Monday, August 30, 2021

ఆగ‌ని జోరు - ఈక్విటీ మార్కెట్‌ రికార్డుల హోరు

భార‌త ఈక్విటీ మార్కెట్ రికార్డుల హోరుతో ధ్వ‌నిస్తోంది. వ‌రుస‌గా కొద్ది రోజులుగా క‌నివిని ఎరుగ‌ని జోరులో ప‌రుగులు తీస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేస్తోంది. సోమ‌వారం (ఆగ‌స్టు 30, 2021) ఈక్విటీ ఇండెక్స్ లు కొత్త రికార్డులు నెల‌కొల్పాయి. అంత‌ర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండ‌డంతో పాటు అన్ని వ‌ర్గాల నుంచి కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించ‌డం, రూపాయి బ‌లోపేతం కావ‌డం మార్కెట్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. నిఫ్టీ తొలిసారిగా 16900 క‌న్నా పైన స్థిర‌ప‌డింది. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబ‌డుల క‌ర‌దీపిక అయిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 56958.27 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని తాకి చివ‌రికి 765.04 పాయింట్ల లాభంతో 56889.76 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. సెన్సెక్స్ లాభాల్లో ట్రేడ్ కావ‌డం వ‌రుస‌గా ఇది మూడో రోజు. ఈ మూడు సెష‌న్ల‌లో సెన్సెక్స్ 945.55 పాయింట్లు లాభ‌ప‌డింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ  ఇంట్రాడేలో 16951.50 పాయింట్ల‌ను తాకింది. చివ‌రికి 225.85 పాయింట్ల లాభంతో 16931.05 వ‌ద్ద ముగిసింది. ఆరు వ‌రుస సెష‌న్ల‌లో నిఫ్టీ లాభాల‌తో క్లోజ్ కావ‌డం ఇది ఐదో రోజు. 

- మార్కెట్ లో ఈ బుల్లిష్ సెంటిమెంట్ తో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,47,30,108.97 కోట్లను చేరింది. మూడు రోజుల ప‌రుగులో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.5,76,600.66 కోట్ల మేర‌కు పెరిగింది. ఒక్క సోమ‌వారంనాడే ఇది రూ.3.56 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు దూసుకుపోయింది.

కంగ్రాట్స్ ఇండియా

ఈక్విటీ మార్కెట్ రికార్డు జోరులో ప‌రుగులు తీస్తూ బిఎస్ఇలో లిస్టెండ్ కంపెనీల మార్కెట్ విలువ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి రూ.2,47,30,108.97 కోట్ల‌ను (3.37 ట్రిలియ‌న్ డాల‌ర్లు) చేర‌డంతో బిఎస్ఇ సిఇఓ ఆశిష్ చౌహాన్ కంగ్రాచులేష‌న్స్ ఇండియా అని ట్వీట్ చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ల‌ను కూడా ఆయ‌న టాగ్  చేశారు. 

అమెరిక‌న్ ఫెడ్ ఉత్తేజం

కొన్నాళ్ల పాటు వ‌డ్డీరేట్ల విష‌యంలో మెత‌క వైఖ‌రి అనుస‌రిస్తామ‌ని అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ చైర్మ‌న్ జెరోమ్ పావెల్  చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ ను బ‌లోపేతం చేసింద‌ని, సోమ‌వారంనాటి జోరుకు అదే కార‌ణ‌మ‌ని రిల‌య‌న్స్ సెక్యూరిటీస్ స్ర్టాట‌జీ విభాగం హెడ్ వినోద్ మోదీ అన్నారు.

భార‌త క‌రెన్సీ రూపాయి 40 పైస‌లు పెరిగి అమెరిక‌న్ మార‌కం విలువ‌లో 73.29 డాల‌ర్లు న‌మోదు చేసింది. రూపాయి లాభాల్లో ముగియ‌డం వ‌రుస‌గా ఇది మూడో రోజు. ఈ మూడు సెష‌న్ల‌లో రూపాయి 95 పైస‌ల మేర‌కు లాభ‌ప‌డింది. 

Sunday, August 29, 2021

భార‌త మార్కెట్ పై అంత‌ర్జాతీయ ఇన్వెస్ట‌ర్లలో గుబులు

 భార‌త ఈక్విటీ మార్కెట్ ఇటీవ‌ల క‌నివిని ఎరుగ‌ని స్థాయిలో ప‌రుగులు తీస్తున్న విష‌యం విదిత‌మే. కేవ‌లం 8 నెల‌ల కాలంలోనే స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల‌కు గీటురాయి సెన్సెక్స్ 7000 పాయింట్లు లాభ‌ప‌డింది. దీంతో షేర్ల విలువ‌లు వాస్త‌వ విలువ క‌న్నా ఎన్నో రెట్లు అధికంగా ప‌లుకుతున్నాయి.  ఈక్విటీ షేర్ల విలువ‌లు ఇలా గ‌గ‌న విహారం చేస్తూ ఉండ‌డం ప్ర‌పంచ ఇన్వెస్ట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. భార‌తీయ షేర్లు కొనుగోలు చేసే విష‌యంలో వారు ఆచితూచి అడుగేస్తున్నార‌ని స్విస్ బ్రోక‌రేజి కంపెనీ యుబిఎస్ తాజా నివేదిక‌లో తెలిపింది. అందులోనూ ఇటీవ‌ల కాలంలో రిటైల్ ఇన్వెస్ట‌ర్లు స్టాక్ మార్కెట్ ప‌ట్ల ఆక‌ర్షితులై ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ‌రి ఈ విలువ‌ల్లో వారు చేస్తున్న కొనుగోళ్లు క‌నీసం స్వ‌ల్ప‌కాల ప‌రిమితి వ‌ర‌కైనా నిల‌క‌డ‌గా రాబ‌డులు అందించ‌గ‌ల‌వా అనే అనుమానం అంత‌ర్జాతీయ ఇన్వెస్ట‌ర్లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు భారీ ఎత్తున నిధులు ఉపసంహ‌రించ‌డ‌మే ఇందుకు తార్కాణం అంటున్నారు. ఒక్క సెప్టెంబ‌ర్ త్రైమాసికంలోనే 110 కోట్ల డాల‌ర్లు వారు భార‌త ఈక్విటీ మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకున్నారు. మ‌రోప‌క్క గృహ‌స్థులు జూన్ త్రైమాసికంలోనే 500 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల ఈక్విటీలు కొనుగోలు చేశారు. ప్ర‌స్తుతం ఈక్విటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్ట‌ర్ల ప్ర‌త్య‌క్ష యాజ‌మాన్యం 12 సంవ‌త్స‌రాల గ‌రిష్ఠ స్థాయిలో ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఈ వాతావ‌ర‌ణంలో కంపెనీల ప‌ర‌ప‌తి రేటింగ్ ను తిరిగి ప్ర‌క‌టించే అవ‌కాశాలు త‌క్కువేన‌ని యుబిఎస్ పేర్కొంది.

52 శాతం మంది లిస్టింగ్ రోజే అమ్మేస్తున్నారు...!

భార‌త ఈక్విటీ మార్కెట్లో ఇటీవ‌ల కాలంలో ప‌బ్లిక్ ఇష్యూలు (ఐపిఓ) వెల్లువ‌లా వ‌స్తున్నాయి. రిటైల్ ఇన్వెస్ట‌ర్ల కొనుగోళ్లు కూడా గ‌ణ‌నీయంగా పెరిగాయి. తొలి ప‌బ్లిక్ ఇష్యూల్లో భారీగా పెట్టుబ‌డులు పెట్టిన ఈక్విటీ ఇన్వెస్ట‌ర్లే ఆ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రోజే అమ్మేసుకుంటున్న‌ట్టు ఒక స‌ర్వేలో తేలింది. ఇలా తొలిరోజే షేర్ల‌ను విక్ర‌యిస్తున్న వారు 52 శాతం మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ తెలిపింది. వీరు కాకుండా లిస్టింగ్ అయిన తొలి వారంలో షేర్లు విక్ర‌యిస్తున్న వారి సంఖ్య మ‌రో 20 శాతం ఉంది.

గ‌రిష్ఠ స్థాయిల్లో స్టాక్ ఇండెక్స్ లు

 భార‌త స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు గ‌త వారం మ‌రో చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 795.40 పాయింట్లు లాభ‌ప‌డి 56,198.13 వ‌ద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 68.30 పాయింట్లు లాభ‌ప‌డి 16,712.45 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. దీంతో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన టాప్ 10 కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ విలువ రూ.1,90,032.06 కోట్లు లాభ‌ప‌డింది. సెన్సెక్స్ తొలిసారి 56000 క‌న్నా పైన స్థిర‌ప‌డింది. ఆర్ఐఎల్ రూ.14,11,635.50 కోట్ల‌తో మార్కెట్ విలువ‌లో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా టిసిఎస్ (రూ.13,76,102.60 కోట్లు), హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ (రూ.8,57,407.68 కోట్లు), హెచ్ యుఎల్ (రూ.6,29,231.64 కోట్లు), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ.4,84,858.91 కోట్లు), బ‌జాజ్ ఫైనాన్స్ (4,20,300.85 కోట్లు), ఎస్ బిఐ (రూ.3,68,006.36 కోట్లు), విప్రో (రూ.3,47,851 కోట్లు) మార్కెట్ విలువ‌లో అగ్ర‌స్థానంలో నిలిచాయి. 

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

16400 దిగువన బేరిష్      

(ఆగస్ట్ 30 - సెప్టెంబర్ 3 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  16705 (+254)

గత వారంలో నిఫ్టీ 16722 - 16396 పాయింట్ల మధ్యన కదలాడి 254 పాయింట్ల లాభంతో 16705 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 16400 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 16157, 15997, 15258, 14806 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17000      బ్రేక్ డౌన్ స్థాయి : 16400

నిరోధ స్థాయిలు : 16850, 16925, 17000 (16775 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 16550, 16475, 16400 (16625 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  
గ్రహగతులివే...    

- వృషభంలోని రోహిణి పాదం 1 నుంచి కర్కాటకంలోని పునర్వసు పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- సింహంలోని మఖ పాదం 4 నుండి పుబ్బ పాదం 2 మధ్యలో రవి సంచారం 
- సింహంలోని కన్యలోని ఉత్తర పాదం 3 నుండి హస్త పాదం 1 మధ్యలో బుధ సంచారం
- కన్యలోని హస్త పాదం 4 నుండి చిత్త పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 
- సింహంలోని పుబ్బ పాదం 4 నుండి ఉత్తర పాదం 1 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 4లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 2లో వృషభ నవాంశలో వక్రగతిలో శని సంచారం
వృషభంలోని రోహిణి పాదం 1లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం 

--------------------------------- 

ముగింపు సెషన్  మెరుగు  (సోమవారానికి)

తిథి : శ్రావణ బహుళ అష్టమి              

నక్షత్రం : రోహిణి  

అప్రమత్తం :     పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; మిథున , తుల రాశి జాతకులు   
 
నిఫ్టీ :  16529.10    (+164.70)   

ట్రెండ్ మార్పు సమయం :  1.23

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.47 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 11.58 వరకు బలహీనంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.45 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12 గంటల  సమయంలో క్లోజ్ చేసుకోవాలి.   2.15 తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 16775, 16850        మద్దతు : 16630, 16550
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, August 22, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

16220 దిగువన బేరిష్      

(ఆగస్ట్ 23-27 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  16451 (-78)

గత వారంలో నిఫ్టీ 16702- 16376 పాయింట్ల మధ్యన కదలాడి 78 పాయింట్ల  నష్టంతో 16451 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 16220 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 16022, 15917, 15190, 14685 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 16750      బ్రేక్ డౌన్ స్థాయి : 16200

నిరోధ స్థాయిలు : 16600, 16675, 16750 (16525 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 16300, 16275, 16200 (16375 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

గ్రహగతులివే...    

- కుంభంలోని  శతభిషం పాదం 3 నుంచి మేషంలోని అశ్విని పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- సింహంలోని మఖ పాదం 2-4 మధ్యలో రవి సంచారం 
- సింహంలోని పుబ్బ పాదం 4 నుండి కన్యలోని ఉత్తర పాదం 2 మధ్యలో బుధ సంచారం
- కన్యలోని హస్త పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం 
- సింహంలోని పుబ్బ పాదం 2-4 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 4లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 2లో వృషభ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 1లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం
 
--------------------------------- 

ముగింపు సెషన్  మెరుగు  (సోమవారానికి)

తిథి : శ్రావణ బహుళ పాడ్యమి             

నక్షత్రం : శతభిషం  

అప్రమత్తం :   ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; మీన, కర్కాటక రాశి జాతకులు   
 
నిఫ్టీ :  16529.10    (+164.70)   

ట్రెండ్ మార్పు సమయం :  1.24

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 12.25 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.40 వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.15 సమయంలో క్లోజ్ చేసుకోవాలి.   12 గంటల తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి తీసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 16525, 16600        మద్దతు : 16375, 16300
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, August 20, 2021

8 నెల‌లు-6000

2021లో సెన్సెక్స్ ప్ర‌యాణం

భార‌త స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల సూచీ సెన్సెక్స్ 2021 సంవ‌త్స‌రంలో అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ దూసుకుపోతోంది. ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో రికార్డులు న‌మోదు చేసింది. జ‌న‌వ‌రిలో తొలిసారిగా 50000 శిఖ‌రం అధిరోహించిన సెన్సెక్స్ ఆగ‌స్టు 18న 56000 శిఖ‌రం దాటింది. కాని లాభాపేక్ష అమ్మ‌కాల‌తో ఆ శిఖ‌రం నుంచి స్వ‌ల్పంగా దిగువ‌న క్లోజ‌యినా ఈ 8 నెల‌ల కాలంలో సెన్సెక్స్ ఎక్కిన మెట్లు 6. అమిత ఆశావ‌హ దృక్ప‌థం క‌ల‌వారిని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచే ప‌రుగుగా దీన్ని విశ్లేష‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి 2020 మార్చిలో సెన్సెక్స్ క‌రోనా దెబ్బ‌తో 8828 పాయింట్లు క్షీణించింది. కాని అంత‌లోనే 2021 సంవ‌త్స‌రంలో అనూహ్య‌మైన ర్యాలీలో పురోగ‌మిస్తోంది. ఇంత ర్యాలీ క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ప‌రుగు మాత్రం తీవ్ర‌మైన ఒడిదుడుకుల‌తోనే సాగింద‌ని, ఇన్వెస్ట‌ర్లు, ట్రేడ‌ర్లు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జియోజిత్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్  స్ర్టాట‌జిస్ట్ వి.కె.విజ‌య‌కుమార్ హెచ్చ‌రిస్తున్నారు. అంతే కాదు...కొత్త రిటైల్ ఇన్వెస్ట‌ర్లే ఈ ప‌రుగుకు అండ‌గా నిలిచార‌ని, ప్ర‌స్తుతం ఓవ‌ర్ బాట్ స్థితిలో ప‌డింది. 3 నెల‌ల పాటు తీవ్ర ఒత్తిడికి గురైన అనంత‌రం మార్కెట్ లో ఈ ప‌రిణామం ఏర్ప‌డింది. 

కీల‌క మైలురాళ్లివే...

2021 జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని దాటింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

చారిత్ర‌క‌మైన ఈ ప‌రుగుతో ఆగ‌స్టు 18వ తేదీ నాటికి బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి రూ.2,42,08,041.64 కోట్లను దాటింది. 

సెన్సెక్స్ ఆవిర్భావం - దేశంలోని తొలి స్టాక్ ఎక్స్ఛేంజి సెన్సెక్స్. 1986లో దీన్ని ప్రారంభించారు. 1990 జ‌న‌వ‌రి 25న సెన్సెక్స్ తొలిసారిగా 1000 పాయింట్ల మైలురాయిని దాటింది. 2006 ఫిబ్ర‌వ‌రి 7న 10,000 పాయింట్ల జీవిత కాల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. 

ప‌బ్లిక్ ఇష్యూల హ‌వా

స్టాక్ మార్కెట్ లో ప‌బ్లిక్ ఇష్యూల (ఐపిఓ) జోరు సాగుతోంది. ఒక్క 2021 ఆగ‌స్టు తొలి 20 రోజుల కాలంలోనే రూ.40 వేల కోట్ల విలువ గ‌ల 23 ఇష్యూల జారీకి అనుమ‌తి కోరుతూ ద‌ర‌ఖాస్తులు సెబీలో దాఖ‌ల‌య్యాయి. మ‌రోప‌క్క ఇప్ప‌టివ‌ర‌కు ఈ 20 రోజుల కాలంలోనే స్టాక్ మార్కెట్ నుంచి రూ.18,200 కోట్లు స‌మీక‌రించారు. ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు 40 కొత్త కంపెనీలు లిస్టింగ్ అయి రూ.70 వేల కోట్ల‌కు పైగా స‌మీక‌రించాయి. ఇష్యూల‌కు రిటైల్ ఇన్వెస్ట‌ర్లు అధికంగా ఆక‌ర్షితుల‌వుతున్నారు. ప్ర‌తీ ఇష్యూ కూడా 100 రెట్లు పైబ‌డి ఓవ‌ర్ స‌బ్ స్క్రిప్ష‌న్ సాధిస్తున్నాయి. ఈ జోరు చూస్తుంటే ఈ ఏడాది ఇష్యూల సంఖ్య 100 దాట‌వ‌చ్చున‌ని, 2021 ఐపిఓల సంవ‌త్స‌రంగా పేరు గ‌డించ‌వ‌చ్చున‌ని బ్రోక‌రేజి సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి. 

Monday, August 9, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్  మెరుగు 

తిథి : శ్రావణ శుక్ల విదియ           

నక్షత్రం : మఖ/పుబ్బ 

అప్రమత్తం :  ఆర్ద్ర, స్వాతి. శతభిషం  నక్షత్ర; కన్య, మకర  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  16258.25     (+20.05)   

ట్రెండ్ మార్పు సమయం :  9.50

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.50 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.15 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.15 సమయంలో క్లోజ్ చేసుకోవాలి.   
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 16345, 16420        మద్దతు : 16195, 16125
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, August 8, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

16550 ఫైన బుల్లిష్   

(ఆగస్ట్ 09-13 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  16238 (+475)

గత వారంలో నిఫ్టీ 15738 - 16349 పాయింట్ల మధ్యన కదలాడి 475 పాయింట్ల  భారీ లాభంతో 16238 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 16550 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 15832, 15770, 15052, 14480 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 16550      బ్రేక్ డౌన్ స్థాయి : 15925

నిరోధ స్థాయిలు : 16400, 16475, 16550 (16325 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 16075, 16000, 15925 (16150 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

గ్రహగతులివే...    

- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 4 నుంచి కన్యలోని చిత్త పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 2-4 మధ్యలో రవి సంచారం 
- సింహంలోని మఖ పాదం 1-3 మధ్యలో బుధ సంచారం
- సింహంలోని ఉత్తర పాదం 1 నుండి కన్యలోని ఉత్తర  పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 
- సింహంలోని మఖ పాదం 4 నుంచి పుబ్బ పాదం 1 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 2లో వృషభ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 1లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం 

--------------------------------- 

ప్రారంభ సెషన్  మెరుగు (సోమవారానికి)  

తిథి : శ్రావణ శుక్ల పాడ్యమి          

నక్షత్రం : ఆశ్లేష/మఖ

అప్రమత్తం :    రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర; కన్య, మకర  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  16238.20     (-56.40)   

ట్రెండ్ మార్పు సమయం :  9.48

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 9.30 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 11.20 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 1.20 వరకు నిలకడగాను, ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.15 సమయంలో క్లోజ్ చేసుకోవాలి.   
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 16315, 16400        మద్దతు : 16155, 16100
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...