Sunday, August 29, 2021

గ‌రిష్ఠ స్థాయిల్లో స్టాక్ ఇండెక్స్ లు

 భార‌త స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు గ‌త వారం మ‌రో చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 795.40 పాయింట్లు లాభ‌ప‌డి 56,198.13 వ‌ద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 68.30 పాయింట్లు లాభ‌ప‌డి 16,712.45 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. దీంతో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన టాప్ 10 కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ విలువ రూ.1,90,032.06 కోట్లు లాభ‌ప‌డింది. సెన్సెక్స్ తొలిసారి 56000 క‌న్నా పైన స్థిర‌ప‌డింది. ఆర్ఐఎల్ రూ.14,11,635.50 కోట్ల‌తో మార్కెట్ విలువ‌లో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా టిసిఎస్ (రూ.13,76,102.60 కోట్లు), హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ (రూ.8,57,407.68 కోట్లు), హెచ్ యుఎల్ (రూ.6,29,231.64 కోట్లు), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ.4,84,858.91 కోట్లు), బ‌జాజ్ ఫైనాన్స్ (4,20,300.85 కోట్లు), ఎస్ బిఐ (రూ.3,68,006.36 కోట్లు), విప్రో (రూ.3,47,851 కోట్లు) మార్కెట్ విలువ‌లో అగ్ర‌స్థానంలో నిలిచాయి. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...