకాలిక, మధ్యకాలిక ధోరణులు రెండూ బుల్లిష్ గానే ఉన్నాయి. ఈ వారాంతానికి 23700 కన్నా ఫైన ముగిస్తే స్వల్పకాలిక ధోరణి కూడా బుల్లిష్ అవుతుంది.   

బ్రేకౌట్ స్థాయి : 23700      బ్రేక్ డౌన్ స్థాయి : 23200

నిరోధ స్థాయిలు : 23700, 23800, 23900 (23600 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 23300, 23200, 23100 (23400 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 
 
Ø  గ్రహగతులివే...
ü మకరంలోని ఉత్తరాషాఢ  పాదం 3 నుంచి మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü  మిథునంలోని ఆర్ద్ర పాదం  1-2 మధ్యలో రవి సంచారం 
ü  మిథునంలోని మృగశిర  పాదం 4-ఆర్ద్ర పాదం 3 మధ్యలో   బుధ సంచారం
ü మిథునంలోని ఆర్ద్ర పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం
ü మేషంలోని భరణి పాదం 2లో కుజ  సంచారం
ü వృషభంలోని రోహిణి పాదం 1-2 మధ్యలో మేష నవాంశలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2లో వృషభ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1లో రాహువు, కన్యలోని హస్త పాదం 3లో కేతువు ధనుస్సు, మిథున నవాంశల్లో సంచారం        

--------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, June 4, 2024

స్టాక్‌మార్కెట్‌లో బేర్ హ‌ల్‌చ‌ల్‌


కేంద్రంలో బిజెపి నాయ‌క‌త్వంలోని ఎన్‌డిఏ సంపూర్ణ మెజారిటీ సాధించ‌లేక‌పోయింద‌న్న వార్త‌ల‌తో మంగ‌ళ‌వారం ఈక్విటీ సూచీలు కుప్ప‌కూలాయి. సోమ‌వారం ఎగ్జిట్ పోల్స్ జోష్‌లో 3.5 శాతం మేర‌కు లాభ‌ప‌డిన సూచీలు మంగ‌ళ‌వారం అంత‌కు రెట్టింపు అంటే 6 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 4389.73 పాయింట్లు (5.74 %) న‌ష్ట‌పోయి 72079.05 వ‌ద్ద ముగిసింది. ఇది రెండు నెల‌ల క‌నిష్ఠ స్థాయి. కాగా ఇంట్రాడేలో ఈ సూచీ 6234.35 పాయింట్లు (8.15 %) న‌ష్ట‌పోయి ఐదు నెల‌ల క‌నిష్ఠ‌స్థాయి 70234.43 పాయింట్ల‌ను తాకింది. ఎన్ఎస్ఇ ప్ర‌ధాన సూచీ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 1982.45 (8.52%) న‌ష్ట‌పోయి 21281.45 పాయింట్ల‌కు దిగ‌జారి చివ‌రికి న‌ష్టాన్ని1379.40 పాయింట్ల‌కు ప‌రిమితం చేసుకుని 21884.50 (5.93%) వ‌ద్ద ముగిసింది. కోవిడ్‌-19 లాక్‌డౌన్ కార‌ణంగా 2020 మార్చి 23వ తేదీన సుమారు 13 శాతం న‌ష్ట‌పోయిన త‌ర్వాత మార్కెట్ ఇంత‌భారీగా న‌ష్ట‌పోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. 

పిఎస్‌యు, పిఎస్‌బి షేర్ల భారీ ప‌త‌నం

పిఎస్‌యు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, యుటిలిటీస్‌, ఎన‌ర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్‌, యంత్ర‌ప‌రిక‌రాల విభాగాల్లో భారీగా లాభాల స్వీకారం జ‌రిగింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్ర‌భుత్వ  రంగ బ్యాంకుల షేర్లు 24 శాతం మేర‌కు న‌ష్ట‌పోయాయి. పిఎస్ఇ సూచీలు 1856.70 పాయింట్లు న‌ష్ట‌పోయి 9475.10 వ‌ద్ద ముగిసింది. ప్ర‌ధానంగా ఆర్ఇ\ఇ 24.70 శాతం న‌ష్ట‌పోయి రూ.459 వ‌ద్ద ముగిసింది. ఇవి కాకుండా పిఎఫ్‌సి (21.62%), కంటైన‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (19.43%), భార‌త్ ఎల‌క్ర్టానిక్స్ లిమిటెడ్ (19.21%) భారీగా న‌ష్ట‌పోయిన షేర్ల‌లో ఉన్నాయి.  న‌ష్ట‌పోయిన ఇత‌ర షేర్లు - ఒఎన్‌జిసి (16.23%), కోల్ ఇండియా (13.54%), ఎన్‌టిపిసి (14.52%), ప‌వ‌ర్‌గ్రిడ్ (11.98%).

న‌ష్ట‌పోయిన బ్యాంకులివే...

పిఎస్‌బి సూచీ 1211.90 పాయింట్లు న‌ష్ట‌పోయి 6794.25 వ‌ద్ద ముగిసింది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో అగ్ర‌గామి అయిన ఎస్‌బిఐ షేరు ఎన్ఎస్ఇలో 19.17 శాతం న‌ష్ట‌పోయి రూ.731.95 వ‌ద్ద ముగిసింది. మార్కెట్ ముగిసే స‌మ‌యానికి ఎస్‌బిఐ మార్కెట్ విలువ‌ రూ.1.08 ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌పోయి రూ.7,00.225.05 కోట్లకు దిగ‌జారింది.  నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 4051.35 పాయింట్లు (7.95%) న‌ష్ట‌పోయి 46928.60 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 4589.20 పాయింట్లు న‌ష్ట‌పోయి 46077.85 వ‌ద్ద ముగిసింది. 2022 ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఇండెక్స్ కు అతి పెద్ద న‌ష్టం ఇదే. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (17.65%), బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (15.74%), పిఎన్‌బి (15.15%), కెన‌రా బ్యాంక్ (13.45%) న‌ష్ట‌పోయాయి.

న‌ష్ట‌పోయిన ఇత‌ర పిఎస్‌యులు...

రైల్‌టెల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (14.56%), రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ (13.16%), ఐఆర్‌సిటిసి (12.27%), బిఇఎంఎల్ (20%), భెల్ (18.88%), హెచ్ఏఎల్ (17.17%), మ‌జ‌గాన్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ (16.20%), భార‌త్ డైన‌మిక్స్, కొచ్చిన్ షిప్‌యార్డ్ (10 % వంతున‌). 

రూ.31 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం 

మంగ‌ళ‌వారంనాటి భారీ న‌ష్టంతో ఈక్విటీ ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.31 ల‌క్ష‌ల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్ ముగిసే స‌మ‌యానికి బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌) రూ.31,07,806.27 కోట్లు న‌ష్ట‌పోయి రూ.3,94,83,705.27 కోట్ల (4.73 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) వ‌ద్ద స్థిర‌ప‌డింది.

Monday, June 3, 2024

ఎగ్జిట్ పోల్‌ ఫ‌లితాల జోష్‌

  • కొత్త శిఖ‌రాల్లో ఈక్విటీ సూచీలు
  • మూడేళ్ల‌ కాలంలో ఒక్క రోజులో అతి పెద్ద లాభం న‌మోదు

ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు మార్కెట్లో ఉత్సాహం ఉర‌క‌లెత్తించాయి. బుల్ చెల‌రేగిపోయింది. ఎన్‌డిఏకి భారీ మెజారిటీతో కేంద్రంలో మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోదీ అధికారం చేప‌ట్ట‌బోతున్నార‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్ప‌డం పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచింది. ఈక్విటీ సూచీలు 3 శాతానికి పైబ‌డి లాభ‌ప‌డ్డాయి. దీనికి తోడు శుక్ర‌వారంనాడు విడుద‌లైన జిడిపి గ‌ణాంకాలు కూడా మార్కెట్ జోరుకు స‌హాయ‌ప‌డ్డాయి. అటు జిడిపి గ‌ణాంకాలు, ఇటు ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల ప్ర‌భావంతో  సోమ‌వారం ఉద‌యం నుంచి మార్కెట్ మంచి జోరు మీద ఉంది. 2000 పాయింట్ల‌కు పైగా గ్యాప్ అప్‌తో ప్రారంభ‌మైన సెన్సెక్స్ ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు అదే జోరును కొన‌సాగిస్తూ చివ‌రికి 2507.47 పాయింట్ల లాభంతో 76,468.78 పాయింట్ల వ‌ద్ద స‌రికొత్త గ‌రిష్ఠ స్థాయిలో క్లోజ‌యింది. సెన్సెక్స్ లోని 30 షేర్ల‌లో 25 లాభాల‌తో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2777.58 పాయింట్లు లాభ‌ప‌డి స‌రికొత్త ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 76,738.89 పాయింట్ల‌ను న‌మోదు చేసింది. ఎన్ఎస్ఇ ప్ర‌ధాన సూచీ నిఫ్టీ కూడా అదే జోరును కొన‌సాగించింది. ఇంట్రాడేలో 808 పాయింట్ల మేర‌కు లాభ‌ప‌డి జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 23,338.70 పాయింట్ల‌ను తాకిన నిఫ్టీ చివ‌రికి 733.20 పాయింట్ల లాభంతో మ‌రో జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 23,263.90 వ‌ద్ద ముగిసింది. మూడు సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధిలో ఈక్విటీ మార్కెట్ సూచీలు ఒక్క రోజులో ఇంత భారీగా లాభ‌ప‌డ‌డం ఇదే ప్ర‌థ‌మం. 2021 ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న అనంత‌రం ఈక్విటీ సూచీలు సుమారు 5 శాతం లాభ‌ప‌డిన త‌ర్వాత ఒకే రోజులో ఇంత భారీగా లాభ‌ప‌డ‌డం జ‌రిగింది. 2019 మే 20వ తేదీన కూడా ఎగ్జిట్ పోల్స్ ప్ర‌భావం వ‌ల్ల ఈక్విటీ సూచీలు 3 శాతం పైబ‌డి లాభ‌ప‌డ‌డం యాదృచ్ఛిక‌మే. 

- ఇక రంగాల‌వారీగా చూస్తే పిఎస్‌యు, యుటిలిటీస్‌, ఆయిల్‌, ఎన‌ర్జీ, యంత్ర‌ప‌రిక‌రాలు, రియ‌ల్టీ సూచీలు 8 శాతానికి పైగా లాభ‌ప‌డ్డాయి. 
- బ్లూచిప్ షేర్ల‌యిన ఆర్ఐఎల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఎస్‌బిఐ మంచి ర్యాలీ సాధించి సెన్సెక్స్ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిల‌కు దూసుకుపోవ‌డంలో త‌మ వంతు పాత్ర పోషించాయి. 
- అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా మంచి ర్యాలీ సాధించ‌డంతో వాటి ఉమ్మ‌డి మార్కెట్ విలువ రూ.19.42 ల‌క్ష‌ల కోట్ల‌కు దూసుకుపోయింది. అదానీ ప‌వ‌ర్  16 శాతం, అదానీ పోర్ట్స్ 10 శాతం, అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ 6 శాతం లాభ‌ప‌డ్డాయి. 
- సెన్సెక్స్ లో భారీగా లాభ‌ప‌డిన షేర్ల‌లో ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ, ప‌వ‌ర్ గ్రిడ్ (ఒక్కోటి 9 శాతం వంతున లాభం), ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్‌, రిల‌య‌న్స్, అల్ర్టాటెక్ సిమెంట్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, టాటా స్టీల్ ఉన్నాయి.
మార్కెట్ సంప‌ద‌లోనూ రికార్డు
ఈ ర్యాలీతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌) రూ.13,78,630.40 కోట్లు పెరిగి జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి రూ.4,25,91,511.54 కోట్ల‌కు (5.13 ల‌క్ష‌ల కోట్ల అమెరిక‌న్ డాల‌ర్లు) దూసుకుపోయింది.


Sunday, June 2, 2024

ఈ వారంలో 22925 పైన బుల్లిష్

జూన్ 03-07 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  22531 (-
426) 
 
గత వారంలో నిఫ్టీ 23110 - 22417 పాయింట్ల మధ్యన కదలాడి 426 పాయింట్ల నష్టంతో 22531 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22925  కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22587, 22798, 22615, 22496 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

- దీర్ఘకాలిక, మధ్యకాలిక ధోరణులు రెండూ బుల్లిష్ గానే ఉన్నాయి. ఈ వారాంతానికి 23925 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ధోరణి కూడా బుల్లిష్ అవుతుంది.   

బ్రేకౌట్ స్థాయి : 22925      బ్రేక్ డౌన్ స్థాయి : 22125

నిరోధ స్థాయిలు : 22725, 22825, 22925 (22625 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 22325, 22225, 22125 (22400 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 
 
Ø  గ్రహగతులివే...
ü మేషంలోని అశ్విని  పాదం 2 నుంచి మృగశిర  పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü వృషభంలోని కృత్తిక పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü  వృషభంలోని కృత్తిక పాదం 3-రోహిణి పాదం 2 మధ్యలో బుధ సంచారం
ü వృషభంలోని రోహిణి  పాదం 3-మృగశిర పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü మేషంలోని అశ్విని పాదం 1-2 మధ్యలో  బృహస్పతి  సంచారం
ü మేషంలోని అశ్విని పాదం 1-2 మధ్యలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2లో వృషభ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1లో రాహువు, కన్యలోని హస్త పాదం 3లో కేతువు ధనుస్సు, మిథున నవాంశల్లో సంచారం      

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (మంగళవారానికి)  

తిథి :  వైశాఖ బహుళ ద్వాదశి                                                            

నక్షత్రం : అశ్విని                               
అప్రమత్తం :  రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; మేష, సింహ రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 12.51
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.17 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 1.25 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 1.15 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22630, 22725     మద్దతు : 22425, 22325
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...