Sunday, May 16, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

145050 ఫైన బుల్లిష్   



(2021 మే 17-21 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  14678 (-145)

గత వారంలో నిఫ్టీ 14863 - 14507 పాయింట్ల మధ్యన కదలాడి 145 పాయింట్ల నష్టంతో 14678 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15050 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 14650, 14732, 13854, 13218 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. నిఫ్టీ ఇప్పటికీ 50 డిఎంఏ కన్నా దిగువనే ట్రేడవుతోంది. 

బ్రేకౌట్ స్థాయి : 15050      బ్రేక్ డౌన్ స్థాయి : 14250

నిరోధ స్థాయిలు : 14850, 14950, 15050 (14750 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 14450, 14350, 14250 (14550 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

గ్రహగతులివే...    

- కర్కాటకంలోని పునర్వసు పాదం 4 నుంచి సింహంలోని పుబ్బ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
- వృషభంలోని  కృత్తిక పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
- వృషభంలోలో మృగశిర పాదం 1-2 మధ్యలో బుధ సంచారం
- వృషభంలోని  రోహిణి పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం 
- మిథునంలోని పునర్వసు పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని  ధనిష్ట పాదం 4లో వృశ్చిక నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 3లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ట పాదం 1లో కేతువు సంచారం  

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి)

తిథి : వైశాఖ శుక్ల షష్ఠి       

నక్షత్రం : పునర్వసు  

అప్రమత్తం :     అశ్విని, మఖ, మూల నక్షత్ర; కర్కాటక, వృశ్చిక   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14942.35     (+119.20)   

ట్రెండ్ మార్పు సమయం :  1.40

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.55 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.45 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 11.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  12 గంటల తర్వాత ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.30 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14775, 14875         మద్దతు : 14575, 14600
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...