సెన్సెక్స్‌లోని 30 షేర్లలో బజాజ్ ఫిన్సర్వ్ 8 శాతం, బజాజ్ ఫైనాన్స్ 6 శాతం లాభంతో టాప్ 5లో ఉన్నాయి. భారీగా లాభపడిన షేర్లలో మారుతి, టైటన్, మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, జొమాటో, అల్ర్టాటెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి. సన్ ఫార్మా ఒక్కటే నష్టపోయింది. బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా లాభపడ్డాయి.
Thursday, January 2, 2025
మార్కెట్ పరుగు
నూతన సంవత్సరానికి శుభారంభం పలికిన సెన్సెక్స్ రెండో రోజు మరింత మెరుగైన ర్యాలీని సాధించింది. ఫైనాన్షియల్, ఆటో, ఐటి రంగ షేర్లలో జరిగిన కొనుగోళ్లతో పాటు సానుకూల ఆర్థిక సంకేతాలు మార్కెట్‌ను పరుగులు తీయించాయి. ఇంట్రాడేలో 1525.46 పాయింట్లు లాభపడి 80,032.87 స్థాయికి చేరిన సెన్సెక్స్ చివరికి 1436.30 పాయింట్ల లాభంతో 79,943.71 వద్ద ముగిసింది. నెల రోజుల కాలంలో ఒక్క రోజులో సెన్సెక్స్ సాధించిన పెద్ద లాభం ఇదే. నిఫ్టీ 445.75 పాయింట్లు లాభపడి 24,188,65 వద్ద ముగిసింది. రెండేళ్ల ర్యాలీలో స్టాక్ మార్కెట్ సంపద రూ.8,52,239.27 కోట్లు పుంజుకుని రూ.4,50,47,345.71 కోట్లకు (5.25 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. గత రెండు వారాల్లో మార్కెట్ క్రిస్మస్ ర్యాలీ సాధించడంలో విఫలమైనా నూతన సంవత్సరం మాత్రం అత్యంత ప్రోత్సాహకరంగా ప్రారంభమయింది.
Subscribe to:
Posts (Atom)
మార్కెట్ పరుగు
నూతన సంవత్సరానికి శుభారంభం పలికిన సెన్సెక్స్ రెండో రోజు మరింత మెరుగైన ర్యాలీని సాధించింది. ఫైనాన్షియల్, ఆటో, ఐటి రంగ షేర్లలో జరిగిన...
-
fo r April 25, 2019 Closing Subdued Tithi : Chaitra Krishna Saptemi Nakshatra : Poorvashadha Persons born in Mrigasira, ...
-
మార్కెట్ విలువలో బిఎస్ఇ కొత్త రికార్డు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజిలో (బిఎస్ఇ) లిస్టింగ్ అయిన కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ మంగళవారం (202...
-
fo r AUGUST 07 , 2019 Second Half Subdued Tithi : Sravana Sukla Saptami Nakshatra : Swathi Persons born in Krittika, Uttara,...