"మనం బంగారాన్ని ఒకే ధరకి దిగుమతి చేసుకుంటున్నాం. కాని దేశీయంగా ఒక నగరంతో పోల్చితే మరో నగరంలో బంగారం రిటైల్ ధరలు విభిన్నంగా ఉంటున్నాయి. దేశం అంతటా బంగారం రిటైల్ ధర ఒకేలా ఉండాలని మేం కోరుకుంటున్నాం" అని జిజెసి మితేష్ ధోర్దా చెప్పారు. అక్టోబరు 22 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు జరిగి లక్కీ లక్ష్మి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు.
తాము ఇప్పటికే సభ్యులతో 50 సమావేశాలు నిర్వహించి ఈ అంశం చర్చించామని, సుమారు ఎనిమిది వేల మంది వర్తకులను ఒకే ఛత్రం కిందకు తీసుకురాగలిగామని ఆయన తెలిపారు. ఈ మేరకు తాము ప్రభుత్వానికి కూడా ఒక వినతిపత్రం అందించామని ఆయన చెప్పారు.
"మేం ఇప్పటికే వాట్సప్ బ్రాడ్‌కాస్ట్ గ్రూప్‌లో సిఫారసు ధరను సభ్యులకు అందిస్తున్నాం. దశలవారీగా కనీసం 4-5 లక్షల మంది వర్తకులకు దీన్ని విస్తరించాలన్నది మా లక్ష్యం" అని ధోర్దా చెప్పారు.
2005 సంవత్సరంలో ప్రాథమికంగా 3500 మంది సభ్యులతో జిజెసి ఏర్పాటయింది. వారిలో రిటైలర్లు, ఆభరణాల తయారీదారులు కూడా ఉన్నారు.
No comments:
Post a Comment