Sunday, May 9, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

 14425 దిగువన బేరిష్   

(2021 మే 10-14 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  14823 (+192)

గత వారంలో నిఫ్టీ 14863 - 14416 పాయింట్ల మధ్యన కదలాడి 192 పాయింట్ల లాభంతో 14823 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 14525 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 14620, 14733, 13660, 13144 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. నిఫ్టీ ఇప్పటికీ 50 డిఎంఏ కన్నా దిగువనే ట్రేడవుతోంది. 

బ్రేకౌట్ స్థాయి : 15125      బ్రేక్ డౌన్ స్థాయి : 14425

నిరోధ స్థాయిలు : 14975, 15050, 15125 (14900 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 14675, 14500, 14425 (14750 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

  


గ్రహగతులివే...    

- మేషంలోని అశ్విని పాదం 3 నుంచి వృషభంలోని మృగశిర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
- మేషంలోని భరణి పాదం 4 నుంచి కృత్తిక పాదం 1 మధ్యలో రవి సంచారం 
- వృషభంలోని రోహిణి పాదం 2-4 మధ్యలో బుధ సంచారం
- మేషంలోని  కృత్తిక పాదం 3 నుంచి రోహిణి పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- మిథునంలోని ఆర్ద్ర పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని  ధనిష్ట పాదం 4లో వృశ్చిక నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 3లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ట పాదం 1లో కేతువు సంచారం 
 

--------------------------------- 

ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి) 

తిథి :  చైత్ర బహుళ చతుర్దశి      

నక్షత్రం : అశ్విని    

అప్రమత్తం :   రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; వృషభ, కన్య  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14823.15     (+98.35)   

ట్రెండ్ మార్పు సమయం :  1.39

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.40 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.05 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 3.05 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 10.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14925, 15025        మద్దతు : 14725, 14625
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...