Friday, August 7, 2020

మ‌రింత పెరిగిన విదేశీ మార‌కం నిల్వ‌లు

 భార‌త విదేశీ మార‌కం నిల్వ‌లు మ‌రో చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిని చేరాయి. జూలై 31వ తేదీతో ముగిసిన వారంలో ఇవి 1193.8 కోట్ల డాల‌ర్ల మేర‌కు పెరిగి 53456.8 కోట్ల డాల‌ర్లకు చేరాయి. ఇవి 13.4 నెల‌ల దిగుమ‌తుల‌కు స‌రిపోతాయి. అంటే ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకుల‌నైనా త‌ట్టుకునే శ‌క్తి ఈ నిల్వ‌లు క‌ల్పిస్తాయి. వ‌ర్త‌మాన ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇప్ప‌టివ‌ర‌కు విదేశీ మార‌కం నిల్వ‌లు 5680 కోట్ల డాల‌ర్ల మేర‌కు పెరిగాయి. జూన్ 5వ తేదీతో ముగిసిన వారంలో నిల్వ‌లు తొలిసారిగా అర‌ట్రిలియ‌న్ డాల‌ర్ల మైలురాయిని దాటాయి. ఇదే వారంలో బంగారం నిల్వ‌లు 152.5 కోట్ల డాల‌ర్ల మేర‌కు పెరిగి 3762.5 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి. 

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...