Friday, March 15, 2024

“రిస్క్” గానే భావించాను

 

అది 1981 సంవత్సరం. నేటి ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్  స్థాప ఆలోచ కంపెనీ వ్యస్థాపకుల్లో ఒకరైన నారాయ మూర్తి దిలో మెదిలింది. భార్య సుధామూర్తి గ్గ విషయం ప్రస్తావించారు. కంపెనీ ప్రారంభించేందుకు సీడ్  కేపిటల్ అవరం అయింది. తాను పొదుపు చేసుకున్న రూ.10,250లో నుంచి రూ.10,000 ఆమె అవరానికి ఇచ్చారు. కాని నాడురిస్క్”  తీసుకుంటున్నానన్న భావతోనే సొమ్ము ఆయనకు ఇచ్చానని ఇటీవలే రాజ్య భ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సుధామూర్తి నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చెప్పారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆమె మాట్లాడుతూ అప్పటికే నారాయమూర్తి ఒక వెంచర్  ప్రారంభించి విఫలం అయ్యారు. కారణంగా పొదుపు మొత్తంలో నుంచి రూ.250 మాత్రం ఉంచుకుని మిగతా మొత్తం ఇచ్చానన్నారు.

నాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ రోజు ర్తనారాయమూర్తి చ్చి ఒక సాఫ్ట్  వేర్  కంపెనీ ప్రారంభించాలనుకుంటున్నానని చెప్పినప్పుడు ఇద్దరికీ మంచి వేతనాలు స్తున్న ఉద్యోగాలున్నాయి దా, ఇంకా ఎందుకా దూకుడు అని తాను అడిగినట్టు చెప్పారు. అనుమతి లేకుండా ముందడుగేసేది లేదని నారాయమూర్తి అప్పుడు కు చెప్పారని ఆమె అన్నారు. “అప్పటికి నా పొదుపు ఖాతాలో రూ.10,250 ఉంది. అందులో రూ.250 మాత్రం నా కోసం ఉంచుకున్నాను. తంలో కూడా సాఫ్ర్టానిక్స్  అనే సంస్థ ప్రారంభించి మూర్తి విఫమైనందు ల్ల తాను రిస్క్  తీసుకుంటున్నట్టుగానే నాడు భావించానుఅని చెప్పారు. కాని రాబోయే మూడేళ్లలో అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండని నాడు ఆయ ఎంతో విశ్వాసంతో చెప్పినట్టు ఆమె తెలిపారు. “ఇన్ఫోసిస్  ప్రారంభించిన త‌ర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది.  అది ఒక బాధ్య‌త‌, ఒక క‌ట్టుబాటు” అని ఆమె అన్నారు. ఒక కంపెనీని నిర్మించ‌డం అంటే జోక్  కాద, అందుకు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది అన్నారామె. రాజ్య‌స‌భ స‌భ్యురాలుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంపై స్పందిస్తూ “73 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఇదో కొత్త అధ్యాయం, కాని నేర్చుకోవ‌డానికి వ‌య‌సు అడ్డు కాదు” అని వ్యాఖ్యానించారు. సుధా నారాయ‌ణ‌మూర్తి ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో అక్క‌డే ఉన్న నారాయ‌ణ‌మూర్తి కూడా కాంక్లేవ్  లో మాట్లాడుతూ  “ఆమె నా క‌న్నా చాలా గొప్ప‌ద‌ని నాకు మొద‌టి రోజు నుంచి తెలుసు. ఆమె నాలో అర్ధ‌భాగంగా ఉండ‌డం నా అదృష్టం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు” అన్నారు. తొలి రోజుల్లో ఆమెను ఇన్ఫోసిస్  కంపెనీలో ఒక భాగంగా ఎందుకు చేయ‌లేదు అని ప్ర‌శ్నించ‌గా జీవితం అంటేనే నేర్చుకోవ‌డం, త‌న‌ను తాను తీర్చి దిద్దుకోవ‌డం అని నారాయ‌ణ‌మూర్తి అన్నారు. “ఆ రోజుల్లో నేను గ‌ట్టి ఆద‌ర్శ‌వాదిని.  ఆ రోజుల్లో కుటుంబ నిర్వ‌హ‌ణ‌లోని సంస్థ‌ల అరుదు కాదు. ఫ్రాన్స్ నుంచి తిరిగి వ‌చ్చిన అనంత‌రం దేశం కోసం ఏదైనా భిన్నంగా చేయాల‌నుకున్నాను. అందుకే ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కులంద‌రి క‌న్నా అత్యంత అధిక అర్హ‌త‌లున్న‌ప్ప‌టికీ కంపెనీని భార్యాభ‌ర్త‌ల కంపెనీగా కాకుండా భిన్న‌మైన‌దిగా తీర్చి దిద్దాల‌ని భావించాను. అది ఒక ఆద‌ర్శ‌వాద ద‌శ” అని మూర్తి స‌మాధానం ఇచ్చారు. తాము ఎప్పుడూ ఇన్ఫోసిస్ ను ఒక ప‌రిణ‌తి చెందిన కంపెనీగానే నిర్వ‌హించామ‌ని ఆయ‌న తెలిపారు. “నాస్ డాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన తొలి భార‌త కంపెనీ మాది. అది ఒక గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణం” అని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ లో భాగం కానందుకు తాను విచారించ‌డంలేద‌ని సుధామూర్తి పేర్కొంటూ “ఇన్ఫోసిస్  ఫౌండేష‌న్ ద్వారా నేను వాస్త‌వ జీవితంలో ఎన్నో జీవితాల‌ను స్పృశించాను. ఏ ఇత‌ర హోదా క‌న్నా దానికే నేను విలువ ఇస్తాను” అన్నారు.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...