Friday, March 13, 2026
2 వారాలు-రూ.34 లక్షల కోట్లు నష్టం
Sunday, February 8, 2026
ఈ వారంలో 26100 పైన బుల్లిష్
Ø గ్రహగతులివే...
తిథి : మాఘ బహుళ అష్టమి
నక్షత్రం : విశాఖ
అప్రమత్తం : అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు
ట్రెండ్ మార్పు సమయం : 11.43
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.38 వరకు మెరుగ్గా ఉండి తర్వాత మధ్యాహ్నం 12.22 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.22 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Sunday, February 1, 2026
నిర్మలమ్మ మంత్రం "జనాకర్షణ కాదు...జననాడే ప్రధానం"
ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రతిపాదించి చరిత్ర సృష్టించారు. ఈ బడ్జెట్ ఎన్నో విశేషాల సమాహారంగా ఉంది. బిజెపి అధికారాన్ని కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న రెండు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ఒకింత జనాకర్షకంగా ఉంటుందని భావించిన వారికి నిరాశ తప్పలేదు. ఆమె సొంత రాష్ర్టం తమిళనాడుతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. తమిళనాడుకు చెందిన చేనేత శక్తికి చిహ్నంగా ఆమె కంచీవరం సిల్క్ చీర కట్టుకుని స్వరాష్ర్టం పట్ల అభిమానం చాటుకున్నారు. మోదీ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పని చేసిన ఆర్థిక మంత్రి ఆమె.
- బడ్జెట్ తయారీలో "జనాకర్షణ కాదు...జననాడే ప్రధానం" అన్న మంత్రాన్ని తాను అనుసరించానని ఆమె ప్రకటించారు. అందుకు దీటుగానే 85 నిముషాల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులు లేదా ఆశ్చర్యపరిచే అంశాలు లేవు.
- "వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026లో ప్రధానమంత్రికి యువత నుంచి అనేక ఇన్నోవేటివ్ ఐడియాలు వచ్చాయి. వాటిలోని పలు ఐడియాలే ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు స్ఫూర్తి. అందువల్ల ఇది పూర్తిగా యువశక్తి చోదక బడ్జెట్" అని నిర్మల అన్నారు.
- పేదలు, సమాజంలో నిరాదరణకు, నిరాకరణకు గురవుతున్న వర్గాల సంక్షేమమే నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పం అని ఆమె నొక్కి చెప్పారు. బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదు.
- ఆమె గతంలో ప్రతిపాదించిన బడ్జెట్ల తరహాలో తమిళ నానుడులేవీ లేవు. ఈ సారి ఏ భాషకు చెందిన నానుడులకైనా దూరంగా ఉండాలని ఆవిడ భావించినట్టున్నారు.
- నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారంభించిన కర్తవ్య భవన్‌లో తయారైన ఈ తొలి బడ్జెట్ మూడు సంకల్పాలను ప్రకటించింది. ఇంతకు ముందు బడ్జెట్లన్నీ రాష్ర్టపతి భవన్ సమీపంలోని నార్త్‌బ్లాక్‌లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో తయారయ్యేవి.
- బడ్జెట్ ప్రకటించిన మూడు సంకల్పాలు...సుస్థిర ఆర్థిక వృద్ధిలో వేగం పెంపు, ఆకాంక్షల సాధన-సామర్థ్యాల నిర్మాణం, సబ్ కా సాత్-సబ్ కా వికాస్. ఈ ఏడాది బడ్జెట్ అంతా ఈ మూడు సంకల్పాల సిద్ధికే అంకితం అయింది.
మోదీ సారథ్యంలోని మా ప్రభుత్వం "మాటలు కాదు...కార్యాచరణ, సంస్కరణ, ప్రజా ప్రయోజనాలకే నిర్ణయాత్మకంగా పెద్దపీట వేసింది" అని నిర్మల బడ్జెట్ ప్రారంభంలో ప్రకటించారు.
"దేశంలో నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులున్నారు. వారు బకాయిలన్నీ చెల్లించి వివాదాలకు తెర దించాలనుకుంటున్నారు. కాని పెనాల్టీ అన్న వ్యతిరేక భావంతో వారందరూ ముందుకు రావడంలేదు. ఇప్పుడు వారు పెనాల్టీకి బదులుగా అదనంగా కొంత సొమ్ము చెల్లించడం ద్వారా కేసుల నుంచి విముక్తులు కావచ్చు" అన్న ప్రకటనతో జైహింద్ అంటూ ఆమె బడ్జెట్ ప్రసంగం ముగించారు.
Monday, January 19, 2026
2030 నాటికి భారత్ "ఎగువ మధ్యాదాయ" దేశం
"భారత్ రాబోయే నాలుగేళ్లలో... అంటే 2030 నాటికి "ఎగువ మధ్యాదాయ దేశంగా రూపాంతరం చెందనుంది. తద్వారా చైనా, ఇండోనీసియాల సరసన స్థానం సంపాదించుకోనుంది" అని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో తెలిపింది. అంతేకాదు 2028 కన్నా ముందుగానే ప్రపంచంలోని మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నట్టు కూడా తెలిపింది.
డాలర్ మారకంలో స్థూల జాతీయాదాయం (జిఎన్ఐ) ఆధారంగా దేశాలను అల్పాదాయ దేశాలు, దిగువ మధ్యాదాయ దేశాలు, ఎగువ మధ్యాదాయ దేశాలు, అధికాదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంక్ వర్గీకరిస్తుంది. 1990 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు 218 దేశాలను వర్గీకరించగా వాటిలో 51 దేశాలు అల్పాదాయ దేశాల కోవలో ఉన్నాయి. మిగతా వాటిలో 56 దిగువ మధ్యాదాయ దేశాలు, 29 ఎగువ మధ్యాదాయ దేశాలు, 39 అధికాదాయ దేశాలు ఉన్నాయి. 2024 సంవత్సరం నాటి గణాంకాల ప్రకారం అల్పాదాయ దేశాలు 26 ఉండగా 50 దిగువ మధ్యాదాయ వర్గీకరణలోకి, 54 ఎగువ మధ్యాదాయ వర్గీకరణలోకి, 87 అధికాదాయ వర్గీకరణలోకి వచ్చాయి. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది దేశాలు ఆదాయ నిచ్చెనలో ఒక్కో మెట్టు పైకి వెళ్తున్నాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ఆరు దశాబ్దాలు పట్టింది...
భారత్ 2007 సంవత్సరంలో దిగువ మధ్యాదాయ దేశంగా మారింది. అంటే అల్పాదాయ దేశం వర్గీకరణ నుంచి దిగువ మధ్యాదాయ దేశం వర్గీకరణలోకి రావడానికి 60 సంవత్సరాలు పట్టింది. భారత తలసరి జిఎన్ఐ 1962 సంవత్సరంలో 90 డాలర్లుండగా 2007 నాటికి 910 డాలర్లకు పెరిగింది. అంటే జిఎన్ఐలో 5.3% వార్షిక వృద్ధి సాధిస్తూ వచ్చింది. అలాగే భారత్ లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 60 సంవత్సరాలు పట్టిందని ఎస్‌బిఐ రీసెర్చ్ ఆ నివేదికలో తెలిపింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో 2 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇందుకు ఏడేళ్లు పట్టింది. తదుపరి 2021లో 3 లక్షల కోట్ల డాలర్లకు, 2025లో 4 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగింది. 3 నుంచి 4 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు పట్టిన సమయం నాలుగు సంవత్సరాలే కావడం విశేషం. కాగా మరో రెండేళ్లలో భారత్ 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని పేర్కొంది.
1000 డాలర్ల తలసరి ఆదాయానికి 62 సంవత్సరాలు
భారత తలసరి ఆదాయం 1000 డాలర్లకు చేరడానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 62 సంవత్సరాలు పట్టింది. 2009 సంవత్సరంలో భారత్ ఈ ఘనత సాధించింది. తలసరి ఆదాయం 2019 సంవత్సరంలో 2000 డాలర్లకు చేరింది. అంటే ఈ స్థాయికి వచ్చేందుకు 10 సంవత్సరాలు పట్టింది. మరో ఏడేళ్లలో తలసరి ఆదాయం 3000 డాలర్లకు చేరింది. మరో నాలుగు సంవత్సరాల కాలంలో అంటే 2030 నాటికి ఇది 4000 డాలర్లవుతుందని ఎస్‌బిఐ రీసెర్చ్ అంచనా వేసింది.
తలసరి జిఎన్ఐలో 7.5% వృద్ధి అవసరం
"వికసిత్ భారత్ విజన్ ప్రకారం 2047 నాటికి 13,936 డాలర్ల తలసరి జిఎన్ఐతో అధికాదాయ వర్గీకరణలోకి చేరాలంటే భారత్ ఏటా తలసరి జిఎస్ఐలో 7.5% వృద్ధిని సాధించడం అవసరం. గత 23 సంవత్సరాల కాలంలో (2001-2024) తలసరి జిఎన్ఐలో వృద్ధి 8.3% ఉన్ననేపథ్యంలో ఈ లక్ష్యం చేరడం సాధ్యంగానే కనిపిస్తోంది" అని ఆ నివేదిక పేర్కొంది. అయితే అప్పటికి అధికాదాయ దేశంగా పరిగణనలోకి వచ్చేందుకు తలసరి ఆదాయ పరిమితి కూడా పెరుగుతుందంటున్నారు. ఈ కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అప్పటికి అధికాదాయ దేశంగా మారాలంటే తలసరి జిఎన్ఐ పరిమితి 18,000 డాలర్లవుతుందనుకుంటే రాబోయే 23 సంవత్సరాల కాలంలో భారత్ తలసరి జిఎస్ఐ 8.9% పెరగాల్సి ఉంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ లక్ష్యం చేరాలంటే భారత్ సంస్కరణల అజెండాను కొనసాగించక తప్పదని తేల్చి చెప్పింది.
Sunday, January 18, 2026
ఫిబ్రవరి 1నే (ఆదివారం) కేంద్ర బడ్జెట్
ఈ వారంలో 26000 పైన బుల్లిష్
జనవరి 19-23 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్
Ø గ్రహగతులివే...
------------------------------
తిథి : మాఘ శుక్ల పాడ్యమి
నక్షత్రం : ఉత్తరాషాఢ
అప్రమత్తం : ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు
ట్రెండ్ మార్పు సమయం : 11.50
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.26 వరకు నిలకడగా ఉండి తర్వాత మధ్యాహ్నం 12.01 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Sunday, January 11, 2026
ఈ వారంలో 26000 పైన బుల్లిష్
Ø గ్రహగతులివే...
------------------------------
తిథి : పుష్య బహుళ దశమి
నక్షత్రం : స్వాతి
అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు
ట్రెండ్ మార్పు సమయం : 1.23
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 12.08 వరకు నిలకడగా ఉండి తర్వాత మధ్యాహ్నం 2.12 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.15 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
2 వారాలు-రూ.34 లక్షల కోట్లు నష్టం
- పశ్చిమాసియా మంటల్లో బూడిదైన మార్కెట్ సంపద గత రెండు వారాలుగా ప్రపంచం యావత్తు పశ్చిమాసియా సంక్షోభంతో అట్టుడికిపోతోంది. అందుకు దీటుగా...
-
fo r April 25, 2019 Closing Subdued Tithi : Chaitra Krishna Saptemi Nakshatra : Poorvashadha Persons born in Mrigasira, ...
-
fo r AUGUST 07 , 2019 Second Half Subdued Tithi : Sravana Sukla Saptami Nakshatra : Swathi Persons born in Krittika, Uttara,...
-
Stock Market created a Sunami on Monday as exit polls predicted NDA Government under Prime Minister Naredra Modi will get another term ...