Monday, February 10, 2025

ల‌గ్జ‌రీ ఇళ్ల ధ‌ర‌ల వృద్ధిలో ఢిల్లీ @ 6


ప్ర‌పంచంలో ల‌గ్జ‌రీ ఇళ్ల ధ‌ర‌ల పెరుగుద‌ల విష‌యంలో ప్ర‌పంచంలోని 44 న‌గ‌రాల జాబితాలో ఢిల్లీ ఆరో స్థానానికి ఎగ‌బాకింది. డిసెంబ‌ర్ త్రైమాసికంలో ఢిల్లీలో ల‌గ్జ‌రీ ఇళ్ల ధ‌ర‌లు 6.7% పెరిగాయి. రియ‌ల్ ఎస్టేట్ క‌న్స‌ల్టింగ్ కంపెనీ నైట్‌ఫ్రాంక్  "ప్రైమ్ గ్లోబ‌ల్ సిటీస్ ఇండెక్స్ క్యు4 2024"  పేరిట విడుద‌ల చేసిన‌ తాజా నివేదిక‌లో ఈ విష‌యం వెల్ల‌డించింది. ప్ర‌పంచంలోని 44 న‌గ‌రాల్లో ప్రైమ్ రెసిడెన్షియ‌ల్ ధ‌ర‌ల‌ను స్థానిక క‌రెన్సీల‌లో ఈ ఇండెక్స్ ట్రాక్ చేస్తుంది. 18.4% స‌గ‌టు వృద్ధితో సియోల్ ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా మ‌నీలా (17.9%), దుబాయ్ (16.9%), టోక్యో (12.7%),  నైరోబీ (8.3%), ఢిల్లీ (6.7%) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఆర్థిక వాతావ‌ర‌ణం శ‌క్తివంతంగా ఉండ‌డంతో సంప‌న్నులు మరింత విలాస‌వంత‌మైన ఇళ్ల కోసం చూస్తున్నార‌ని , గ‌త 12 నెల‌ల కాలంలో ఈ ధోర‌ణి బాగా పెరిగింద‌ని ఆ నివేదిక తెలిపింది. 2023 అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికంలో 16వ స్థానంలో ఉన్న ఢిల్లీ గ‌త ఏడాది అదే త్రైమాసికం నాటికి ఏకంగా 10 స్థానాలు ఎగ‌బాకి ఆరో స్థానం ఆక్ర‌మించిన‌ట్టు పేర్కొంది. ముంబై 6.1% వృద్ధితో ఏడో స్థానంలో నిల‌వ‌గా బెంగ‌ళూరు 13 స్థానంలో నిలిచింది. బెంగ‌ళూరు కూడా 2023 సంవ‌త్స‌రంలో ఇదే త్రైమాసికంతో పోల్చితే 4.1% శాతం వృద్ధితో 27వ స్థానం నుంచి 13వ స్థానానికి దూసుకుపోయింది. ప్ర‌పంచంలోని మొత్తం 44 మార్కెట్ల‌లో క‌లిపి విలాస‌వంత‌మైన ఇళ్ల ధ‌ర‌ల్లో స‌గ‌టు వృద్ధి 3.2% ఉంది. 

No comments:

Post a Comment

ఈ వారంలో 22400 పైన బుల్లిష్

మార్చి 3-7 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  22125 (-673 )       గత వారంలో నిఫ్టీ 22628 - 22105 పాయింట్ల మధ్యన కదలా...