Tuesday, October 29, 2024

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. బెంగ‌ళూరు న‌గ‌రంలో స‌గ‌టు వేత‌నం రూ.29,500 ఉంది. ఆ ర‌కంగా దేశంలో అధికంగా వేత‌నం చెల్లిస్తున్న న‌గ‌రంగా నిలిచింది. టీమ్‌లీజ్ అధ్య‌య‌నంలో ఈ విష‌యం తేలింది. స‌ర్వీసెస్ జాబ్స్, సాల‌రీస్ ప్రీమియెర్ పేరిట ఆ సంస్థ ఒక నివేదిక విడుద‌ల చేసింది. తాత్కాలిక‌, శాశ్వ‌త ఉద్యోగాల్లో వివిధ కంపెనీలు ఇస్తున్న వేత‌నాల స‌గ‌టును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. వేత‌న వృద్ధి బెంగ‌ళూరులో 9.3 శాతం ఉంది. 7.5 శాతం వృద్ధితో చెన్నై, 7.3 శాతం వృద్ధితో ఢిల్లీ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉద్యోగ మార్కెట్లో పోటీ స్వ‌భావానికి  ఇది ద‌ర్ప‌ణం ప‌డుతోంది.  నెల‌వారీ స‌గ‌టు వేత‌నం చెన్నైలో రూ.24,500 ఉండ‌గా ఢిల్లీలో రూ.27,800 ఉంది. 

నివేదిక‌లోని ముఖ్యాంశాలు...

- ముంబై, అహ్మ‌దాబాద్ నిల‌క‌డగా వేత‌న వృద్ధిని న‌మోదు చేస్తున్నాయి. ఆ ర‌కంగా అవి కీల‌క ఉపాధి కేంద్రాలుగా త‌మ ప్రాధాన్య‌త‌ను చాటి చెప్పుకొంటున్నాయి. స‌గ‌టు వేత‌నం ముంబైలో రూ.25,100 ఉండ‌గా పుణెలో రూ.24,700 ఉంది. 

- ప‌రిశ్ర‌మ ప‌రంగా చూసిన‌ట్ట‌యితే 8.4 శాతం వేత‌న వృద్ధితో రిటైల్ ప‌రిశ్ర‌మ అగ్ర‌స్థానంలో నిలిచింది. క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్ (5.2 శాతం), బిఎఫ్ఎస్ఐ (5.1 శాతం) రెండూ వృత్తి నిపుణుల‌కు బ‌ల‌మైన వృద్ధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. 

- ఎఫ్ఎంసిజి, హెల్త్‌కేర్‌, ఫార్మా, నిర్మాణ‌, రియ‌ల్ ఎస్టేట్ రంగాలు మాత్రం వేత‌నాల్లో ఒక మోస్త‌రు వృద్ధిని మాత్ర‌మే అందిస్తున్నాయి. ఈ రంగాల్లో నిపుణులైన మాన‌వ వ‌న‌రుల అవ‌స‌రం అధికంగా ఉంది. 

- వేత‌నాలు అధికంగా చెల్లిస్తున్న విభాగాల్లో టెలికాం (రూ.29,200); త‌యారీ, ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రా (రూ.28,200);  హెల్త్‌కేర్ అండ్ ఫార్మా (రూ.27,600);  నిర్మాణం, రియ‌ల్ ఎస్టేట్ (రూ.27,000) ఉన్నాయి. 

క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్, నిర్మాణం, రియ‌ల్ ఎస్టేట్ రంగాల్లో  శాశ్వ‌త‌, తాత్కాలిక ఉద్యోగుల మ‌ధ్య వేత‌నాల్లో వ్య‌త్యాసం గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డం ఆయా రంగాల్లోని కంపెనీలు ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌డుతున్నాయ‌ని, దీర్ఘ‌కాలం పాటు ఉద్యోగులు త‌మ‌తో ప‌ని చేయాల‌ని కోరుకుంటున్నాయ‌నేందుకు సంకేత‌మ‌ని టీమ్‌లీజ్ సిఇఓ కార్తిక్ నారాయ‌ణ‌న్ అన్నారు. 


Sunday, October 27, 2024

ఈ వారంలో 23750 దిగువన బేరిష్    

అక్టోబర్ 28-నవంబర్ 1 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  24181 (-673
) 
గత వారంలో నిఫ్టీ 24978 - 24074 పాయింట్ల మధ్యన కదలాడి 673 పాయింట్ల నష్టంతో 24181 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 23750  కన్నాదిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 
- 20, 50, 100, 200 డిఎంఏలు 24331, 24555, 24780, 25205 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 24500      బ్రేక్ డౌన్ స్థాయి : 23750

నిరోధ స్థాయిలు : 24400, 24500, 24600 (24300 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 23950, 23850, 23750 (24050 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   
Ø  గ్రహగతులివే...
ü సింహంలోని పుబ్బ  పాదం 2 నుంచి తులలోని చిత్త పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  తులలోని  స్వాతి  పాదం 2 - 3 మధ్యలో రవి సంచారం 
ü  తులలోని విశాఖ పాదం 3 - వృశ్చికంలోని విశాఖ పాదం 4 మధ్యలో   బుధ సంచారం
ü వృశ్చికంలోని జ్యేష్ఠ  పాదం 1 - 2 మధ్యలో శుక్ర సంచారం
ü వృశ్చికంలోని విశాఖ పాదం 4 - అనురాధ పాదం 1 మధ్యలో కుజ సంచారం
ü వృషభంలోని మృగశిర పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4లో మీన నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 3లో రాహువు, కన్యలోని హస్త పాదం 1లో కేతువు వృషభ, మేష నవాంశల్లో సంచారం     

--------------------------------- 


ద్వితీయార్ధం మెరుగు (సోమవారానికి)  
తిథి :  ఆశ్వయుజ బహుళ ద్వాదశి                                                              
నక్షత్రం : పుబ్బ           
అప్రమత్తం :    మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్ర;  సింహ, ధనుస్సు రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 3.22
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 12.25 వరకు నిలకడగాను, తదుపరి 2.15 వరకు మెరుగ్గాను ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 12.15 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 24300, 24375     మద్దతు : 24100, 24000
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, October 22, 2024

దేశం అంత‌టా బంగారం ధ‌ర ఒక‌టే

దేశంలో వేర్వేరు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు వేర్వేరుగా ఉండ‌డం మ‌నంద‌రికీ తెలిసిందే. ఇలాంటి తేడాలేవీ లేకుండా దేశం అంత‌టా బంగారం ధ‌ర ఒకేలా ఉండేలా చూడాల‌ని అఖిల భార‌త జెమ్స్ అండ్ జువెల‌రీ డొమెస్టిక్  కౌన్సిల్ (జిజెసి) భావిస్తోంది. "ఒక జాతి ఒకే బంగారం రేటు" పేరిట దేశంలో బంగారం ధ‌ర‌ల‌ను ప్రామాణీక‌రించాల‌నుకుంటున్న‌ట్టు జిజెసి తెలిపింది.  

"మ‌నం బంగారాన్ని ఒకే ధ‌ర‌కి దిగుమ‌తి చేసుకుంటున్నాం. కాని దేశీయంగా ఒక న‌గ‌రంతో పోల్చితే మ‌రో న‌గ‌రంలో బంగారం రిటైల్ ధ‌ర‌లు విభిన్నంగా ఉంటున్నాయి. దేశం అంత‌టా బంగారం రిటైల్ ధ‌ర ఒకేలా ఉండాల‌ని మేం కోరుకుంటున్నాం" అని జిజెసి మితేష్ ధోర్దా చెప్పారు. అక్టోబ‌రు 22 నుంచి డిసెంబ‌రు 9వ తేదీ వ‌ర‌కు జ‌రిగి ల‌క్కీ ల‌క్ష్మి కార్య‌క్ర‌మం ప్రారంభం సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యం తెలిపారు.

తాము ఇప్ప‌టికే స‌భ్యుల‌తో 50 స‌మావేశాలు నిర్వ‌హించి ఈ అంశం చ‌ర్చించామ‌ని, సుమారు ఎనిమిది వేల మంది వ‌ర్త‌కుల‌ను ఒకే ఛ‌త్రం కింద‌కు తీసుకురాగ‌లిగామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ మేర‌కు తాము ప్ర‌భుత్వానికి కూడా ఒక విన‌తిప‌త్రం అందించామ‌ని ఆయ‌న చెప్పారు.

"మేం ఇప్ప‌టికే వాట్స‌ప్ బ్రాడ్‌కాస్ట్ గ్రూప్‌లో సిఫార‌సు ధ‌ర‌ను స‌భ్యుల‌కు అందిస్తున్నాం. ద‌శ‌ల‌వారీగా క‌నీసం 4-5 ల‌క్ష‌ల మంది వ‌ర్త‌కుల‌కు దీన్ని విస్త‌రించాల‌న్న‌ది మా ల‌క్ష్యం" అని ధోర్దా చెప్పారు. 

2005 సంవ‌త్స‌రంలో ప్రాథ‌మికంగా 3500 మంది స‌భ్యుల‌తో జిజెసి ఏర్పాట‌యింది. వారిలో రిటైల‌ర్లు, ఆభ‌ర‌ణాల త‌యారీదారులు కూడా ఉన్నారు. 

Sunday, October 13, 2024

ఈ వారంలో 25300 పైన బుల్లిష్

అక్టోబర్ 14-18 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  24964 (-51
) 
   
గత వారంలో నిఫ్టీ 26234 - 24494 పాయింట్ల మధ్యన కదలాడి 51 పాయింట్ల నష్టంతో 24964 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 25300  కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 25003, 25015, 25460, 25394 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

- దీర్ఘకాలిక, మధ్యకాలిక ధోరణులు రెండూ బుల్లిష్ గానే ఉన్నాయి. ఈ వారాంతానికి 25300 కన్నా ఫైన ముగిస్తే స్వల్పకాలిక ధోరణి కూడా బుల్లిష్ అవుతుంది.   

బ్రేకౌట్ స్థాయి : 25300      బ్రేక్ డౌన్ స్థాయి : 24550

నిరోధ స్థాయిలు : 25175, 25275, 25375 (25075 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 24750, 24650, 24550 (24850 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü  కుంభంలోని శతభిషం  పాదం 2 నుంచి మేషంలోని భరణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü   కన్యలోని చిత్త  పాదం 2 -  తులలోని చిత్త  పాదం 3 మధ్యలో రవి సంచారం 
ü  తులలోని చిత్త పాదం 4 - స్వాతి పాదం 2 మధ్యలో   బుధ సంచారం
ü వృశ్చికంలోని విశాఖ పాదం 4 - అనురాధ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü మిథునంలోని పునర్వసు పాదం  2లో కుజ  సంచారం
ü వృషభంలోని మృగశిర పాదం 2 లో కన్య నవాంశలో వక్రగతిలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4లో మీన నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 3లో రాహువు, కన్యలోని హస్త పాదం 1లో కేతువు వృషభ, మేష నవాంశల్లో సంచారం        

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి :  ఆశ్వయుజ శుక్ల ద్వాదశి                                                              

నక్షత్రం : శతభిషం             
అప్రమత్తం :   ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి  నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 1.49
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.14 వరకు మెరుగ్గాను, తదుపరి 1.20 వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 3 గంటల వరకు మెరుగ్గాను,  చివరిలో నిలకడగా ట్రేడ్ కావచ్చు.  
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2.30 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 25075, 25125     మద్దతు : 24875, 24800
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...