Sunday, December 12, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17200 దిగువన బేరిష్       



(డిసెంబర్ 13-17 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17511 (+314)

గత వారంలో నిఫ్టీ 17535 - 16950 పాయింట్ల మధ్యన కదలాడి 314 పాయింట్ల  లాభంతో 17511 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17200 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17632, 17774, 16649, 16175 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17825      బ్రేక్ డౌన్ స్థాయి : 17200

నిరోధ స్థాయిలు : 17675, 17750, 17825 (17600 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17350, 17275, 17200 (17425 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...   
 

- మీనంలోని రేవతి పాదం 2 నుంచి వృషభంలోని రోహిణి పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4 నుంచి ధనుస్సులోని మూల పాదం 1 మధ్యలో రవి సంచారం 
- ధనుస్సులోని మూల పాదం  2-4 మధ్యలో బుధ సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో శుక్ర సంచారం 
- వృశ్చికంలోని అనురాధ  పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 3-4 మధ్యలో వృశ్చిక నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 2లో వృషభ నవాంశలో శని సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 3లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 1లో కేతువు సంచారం
 

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి) 


తిథి : మార్గశిర శుక్ల దశమి               

నక్షత్రం : రేవతి     

అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి. శతభిషం నక్షత్ర; కన్య, మకర    రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17503.35   (+86.80)   

ట్రెండ్ మార్పు సమయం :  12.56

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.15 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 2.46 వరకు మెరుగ్గా ఉండి,  తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిషన్లు తీసుకుని 11.05 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12 గంటల తర్వాత ఎటిపి కన్నా ఫైన ఉంటె లాంగ్  పొజిషన్లు తీసుకుని 2.40 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17100, 17175       మద్దతు : 17410, 17325
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

1 comment:

  1. Playtech Casino (@Playtechcasino) / Twitter
    Playtech Casino! Welcome to choegocasino.com twitter Playtech Casino! Welcome to 더킹카지노 슬롯 Playtech Casino! 파라오 카지노 Sign up, deposit 우리 카지노 계열사 £10 & play for £10, get £100 in 모바일 바카라 free games,

    ReplyDelete

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...