కోవిడ్-19 ప్రభావం
కరోనా వైరస్ ప్రభావానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని మించిన కల్లోలంగా కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభణను అభివర్ణిస్తున్నారు. తాజాగా కోవిడ్-19 బెలారస్, లిథువేనియా, న్యూజిలాండ్, నైజీరియా, అజర్ బైజాన్లకు వ్యాపించింది. దీంతో కరోనా బారిన పడిన దేశాల సంఖ్య 57కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా వైరస్ వ్యాపించిన దేశాలన్నింటిలోనూ కలిసి మొత్తం 83 వేల కేసులు నమోదయ్యాయి. చైనాలో తాజాగా 327 కొత్త కేసులు బయటపడడంతో అక్కడ బాధితుల సంఖ్య 78,824కి చేరింది.2788 మందితో దక్షిణ కొరియా కోవిడ్-19 బాధిత దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. చైనాలో కోవిడ్-19 సోకిన మరో 44 మంది మరణించడంతో మృతుల సంఖ్య 2788కి చేరింది. త్వరితగతిన కోవిడ్-19 విజృంభిస్తున్న దేశాలు ఇటలీ, ఇరాన్ మరో 34 మరణాలు నమోదు చేయడంతో అక్కడ మృతుల సంఖ్య 388కి చేరింది.
హోటళ్లు, దుకాణాలు ఖాళీ
కోవిడ్-19 కల్లోలం వ్యాపారాలపై భారీ ప్రభావం చూపింది. దుకాణాలు, హోటళ్లు సందర్శకులు లేక బోసిపోయాయి. స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెయ్యి మందికి పైబడి ప్రజలు పాల్గొనే వేడుకలను నిషేధించింది. నిత్యం సందర్శకులతో కళకళలాడే టోక్యోలోని డిస్నీలాండ్, జపాన్ లోని యూనివర్సల్ స్టూడియో మూసివేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. హొక్కైడో దీవిలో అయితే ప్రజలు బయటకు రావద్దని ప్రకటించి ఎమర్జెన్సీ ప్రకటించారు. వ్యాపారులు తమ జీవిత కాలంలో చూసిన అతి పెద్ద కల్లోలం ఇదేనంటున్నారు. ఇటలీలొ సావెనీర్లు విక్రయించుకుని జీవితం సాగించే ఫ్లావియో గస్టాల్డి అమ్మకాలు లేకపోవడంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము దుకాణాలు ఖాళీ చేసి తాళం చెవులు యజమానులకు అప్పగించాల్సి వస్తుందన్న భయాందోళనలు వ్యక్తం చేశారు.బాంకాక్ నగరానికి పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. ఫలితంగా ప్లాటినం ఫ్యాషన్ మాల్ లోని వ్యాపారులందరూ భారీ ప్రదర్శన నిర్వహించి అద్దెలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. తన రోజువారీ వ్యాపారం 32 డాలర్లకు (వెయ్యి బహత్ లు) పడిపోయిందని వస్త్రదుకాణం నిర్వహించే కన్య యోంటారారక్ చెప్పారు. ఇదే స్థితి కొనసాగితే చివరికి దుకాణం అద్దె చెల్లించేందుకు కూడా అప్పు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోయారు. రోజూ దుకాణానికి కారులో వచ్చే ఆమె ఇప్పుడు ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఉపయోగిస్తున్నారు. అలాగే హోటల్ నుంచి ఆహారం తెప్పించుకోవడం మానేసి ఇంటి నుంచే లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్నట్టు చెప్పారు. వరదలు, రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు ఏర్పడిన స్థితి కన్నా ఇది చాలా దారుణమైన స్థితి అని ఆమె అన్నారు.

No comments:
Post a Comment