ఇన్వెస్టర్ల సంపద రూ.78 లక్షల కోట్లు వృద్ధి
ఈక్విటీ మార్కెట్లు 2021 సంవత్సరంలో కనివిని ఎరుగని వేగంతో దూసుకుపోయి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఆటుపోట్లు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకుని ఏడాది మొత్తం మీద ఇన్వెస్టర్లకు రూ.78 లక్షల కోట్ల లాభాలు అందించాయి. ఈక్విటీ మార్కెట్ల చరిత్రలో ఒక కీలకమైన సంవత్సరంగా 2021 నిలిచిపోయింది. సంవత్సరం మొత్తం మీద సెన్సెక్స్ 10,502 పాయింట్లు (21.99%), నిఫ్టీ 3372.30 పాయింట్లు (24.11%) లాభపడ్డాయి. 2021 సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజు సెన్సెక్స్ 459.50 పాయింట్లు లాభపడి 58,253.82 పాయింట్లు, నిఫ్టీ 150.10 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బిఎస్ఇ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.77,96,692.95 కోట్లు పెరిగి రూ.2,66,00,211.55 కోట్లకు చేరింది. అక్టోబర్ 18వ తేదీన చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.2,74,69,606.93 కోట్లు నమోదయింది.
- రిలయన్స్ ఇండస్ర్టీస్ రూ,16,01,382.07 కోట్లతో మార్కెట్ విలువపరంగా అగ్రగామిగా నిలవగా టిసిఎస్ (రూ.13,82,280.01 కోట్లు), హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ (రూ.8,20,164.27 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.7,94,714.60 కోట్లు), హెచ్ యుఎల్ (రూ.5,54.444.80 కోట్లు టాప్ 5లో ఉన్నాయి.
- ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ ఎన్నో మైలురాళ్లు అధిగమించింది. కీలక సూచీల్లో 9 నెలలు లాభపడగా 3 నెలలు మాత్రం నష్టాల్లో ముగిశాయి.
-------------------------------------------------
బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ...
2021 ముగింపు - రూ.2,66,00,211.55 కోట్లు
2021 గరిష్ఠం - రూ.2,74,69,606.93 కోట్లు
2020 ముగింపు - రూ.1,88,03,518.60 కోట్లు
(ఏడాదిలో వృద్ధి - రూ.32,49,689.56 కోట్లు)
==============================
2021లో సెన్సెక్స్ మైలురాళ్లివే...
అక్టోబర్ 19 - తొలిసారిగా ఇంట్రాడేటో 62000 మైలురాయి పైకి;
చారిత్రక గరిష్ఠ స్థాయి 62,245.43 పాయింట్లు నమోదు
అక్టోబర్ 14 - తొలిసారిగా 61,000 మైలురాయి పైన ముగింపు
సెప్టెంబర్ 24 - తొలిసారిగా 60,000 పైన ముగింపు
సెప్టెంబర్ 16 - తొలిసారిగా 59,000 పైన ముగింపు
సెప్టెంబర్ 3 - తొలిసారిగా 58,000 పైన ముగింపు
ఆగస్టు 31 - తొలిసారిగా 57,000 పైన ముగింపు
ఆగస్టు 27 - తొలిసారిగా 56,000 పైన ముగింపు
ఆగస్టు 18 - తొలిసారిగా ఇంట్రాడేలో 56,000 పైకి
ఆగస్టు 13 - తొలిసారిగా 55,000 పైన ముగింపు
ఆగస్టు 4 - తొలిసారిగా 54,000 పైన ముగింపు
జూలై 7 - తొలిసారిగా 53,000 పైన ముగింపు
జూన్ 22 - తొలిసారి ఇంట్రాడేలో 53,000 పైకి
ఫిబ్రవరి 15 - తొలిసారిగా 52,000 పైన ముగింపు
ఫిబ్రవరి 8 - తొలిసారిగా 51,000 పైన ముగింపు
ఫిబ్రవరి 5 - తొలిసారి ఇంట్రాడేలో 51,000 పైకి
ఫిబ్రవరి 3 - తొలిసారిగా 50,000 పైన ముగింపు
జనవరి 21 - తొలిసారి ఇంట్రాడేలో 50,000 మైలురాయి పైకి
-------------------------------------------------
చిన్న షేర్ల దూకుడు
2021 సంవత్సరంలో ప్రధానంగా చిన్న షేర్లు అద్భుతమైన పనితీరు ప్రదర్శించాయి. ఇన్వెస్టర్లకు పెట్టుబడిపై 63 శాతం లాభాలు అందించాయి. స్మాల్ కాప్ సూచి 11,359.65 పాయింట్లు (62.76%), మిడ్ కాప్ సూచి 7028.65 పాయింట్లు (39.17 %) లాభపడ్డాయి. స్మాల్ కాప్ సూచి చారిత్రక గరిష్ఠ స్థాయి 30,416.82 పాయింట్లు, మిడ్ కాప్ సూచి 27,246.34 పాయింట్లు నమోదు చేశాయి.
No comments:
Post a Comment