కొత్త తరానికి చెందిన కారు కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది కొత్త తరానికి చెందిన ఇంధనంతో నడిచే వాహనాలు (ఎన్ఇవి) కొనుగోలు చేయడంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కనీసం 2030 నాటికి తాము ఎన్ఇవి కొనాలనుకుంటున్నామని వారు ఒక సర్వేలో తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాల ధరలతో పోల్చితే విద్యుత్ వాహనాలపై 49 శాతం అధికంగా ఖర్చు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు అధిక శాతం మంది చెప్పారు. వాహనాల కొనుగోలుపై కొత్త తరం వినియోగదారుల మనోరధం తెలుసుకునేందుకు అర్బన్ సైన్స్ తరఫున హారిస్ పోల్ ఈ సర్వే నిర్వహించింది. ఇండియా, అమెరికా, ఆస్ర్టేలియా, చైనా, జర్మనీల్లో ఈ సర్వే నిర్వహించారు.
సర్వే ముఖ్యాంశాలు...
- కనీసం ఈ దశాబ్ది చివరి నాటికి విద్యుత్ కారు కొనాలన్నఅభిప్రాయం 83 శాతం మంది ప్రకటించారు.
- భారత్‌లో ఇవి చార్జింగ్ నెట్‌వర్క్‌ను ప్రధాన నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం ఇవిల పట్ల కొనుగోలుదార్లలో ఆసక్తి పెరిగింది.
- దేశవ్యాప్తంగా ప్రస్తుతం వివిధ నగరాల్లోను, జాతీయ రహదారుల వెంబడి 6000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. 2027 నాటికి అవి లక్షకు పెరుగుతాయని అంచనా.
- ప్రభుత్వ సానుకూల విధాన చర్యల కారణంగా ప్రజల్లో ఇవిల పట్ల సానుకూల దృక్పథం ఏర్పడింది.
No comments:
Post a Comment