Sunday, July 26, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

10900 దిగువన బేరిష్ 
(27-31 జూలై 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  11194 (+292)

గత వారంలో నిఫ్టీ 10953-11240 పాయింట్ల మధ్యన కదలాడి 292 పాయింట్ల లాభంతో 11194 వద్ద ముగిసింది. ఈ వారంతంలో 10900 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 10773, 10177, 9760, 10962 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11500      బ్రేక్ డౌన్ స్థాయి : 10900

నిరోధ స్థాయిలు : 11350, 11425, 11500 (11275 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 11025, 10950, 10875 (11100 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------    

 గ్రహగతులివే... 


-  తులలోని చిత్త పాదం 4 నుంచి ధనుస్సులోని మూల పాదం 2 మధ్యలో చంద్ర సంచారం 

- కర్కాటకంలోని పుష్యమి పాదం 3-4 మధ్యలో రవి సంచారం 

- మిథునంలోని పునర్వసు పాదం 1-3 మధ్యలో బుధ సంచారం 

- వృషభంలోని మృగశిర పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 

- మీనంలోని రేవతి పాదం 2-3 మధ్యలో కుజ సంచారం

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 3లో కుంభ నవాంశలో వక్రగతిలో శని సంచారం 

-  ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 4లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 2లో కేతువు వృశ్చిక, వృషభ నవాంశల్లో సంచారం 
--------------------------------- 
మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి) 

తిథి :  శ్రావణ శుక్ల సప్తమి    

నక్షత్రం : చిత్త/స్వాతి 

అప్రమత్తం : పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర/ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; వృశ్చిక, మీన జాతకులు   
 
నిఫ్టీ :  11215.45      (+82.85)   

ట్రెండ్ మార్పు సమయం : 11.02

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11 గంటల వరకు నిలకడగా ఉండి తదుపరి 1.05 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  11 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్  పొజిషన్లు తీసుకుని 3.15 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11275, 11350        మద్దతు : 11125, 11050
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...