Sunday, September 6, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

11125 దిగువన బేరిష్ 


(సెప్టెంబర్ 7-11, 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  11334 (-276)

గత వారంలో నిఫ్టీ 11304-11796 పాయింట్ల మధ్యన కదలాడి 276 పాయింట్ల నష్టంతో 11334 వద్ద నెగిటివ్ గా ముగిసింది. ఈ వారంతంలో 11125 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 11403, 11096, 10332, 10809 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి వచ్చింది. ఇది  దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11650      బ్రేక్ డౌన్ స్థాయి : 11125

నిరోధ స్థాయిలు : 11500, 11575, 11650 (11425 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 11275, 11200, 11125 (11250 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------    

గ్రహగతులివే...


- మేషంలోని భరణి పాదం 2 నుంచి మిథునంలోని మృగశిర పాదం 4 మధ్యలో చంద్ర సంచారం


- సింహంలోని పుబ్బ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 


- కన్యలోని ఉత్తర పాదం 3 నుంచి హస్త పాదం 2 మధ్యలో బుధ సంచారం 

- కర్కాటకంలోని పుష్యమి పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం 

- మేషంలోని అశ్విని పాదం 2లో వక్రగతిలో కుజ సంచారం

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 3-4 మధ్యలో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 3లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 
--------------------------------- 
ప్రారంభ సెషన్ మెరుగు  

తిథి :  భాద్రపద బహుళ పంచమి 

నక్షత్రం : భరణి 

అప్రమత్తం :  మృగశిర, చిత్త, ధనిష్ట  నక్షత్ర; మేష, సింహ రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11333.85      (-193.60)   

ట్రెండ్ మార్పు సమయం : 12.10

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 1.05 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 తర్వాత ఎటిపి కన్నాదిగువకు వస్తే తిరిగి షార్ట్ పొజిషన్లు తీసుకుని  ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11400, 11475        మద్దతు : 11250, 11175
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...