Monday, February 27, 2023

7 రోజులు-రూ.10.42 లక్షల కోట్లు

స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో ఆవిరైన ఇన్వెస్టర్ల సంపద 



దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఏడు రోజులుగా నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ ఏడు రోజుల నష్టాలతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ రూ.10.42 లక్షల కోట్లు ఆవిరైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు సంపన్న దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచవచ్చునన్న భయాల నడుమ గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్, కొనసాగుతున్న విదేశీ నిధుల తరలింపు మార్కెట్ వరుస పట్టణాలకు కారణం. సోమవారం నాటి ట్రేడింగ్ లో కూడా సెన్సెక్స్ 175.58 పాయింట్లు నష్టపోయి 59288.35 వద్ద ముగియగా నిఫ్టీ 73.10 పాయింట్ల నష్టంతో 17392.70 వద్ద ముగిసింది. ఈ ఏడు రోజుల కాలంలో సెన్సెక్స్ 2031.16 పాంట్లు నష్టపోగా ఇన్వెస్టర్ల సంపద రూ.10,42,790.03 కోట్లు తుడిసిపుట్టుకుపోయి రూ.2,57,88,195.57 కోట్లకు దిగజారింది. గత ఐదు నెలల కాలంలో ఇంత సుదీర్ఘ కాలం మార్కెట్ నష్టాలు నమోదు చేయడం ఇదే ప్రథమం. సెన్సెక్స్ గత ఏడాది సెప్టెంబర్ లో వరుస ఏడు రోజుల నష్టాలు నమోదు చేసింది. సెన్సెక్స్ కు  ఇది నెల రోజుల కనిష్ఠ స్థాయి. సెన్సెక్స్ లో 17 కంపెనీలు, నిఫ్టీలో 33 కంపెనీల షేర్లు నష్టాలు నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇంత వరకు రూ.2313 కోట్లు తరలించుకుపోయారు.    

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...