Tuesday, April 14, 2026

భార‌తీయుల ఇళ్లు... "బంగారం ఖ‌జానా"లు


భార‌తీయుల ఇళ్లు బంగారం ఖ‌జానాలుగా మారాయి. ఇటీవ‌ల అంత‌ర్జాతీయ, దేశీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిల‌కు చేరిన‌ప్ప‌టికీ భార‌తీయుల‌కు బంగారంపై మోజు మాత్రం త‌గ్గ‌లేదు.భార‌తీయ గృహ‌స్థుల ద‌గ్గ‌ర ఉన్న బంగారం నిల్వ‌లు ప్ర‌పంచంలోని 10 అగ్ర‌శ్రేణి కేంద్రీయ బ్యాంకుల వ‌ద్ద ఉన్న నిల్వ‌ల క‌న్నా అధికంగా ఉన్న‌ట్టు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. అసోచాం తాజా నివేదిక‌లో ఈ విష‌యం వెల్ల‌డించింది. భార‌త‌దేశ ప్ర‌స్తుతం బంగారం నిల్వ‌ల విష‌యంలో  ప్ర‌పంచంలోనే 8వ స్థానంలో ఉన్న‌ద‌ని వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డ‌బ్ల్యుజిసి) చెబుతోంది. భార‌త్ వ‌ద్ద ప్ర‌స్తుతం 880 ట‌న్నుల బంగారం నిల్వ‌లున్నాయ‌ని, ప్ర‌పంచంలో అత్యంత సంప‌న్న దేశం అమెరికా వ‌ద్ద ఉన్న బంగారం నిల్వ‌ల్లో ఇది ప‌దింట ఒక‌టో వంతు క‌న్నా అధిక‌మేన‌ని తెలిపింది.  

విలువ 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు
భార‌త్ వ‌ద్ద ఉన్న బంగారం నిల్వ‌ల విలువ 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌ని ప‌లు అంచ‌నాలు తెలుపుతున్నాయి. ప్ర‌పంచంలో అతి పెద్ద‌ బంగారు ఆభ‌ర‌ణాల కొనుగోలు దేశంగా భార‌త్ నిలుస్తోంది. భార‌తీయుల ప్ర‌ధాన పెట్టుబ‌డి సాధ‌నం కూడా బంగార‌మే. గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా బార్‌లు, నాణేల రూపంలో కూడా కొనుగోళ్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. భార‌త‌దేశంలో గృహ‌స్థుల ద‌గ్గ‌ర ఉన్న బంగారం నిల్వ‌ల విలువ అమెరికా, చైనా మిన‌హా ప్ర‌పంచంలోని ఇత‌ర ప్ర‌ధాన‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల జిడిపి క‌న్నా అధికమ‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల గృహ‌స్థుల సంప‌ద‌పై అత్యంత సానుకూల ప్ర‌భావం చూపింద‌ని అంటున్నారు. దీని వ‌ల్ల బంగారం వినియోగం ఉత్తేజిత‌మై త‌యారీ సామ‌ర్థ్యాలు విస్త‌రించడంతో పాటు మ‌రింత మందికి ఉపాధి కూడా ల‌భిస్తుంది. 

ఇదే మ‌దుపుగా మారితే...
ఈ బంగారం అంతా గృహ‌స్థుల బీరువాల్లో వృధాగా మూలుగుతూ ఉండ‌డం విచారించ‌ద‌గ్గ అంశ‌మ‌ని అసోచాం అంటోంది. ఇదే బంగారాన్ని ఉత్పాత‌క కార్య‌క‌లాపాల‌కు మ‌ర‌లించిన‌ట్ట‌యితే భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఎన్నో రెట్లు ఉత్తేజితం అవుతుంద‌ని చెబుతోంది. ఈ బంగారాన్ని మ‌దుపుగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి తీసుకురావ‌డం వ‌ల్ల ఆర్థిక రంగానికి ఎంతో కీల‌క‌మైన త‌యారీ, మౌలిక వ‌స‌తులు, వ్య‌వ‌సాయం వంటి రంగాల‌ను వృద్ధిప‌థంలో న‌డిపించ‌వ‌చ్చున‌న్న‌ది అసోచాం అభిప్రాయం. మొత్తం బంగారంలో 2% బంగారాన్ని ప్ర‌తీ ఏడాది ఆర్థిక‌ప‌ర‌మైన ఆస్తులుగా మార్చినా 2047 నాటికి భార‌త జిడిపికి 7.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు జోడ‌వుతుంద‌ని నిపుణులంటున్నారు. 2047 నాటికి భార‌త జిడిపి 34 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. దానికి ఈ 7.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌ను జోడించిన‌ట్ట‌యితే మొత్తం జిడిపి 4.15 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుతుంద‌ని చెబుతున్నారు.

బంగారం రుణాలు రూ.24.34 ల‌క్ష‌ల కోట్లు
ఇటీవ‌ల కాలంలో దేశంలో బంగారం రుణాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. 2025-26 సంవ‌త్స‌రంలో బంగారం, ఆభ‌ర‌ణాల రుణాల విలువ రూ.24.34 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. 

గోల్డ్ ఇటిఎఫ్‌ల‌కు ఆద‌ర‌ణ‌
ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఇటిఎఫ్‌ల‌లో నిధుల రాక రూ.31,561 కోట్లుగా న‌మోద‌యింది. ప్ర‌స్తుత అస్థిర‌, క‌ల్లోలిత ప్ర‌పంచంలో సుర‌క్షిత పెట్టుబ‌డి సాధ‌నంగా ప్ర‌జ‌లు బంగారానికి మొగ్గు చూప‌డ‌మే ఇందుకు కార‌ణం. గ‌త ఏడాది ఇదే త్రైమాసికంలో గోల్డ్ ఇటిఎఫ్‌ల‌లోకి రూ.5,654 కోట్ల నిక‌ర పెట్టుబ‌డులు వ‌చ్చాయి. జ‌న‌వ‌రిలో రికార్డు స్థాయిలో రూ.24,040 కోట్లు రాగా ఫిబ్ర‌వ‌రిలో రూ.5,255 కోట్లు, మార్చిలో రూ.2,266 కోట్ల నిక‌ర పెట్టుబ‌డులు వ‌చ్చాయి. 

గోల్డ్ ఇటిఎఫ్ అంటే ఏమిటి?
భౌతికంగా కాకుండా యూనిట్ల రూపంలో బంగారంలో పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం క‌ల్పించేవే గోల్డ్ ఇటిఎఫ్‌లు. అంత‌ర్జాతీయ‌, దేశీయ విప‌ణిలో బంగారం ధ‌ర‌ల‌ ఆధారంగా ఈ యూనిట్ల విలువ పెరుగుతూ, త‌గ్గుతూ ఉంటుంది. సాధార‌ణంగా మ‌నం కొనే బంగారం ఆభ‌ర‌ణాలు, క‌డ్డీలు, నాణాల రూపంలో ఉంటే ఈ యూనిట్లు డీమ్యాట్ లేదా ప‌త్రాల రూపంలో ఉంటాయి. ప్ర‌తీ యూనిట్ విలువ ఒక గ్రాము బంగారంతో స‌మానం. పైగా వాటిని అత్య‌ధిక స్వ‌చ్ఛ‌త గ‌ల బంగారం ధ‌ర‌తో దీటుగా నిర్ణ‌యిస్తారు. 

Wednesday, April 8, 2026

మ‌త్తు వ‌దిలింది..బుల్ రంకె వేసింది

కొద్ది నెల‌లుగా నిద్ర‌మ‌త్తులో ఉన్న బుల్ ఒక్క‌సారిగా మ‌త్తు వ‌దిలించుకుని రంకె వేసింది. త‌మ మ‌ధ్య సాగుతున్న యుద్ధానికి అమెరికా, ఇరాన్ రెండు వారాల విరామం ప్ర‌క‌టించ‌డం, బ్యారెల్‌ క్రూడాయిల్ ధ‌ర 94 డాల‌ర్ల‌కు దిగి రావ‌డం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బ‌ల‌ప‌డ‌డం వంటి ప‌రిణామాల‌న్నీ ఈక్విటీ మార్కెట్లో సెంటిమెంట్‌ను బ‌లోపేతం చేశాయి. ఆర్‌బిఐ నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రానికి (2026-27) ప్ర‌క‌టించిన తొలి ద్వైమాసిక ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో రెపోరేటు య‌థాత‌థ స్థితిని కొన‌సాగించ‌డం కూడా మార్కెట్‌ను ఉత్తేజితం చేసింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌పంచ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ర్యాలీ సైతం మ‌న మార్కెట్‌కు ఎన‌లేని శ‌క్తిని అందించింది. ఇన్ని సానుకూల‌త‌ల మ‌ధ్య బుధ‌వారం ఈక్విటీ మార్కెట్ చాలా బ‌లంగా ప్రారంభ‌మై రోజంతా అదే జోరును కొన‌సాగించింది. ఇటీవ‌ల కాలంలో క‌నివిని ఎరుగ‌ని విధంగా ప్ర‌ధాన ఈక్విటీ సూచీలు 4 % పైగా లాభ‌ప‌డ్డాయి. అలాగే ఈక్విటీ సూచీలు వ‌రుస‌గా ఐదు సెష‌న్లుగా ర్యాలీలో ఉన్నాయి.

- ఉద‌యం నుంచి అద్భుత‌మైన లాభాల్లో ఉన్న సెన్సెక్స్ 2946.32 పాయింట్ల లాభంతో 77,562.90 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో 3018.96 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్ 77,635.54 పాయింట్ల గ‌రిష్ఠ స్థాయిని తాకింది. 

- ఐదు సంవ‌త్స‌రాల కాలంలో సెన్సెక్స్‌కు అత్యుత్త‌మ ట్రేడింగ్ దినం ఇదే.

- బిఎస్ఇలోని షేర్ల‌లో 3859 స్టాక్‌లు లాభాల‌తో ముగియ‌గా 537 స్టాక్‌లు మాత్రమే న‌ష్ట‌పోయాయి. 101 స్టాక్‌లు త‌ట‌స్థంగా ఉండిపోయాయి. 

- బిఎస్ఇ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 4.93%, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 4.01% లాభ‌ప‌డ్డాయి.

- నిఫ్టీ ఇంట్రాడేలో 901.5 పాయింట్ల లాభంతో 24,025.15 స్థాయిని తాకింది. చివ‌రికి 873.70 పాయింట్ల నిక‌ర లాభంతో 23,997.35 వ‌ద్ద ముగిసింది. 

- నిఫ్టీ గ‌త 11 నెల‌ల కాలంలో ఒక్క రోజులో న‌మోదు చేసిన‌ గ‌రిష్ఠ లాభం ఇదే.  

- బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధ‌ర 13.89% ప‌త‌న‌మై 94.09 డాల‌ర్లు ప‌లికింది. 

- డాల‌ర్ మార‌కంలో భార‌తీయ క‌రెన్సీ రూపాయి 47 పైస‌లు లాభ‌ప‌డి 92.59 వ‌ద్ద ముగిసింది.

- రంగాల వారీ సూచీల‌న్నీ లాభాల్లోనే ముగిశాయి. రియ‌ల్టీ ఇండెక్స్ గ‌రిష్ఠంగా 6.76% లాభ‌ప‌డింది. 

ప్ర‌పంచ మార్కెట్ల‌లోనూ అదే జోరు

ప్ర‌పంచ మార్కెట్ల‌లో కూడా విశేష‌మైన ర్యాలీ చోటు చేసుకుంది. ద‌క్షిణ కొరియాకు చెందిన కోస్పి 6.87%, జ‌పాన్ నిక్కీ 225 ఇండెక్స్ 5.39% లాభ‌ప‌డ్డాయి. షాంఘై ఎస్ఎస్ఇ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ కూడా మంచి ర్యాలీలు సాధించాయి. 


Monday, April 6, 2026

ఈ వారంలో 23100 పైన బుల్లిష్

ఏప్రిల్  06-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  22713 (-107
) 
   
గత వారంలో నిఫ్టీ 21941-22183 పాయింట్ల మధ్యన కదలాడి 107 పాయింట్ల నష్టంతో 22713 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 23100 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  
- 20, 50, 100, 200 డిఎంఏలు 23440, 24660, 25311, 25207 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉన్నప్పుడే దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతంగా భావించాలి. 

బ్రేకౌట్ స్థాయి : 23100      బ్రేక్ డౌన్ స్థాయి : 22600
నిరోధ స్థాయిలు : 22925, 23025, 23125 (22825 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 22500, 22400, 22300 (22600 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------   

Ø  గ్రహగతులివే...
ü వృశ్చికంలోని అనురాధ పాదం 2 నుంచి ధనుస్సులోని  ఉత్తరాషాఢ పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü   మీనంలోని రేవతి పాదం 2 - 3 మధ్యలో రవి సంచారం 
ü  కుంభంలోని పూర్వాభాద్ర  పాదం 2-3 మధ్యలో బుధ సంచారం
ü  మేషంలోని భరణి పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
ü మిథునంలోని పునర్వసు పాదం 1లో మేష నవాంశలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 2లో మిథున నవాంశలో శని సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 3లో రాహువు, సింహంలోని పుబ్బ పాదం 1లో కేతువు మీన, సింహ నవాంశల్లో సంచారం     

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : చైత్ర శుక్ల చతుర్దశి            

నక్షత్రం : ఉత్తర                  

అప్రమత్తం :  ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు

ట్రెండ్ మార్పు సమయం :ఉదయం 9.59

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 12.54 వరకు మెరుగ్గా ఉండి తర్వాత మధ్యాహ్నం 3.56 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. . 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల  సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1 గంట సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22425, 22525     మద్దతు : 22225, 22125
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

భార‌తీయుల ఇళ్లు... "బంగారం ఖ‌జానా"లు

భార‌తీయుల ఇళ్లు బంగారం ఖ‌జానాలుగా మారాయి. ఇటీవ‌ల అంత‌ర్జాతీయ, దేశీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిల‌కు చేరిన‌ప్ప‌టికీ భ...