Sunday, March 23, 2025

సోడా సోడా గోలీ సోడా...జిల్ జిల్ సోడా

ఆంధ్రోడి గోళీసోడాకు విదేశాల్లో భ‌లే డిమాండు

"సోడా సోడా  ఆంధ్రా సోడా...గోళీ సోడా...జిల్ జిల్ సోడా" పాట అంద‌రం విన్న‌దే. ల‌క్ష్మీనివాసం చిత్రంలో ప‌ద్మ‌నాభం మీద చిత్రీక‌రించిన ఈ పాట ఆ రోజుల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. పాట‌గానే కాదు వాస్త‌వంలో కూడా ఆంధ్రా ప్ర‌జ‌ల‌కి గోళీ సోడా మీద ఉన్న మ‌క్కువ‌కు అది ద‌ర్ప‌ణం ప‌ట్టింది. అలాంటి గోళీ సోడాకి అంత‌ర్జాతీయ మార్కెట్ విప‌రీతంగా పెరిగిపోయింద‌ని తాజా స‌మాజారం. అమెరికా, బ్రిట‌న్‌, యూర‌ప్‌, గ‌ల్ఫ్ దేశాల్లో్ గోళీ సోడాకి విప‌రీత‌మైన క్రేజ్ ఉంద‌ట‌. ప్ర‌ధానంగా వ్యూహాత్మ‌క విస్త‌ర‌ణ‌, ఇన్నోవేష‌న్ ఇందుకు ప్రాణం పోస్తున్నాయి. ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్  సంస్థతో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంలో భార‌త్ గోళీ సోడాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా చేస్తోంది. గ‌ల్ష్ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లులూ హైప‌ర్ మార్కెట్ భాగ‌స్వామ్యంలో గోళీ సోడాకు గోళీ పాప్‌గా రీ బ్రాండింగ్ చేసిన‌ట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఆహార ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల అభివృద్ధి సంస్థ (అపెడా) తెలిపింది. ఒక‌ప్పుడు ఇంటింటి ఉప‌యోగ వ‌స్తువుగా పేరొందిన గోళీ సోడా త‌దుప‌రి కాలంలో బ‌హుళ జాతి పానీయాల కంపెనీల ఆధిప‌త్యంలో క‌నుమ‌రుగ‌య్యే స్థితికి జారుకుంది. అయితే దాన్ని స‌రికొత్త పంథాలో ఆవిష్క‌రించ‌డం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తం చేసేందుకు చేసిన కృషి ఫ‌లితంగా తిరిగి పూర్వ వైభ‌వం సంత‌రించుకుంటోంద‌ని అపెడా తెలియ‌చేసింది. స‌రికొత్త ప్యాకేజింగ్‌, ఆక‌ర్ష‌ణీయ‌మైన పాప్ ఓపెన‌ర్‌తో ప్ర‌వేశ‌పెట్టిన గోళీ పాప్ ప్ర‌పంచ వినియోగ‌దారుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. దానికి ఏర్ప‌డిన డిమాండు భార‌తీయ ఫ్లేవ‌ర్ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల డిమాండుకు ద‌ర్ప‌ణం ప‌డుతోంద‌ని, ఎగుమ‌తిదారుల‌కు కొత్త అవ‌కాశాలు అందుబాటులోకి తెచ్చింద‌ని అపెడా తెలిపింది.

No comments:

Post a Comment

ట్రం"పోటు"కు మార్కెట్ "బేర్‌"

- 10 నెల‌ల కాలంలో తొలి భారీ ప‌త‌నం - ఇన్వెస్ట‌ర్ల‌కు క‌న్నీరు తెప్పించిన బ్లాక్ మండే - ఒక్క రోజులోనే రూ.14 ల‌క్ష‌ల కోట్లు హాంఫ‌ట్  - మెట‌ల్‌...