Friday, July 17, 2020

విదేశీ మార‌కం నిల్వ‌ల కొత్త రికార్డు

భార‌త విదేశీ మార‌కం నిల్వ‌లు జూలై 10వ తేదీతో ముగిసిన వారంలో మ‌రో కొత్త రికార్డు స్థాయికి చేరాయి. జూలై 3వ తేదీతో ముగిసిన వారంలోని నిల్వ‌ల‌తో పోల్చితే అవి 3,108 కోట్ల డాల‌ర్లు పెరిగి 5,16,362 డాల‌ర్ల‌కు చేరాయి. విదేశీ మార‌క‌పు ఆస్తుల పెరుగుద‌ల ఇందుకు దోహ‌ద‌ప‌డింది. జూన్ 5వ తేదీతో ముగిసిన వారంలో అవి తొలి సారిగా అర‌ట్రిలియ‌న్ డాల‌ర్ మైలురాయిని దాటాయి. అదే తేదీ నాటికి దేశంలో బంగారం నిల్వ‌లు 71.2 ల‌క్ష‌ల డాల‌ర్ల మేర‌కు పెరిగి 3472.9 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి.

No comments:

Post a Comment

ఐదేళ్ల‌లో నిర్మాణ రంగం రూ.31 ల‌క్ష‌ల కోట్లు

భా ర‌త నివాస గృహాల నిర్మాణ ప‌రిశ్ర‌మ 2030 నాటికి 35,000 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.30.80 ల‌క్ష‌ల కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా. భారీగా విస్త‌రిస్తున్...