Monday, April 29, 2024

వ‌సూల్ రాజాలూ...కాస్తంత త‌గ్గండి

...ఆర్‌బిఐ హెచ్చ‌రిక ఇది. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు క‌స్ట‌మ‌ర్ల‌పై వ‌డ్డీ విధించే విష‌యంలో నానా ర‌కాల అడ్డ‌దారులూ తొక్కుతున్న‌ట్టు ఫిర్యాదులు వ‌స్తున్న త‌రుణంలో ఆర్‌బిఐ వాటిపై దృష్టి పెట్టింది. వ‌డ్డీల విష‌యంలో అనుచిత దోర‌ణుల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని, ఒక వేళ ఇప్ప‌టికే అలాంటి ధోర‌ణుల‌కు పాల్ప‌డిన‌ట్ట‌యితే సంస్థాగ‌తంగా అవ‌స‌ర‌మైన మార్పులు చేయ‌డం స‌హా త‌గు దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నియంత్రిత సంస్థ‌ల‌ను (ఆర్ఇ) ఆదేశించింది. ఇప్ప‌టికే క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌సూలు చేసిన అద‌న‌పు చార్జీలు కూడా వాప‌సు చేయాల‌ని కూడా సూచించింది. 2003 సంవ‌త్స‌రం నుంచి ఆర్‌బిఐ త‌న నియంత్ర‌ణ‌లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌కు వ‌డ్డీరేట్ల విష‌యంలో త‌గు స్వేచ్ఛ ఇస్తూనే అనుచిత ధోర‌ణుల క‌ట్ట‌డి కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తూ వ‌స్తోంది. వ‌డ్డీరేట్ల విష‌యంలో స్వ‌చ్ఛ‌త‌, పార‌ద‌ర్శ‌క‌త‌ను ప్రోత్స‌హించ‌డం ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌ధాన ల‌క్ష్యం. కాగా ఆర్‌బిఐ తాజాగా ఒక స‌ర్కుల‌ర్ జారీ చేస్తూ "ఆర్‌బిఐ బృందాలు క్షేత్ర‌స్థాయిలో నిర్వ‌హించిన త‌నిఖీల్లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. 2023 మార్చి 31వ తేదీతో ముగిసిన ఏడాది కాలంలో వ‌డ్డీరేట్ల విష‌యంలో ఎన్నో అనుచిత ధోర‌ణులు ఆ బృందాల దృష్టికి వ‌చ్చాయి" అని పేర్కొంది. ఈ స‌ర్కుల‌ర్ త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుంద‌ని కూడా తెలిపింది.వివిధ నియంత్రిత సంస్థ‌లు పాల్ప‌డిన‌, పాల్ప‌డుతున్న అక్ర‌మాలు కొన్నింటిని కూడా ఆర్‌బిఐ ప్ర‌స్తావించింది. అవి...

  • రుణగ్ర‌హీత‌కు రుణం అందించిన తేదీ నుంచి కాకుండా రుణం మంజూరు చేసిన తేదీ లేదా రుణ ఒప్పందంపై సంత‌కాలు చేసిన తేదీ నుంచే కొన్ని సంస్థ‌లు వ‌డ్డీలు వ‌సూలు చేస్తున్నాయి.
  • రుణం మొత్తానికి సంబంధించిన చెక్కును క‌స్ట‌మ‌ర్‌కు అందించిన తేదీ నుంచి కాకుండా చెక్కు త‌యారుచేసిన తేదీ నుంచే వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయి. చెక్కు సిద్ధం చేసిన ఎన్నో రోజుల త‌ర్వాత గాని క‌స్ట‌మ‌ర్ చేతికి చెక్కు అందించ‌డంలేదు. 
  • రుణం తిరిగి చెల్లించిన స‌మ‌యంలో కూడా ఏ తేదీతో రుణం తీరిపోయిందో ఆ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా నెల మొత్తానికి వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయి. 
  • కొన్ని కేసుల్లో ఆయా సంస్థ‌లు ఒక‌టి లేదా రెండు వాయిదాలు అడ్వాన్స్ గా వ‌సూలు చేసినా పూర్తి మొత్తానికే వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయి.
ఈ చ‌ర్య‌ల‌న్నీ క‌స్ట‌మ‌ర్ల విష‌యంలో అనుస‌రించాల్సిన‌ స్వ‌చ్ఛ‌త‌, పార‌ద‌ర్శ‌క‌త నియ‌మావ‌ళికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయ‌ని ఆర్‌బిఐ ఆ స‌ర్కుల‌ర్‌లో తెలిపింది. ఇవ‌న్నీ ఆర్‌బిఐకి తీవ్ర ఆందోళ‌న క‌లిగించే చ‌ర్య‌లే. అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు ఆర్‌బిఐ బృందాలు గుర్తించి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంస్థ‌ల‌న్నీ క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌నంగా వ‌సూలు చేసిన సొమ్మును వాప‌సు చేయాలి అని స్ప‌ష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఈ వారంలో 22725 పైన బుల్లిష్

ఏప్రిల్ 29-మే 3 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  22420 (+273) 
   
గత వారంలో నిఫ్టీ 22198 - 22625 పాయింట్ల మధ్యన కదలాడి 273 పాయింట్ల లాభంతో 22420 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22725 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22471, 22332, 22409, 22316 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22725       బ్రేక్ డౌన్ స్థాయి : 22125

నిరోధ స్థాయిలు : 22625, 22725, 22825 (22525 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 22225, 22125, 22025 (22325 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    
Ø  గ్రహగతులివే...
ü ధనుస్సులో ని పూర్వాషాడ పాదం 1 నుంచి కుంభంలోని శతభిషం పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  మేషంలోని భరణి పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü మీనంలోని రేవతి పాదం 2-3 మధ్యలో వక్రగతిలో బుధ సంచారం
ü మేషంలోని అశ్విని పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం
ü మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 1-2 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని కృత్తిక పాదం 1-2 మధ్యలో ధనుస్సు నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 2లో రాహువు, కన్యలోని హస్త పాదం 4లో కేతువు కర్కాటక, సింహ నవాంశల్లో సంచారం        

--------------------------------- 

ప్రారంభం మెరుగు (సోమవారానికి)  

తిథి :  చైత్ర బహుళ షష్ఠి 

నక్షత్రం : పూర్వాషాఢ        
                          
అప్రమత్తం : మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; మకర, వృషభ రాశి జాతకులు    

ట్రెండ్ మార్పు సమయం : 10.48

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.21 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 1.34 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి 2.30 వరకు నిస్తేజంగా ఉండి ఆ తర్వాత  చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 11.15  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22525, 22620     మద్దతు : 22325, 22225
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, April 22, 2024

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు

దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 మంది ప్ర‌యాణికులు వివిధ గ‌మ్యాల‌కు విమానాల్లో ప్ర‌యాణించారు. ఒకే రోజులో అధిక సంఖ్య‌లో ప్ర‌యాణించిన రికార్డు ఇది. కొవిడ్ ముందు ఒక రోజు ప్ర‌యాణికుల స‌గ‌టు 3,98,579తో పోల్చితే ఇది 14 శాతం అధికం. ఇప్ప‌టివ‌ర‌కు ఒక రోజు అధిక ప్ర‌యాణికుల రికార్డు 2023 ఏప్రిల్ 21వ తేదీన న‌మోదైన 5899 విమానాల్లో 4,28,389 మంది ప్ర‌యాణికులు కాగా  ఈ ఏప్రిల్ 21న 6128 విమానాల్లో 4,75,751 మంది ప్ర‌యాణించి ఆ రికార్డును చెరిపేశారు. ప్ర‌తీ రోజూ విమాన‌యానం కొత్త శిఖ‌రాల‌కు చేరుతోంద‌ని పౌర విమాన‌యాన శాఖ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. స్థిర‌మైన విధానాలు, ఆర్థిక పురోగ‌తి, త‌క్కువ వ్య‌యంతో ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించే విమాన‌యాన సంస్థ‌ల విస్త‌ర‌ణ దేశీయ విమాన‌యానానికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది జ‌న‌వ‌రి-మార్చి నెల‌ల మ‌ధ్య కాలంలో దేశీయ విమాన‌యాన సంస్థ‌లు వివిధ గ‌మ్యాల‌కు త‌రలించిన ప్ర‌యాణికుల సంఖ్య గ‌త ఏడాది ఇదే కాలంతో పోల్చితే 375.04 ల‌క్ష‌ల నుంచి 391.46 ల‌క్ష‌ల‌కు పెరిగిన‌ట్టు పౌర‌విమాన‌యాన రెగ్యులేట‌ర్  డిజిసిఏ గ‌త వారంలో ప్ర‌క‌టించింది. అంటే విమాన ప్ర‌య‌ణికుల వృద్ధిరేటు నెల‌వారీగా 3.68 శాతం ఉండ‌గా వార్షికంగా 4.38 శాతం ఉంది. 

Sunday, April 21, 2024

ఈ వారంలో 22550 పైన బుల్లిష్

ఏప్రిల్ 15-19 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  22147 (-372)
 
గత వారంలో నిఫ్టీ 21778 - 22427 పాయింట్ల మధ్యన కదలాడి 372 పాయింట్ల నష్టంతో 22147 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22550 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22270, 22142, 21633, 20574 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22550       బ్రేక్ డౌన్ స్థాయి : 21750

నిరోధ స్థాయిలు : 22350, 22450, 22550 (22250 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21950, 21850, 21750 (22050 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    
  
Ø  గ్రహగతులివే...
ü కన్యలోని హస్త పాదం 3 నుంచి వృశ్చికంలోని అనురాధ పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü మీనంలోని రేవతి పాదం 2-3 మధ్యలో వక్రగతిలో బుధ సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1-మేషంలోని అశ్విని పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü కుంభంలోని పూర్వాభాద్ర పాదం 3-4 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని కృత్తిక పాదం 1లో ధనుస్సు నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 2లో రాహువు, కన్యలోని హస్త పాదం 4లో కేతువు కర్కాటక, సింహ నవాంశల్లో సంచారం        

--------------------------------- 

తొలి గంట మెరుగు (సోమవారానికి)  

తిథి :  చైత్ర శుక్ల చతుర్దశి                                                              

నక్షత్రం : హస్త                               
అప్రమత్తం :     పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; తుల, కుంభ రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 1.16
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.49 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 2.02 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి 2.30 వరకు నిస్తేజంగా ఉంది ఆ తర్వాత  చివరి వరకు నిలకడగా  ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 11.45  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22240, 22325     మద్దతు : 22050, 21950
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, April 15, 2024

ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డిపై ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌లేదు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, పి.చిదంబ‌రం నాయ‌క‌త్వ‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌బిఐని విభిన్న ర‌కాలుగా ఒత్తిడికి గురి చేసేదా...? అవున‌నే అంటున్నారు ఆర్‌బిఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు. తాజాగా ర‌చించిన  "Just A Mercenary?: Notes from My Life and Career" (కేవ‌లం ఒక కూలీ? :  నా జీవితం, కెరీర్ నుంచి కొన్ని ఘ‌ట్టాలు) పుస్త‌కంలో ఆయ‌న ఈ విష‌యం వివ‌రించారు. వారిరువురి నాయ‌క‌త్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌ని, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప్ర‌భావితం చేసేందుకు వీలుగా దేశంలో ఆర్థిక స్థితి అంతా స‌జావుగా ఉన్న‌ట్టు నివేదిక‌లు ఇవ్వాల‌ని ఆర్ బిఐని ఒత్తిడి చేస్తూ ఉండేద‌ని తెలిపారు. అయితే ప్ర‌భుత్వానికి, కేంద్ర బ్యాంకుకు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఒక్క భార‌త‌దేశానికి లేదా ఏదైనా ఇత‌ర‌ వ‌ర్థ‌మాన దేశానికే ప‌రిమితం కాద‌ని; స‌ంప‌న్న దేశాల్లో కూడా ఇలాంటి ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి క‌నిపిస్తూ ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చిదంబ‌రం, ముఖ‌ర్జీ ఇద్ద‌రితోనూ త‌న‌కు ఇలాంటి సంఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం ఉండేద‌ని, అయితే వారిద్ద‌రి వైఖ‌రిలోనూ భిన్న ధోర‌ణి మాత్రం ఉండేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. చిదంబ‌రం ఎంతో తెలివిగా ఒక న్యాయ‌వాది వ‌లె త‌న వాదాన్ని వినిపించే వార‌ని, కాని స‌ర్వోత్కృష్ట రాజ‌కీయ‌వేత్త అయిన‌ ముఖ‌ర్జీ అందుకు భిన్నంగా త‌న అభిప్రాయం మాత్రం తెలియ‌చేసి కేసును వాదించే బాధ్య‌త అధికారులకు వ‌దిలివేసే వార‌ని ఆయ‌న తెలిపారు. ధోర‌ణి ఏదైనా కూడా అది ఆర్‌బిఐకి మాత్రం అసౌక‌ర్యంగానే ఉండేద‌ని సుబ్బారావు వివ‌రించారు.

కేంద్ర బ్యాంకు స్వ‌యంప్ర‌తిప‌త్తిపై ప్ర‌భుత్వంలో అతి త‌క్కువ అవ‌గాహ‌న‌, సునిశిత‌త్వం ఉండేవ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అటు ప్ర‌భుత్వంలోను, ఇటు ఆర్‌బిఐలోను ప‌ని చేసిన వ్య‌క్తిగా తాను ఈ విష‌యం చెబుతున్నాన‌ని ఆయ‌న అన్నారు. సుబ్బారావు కేంద్రంలో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా 2007-08 కాలంలో ప‌ని చేశారు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద కార్పొరేట్ వైఫ‌ల్యంగా పేరొందిన లేమ‌న్ బ్ర‌ద‌ర్స్ దివాలా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డానికి (2008 సెప్టెంబ‌రు 16) కొద్ది రోజుల ముందే 2008 సెప్టెంబ‌రు 5వ తేదీన సుబ్బారావు 5 సంవ‌త్స‌రాల కాలానికి ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.

"Reserve Bank as the Government's Cheerleader?" (ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌న్నింటికీ తానా తందానా అంటూ వంత‌పాడే పాట‌గాడుగా రిజ‌ర్వ్ బ్యాంక్ పేరిట రాసిన అధ్యాయంలో వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌నేందుకే ప్ర‌భుత్వ ఒత్తిడి ప‌రిమితం కాలేద‌ని సుబ్బారావు స్ప‌ష్టం చేశారు. ఆర్థిక శాఖ ఒత్తిడి వ‌డ్డీరేట్ల త‌గ్గింపున‌కే ప‌రిమితం కాలేద‌ని, చివ‌రికి గ‌డ్డు స్థితిలో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థలో అంతా స‌జావుగానే ఉన్న‌ట్టు చెప్పాల‌న్న స్థాయికి కూడా చేరింద‌ని ఆయ‌న వివ‌రించారు. అలాంటి ఒక సంఘ‌ట‌న‌ను ఆయ‌న వెల్ల‌డించారు. 

"అప్ప‌ట్లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అర్వింద్ మ‌యారామ్ ఆర్థిక కార్య‌ద‌ర్శిగా, కౌశిక్ బ‌సు ప్ర‌భుత్వ ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారుగా ప‌ని చేస్తున్నారు. వారంద‌రూ ఆర్‌బీఐ అంచ‌నాల‌కు భిన్నంగా త‌మ అంచ‌నాలు ప్ర‌తిపాదించారు. అవి మా అంచ‌నాల‌కు చాలా దూరంగా ఉన్నాయ‌ని నేను భావించాను" అని రాశారు. చివ‌రికి సంభాష‌ణ‌లు హేతుబ‌ద్ధ‌త నుంచి స్వార్థ‌పూరిత ల‌క్ష్యాల దిశ‌గా మార‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని చెప్పారు. అధిక వృద్ధి, త‌క్కువ ద్రవ్యోల్బ‌ణం ఉన్న‌ట్టుగా అంచ‌నాలు ఇవ్వాల‌ని వారు కోరేంత వ‌ర‌కు సంభాష‌ణ‌లు వెళ్లాయ‌న్నారు.
"ఒక ద‌శ‌లో అయితే మ‌యారామ్ ప్ర‌పంచంలో అన్ని దేశాల ప్ర‌భుత్వాలు, కేంద్ర బ్యాంకులు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయి. కాని ఆర్‌బిఐ అందుకు భిన్నంగా ధిక్కార ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంది" అన్నార‌ని సుబ్బారావు వెల్ల‌డించారు. 

ప్ర‌భుత్వానికి వంత‌పాట‌దారుగా ఆర్‌బిఐ ఉండాల‌న్న డిమాండు త‌న ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌యింద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. అయితే  వృత్తిప‌ర‌మైన స‌మ‌గ్ర‌త‌ను వ‌దిలి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను శాంతింప‌చేసే విధంగా ఆర్‌బిఐ అంచ‌నాలు ఇవ్వ‌కూడ‌ద‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల తాను ప్ర‌ద‌ర్శించాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

2012 అక్టోబ‌రులో చిదంబ‌రం ఆర్థిక‌మంత్రిగా తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఒక సంఘ‌ట‌న‌ను కూడా సుబ్బారావు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ముఖ‌ర్జీ యంత్రాంగం అనుస‌రించిన కాఠిన్యాన్ని తొల‌గించి స‌ర‌ళ‌మైన వైఖ‌రి అనుస‌రించాల‌ని భావించిన చిదంబ‌రం వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌ని ఆర్‌బిఐపై ఎన‌లేని ఒత్తిడి తెచ్చార‌ని, అయినా తాను లొంగ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. త‌న తిర‌స్కార ధోర‌ణి చిదంబ‌రం త‌న వైఖ‌రిని ప్ర‌జ‌ల ముందుకే తీసుకెళ్లాల‌ని భావించార‌ని కూడా మాజీ ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ద్ర‌వ్యోల్బ‌ణ ధోర‌ణులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆర్‌బిఐ క‌ఠిన‌త‌ర ద్ర‌వ్య విధానం ప్ర‌క‌టించిన కొద్ది సేప‌టికే నార్త్ బ్లాక్ (ఆర్థిక శాఖ కార్యాల‌యం) వెలుప‌ల మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ" ద్ర‌వ్యోల్బ‌ణంతో పాటుగా వృద్ధి కూడా కీల‌క‌మే.  వృద్ధి విష‌యంలో ఎదుర‌వుతున్న స‌వాలును ప్ర‌భుత్వం ఒంట‌రిగానే ఎదుర్కొనాల్సి వ‌స్తే ఒంట‌రి పోరాటం చేయ‌డానికి కూడా మేం సిద్ధం" అన్నార‌ని సుబ్బారావు గుర్తు చేసుకున్నారు.

కెరీర్ ప్రారంభం నుంచి త‌న ప్ర‌యాణంలోని ముఖ్య ఘ‌ట్టాల‌ను, త‌న ఆశ‌లు, నిరాశ‌లు;  త‌న విజ‌యాలు, వైఫ‌ల్యాలు; త‌న త‌ప్పులు, పొర‌పాట్లు;  తాను నేర్చుకున్న పాఠాలు అన్నీ 74 సంవ‌త్స‌రాల సుబ్బారావు ఈ పుస్త‌కంలో స‌వివ‌రంగా ప్ర‌స్తావించారు. 1974లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉత్త‌ర కోస్తాలోని పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన స‌మ‌యంలో గిరిజ‌నాభివృద్ధి విష‌యంలో మ‌రింత ఉత్సాహం, పేద‌రికం గురించి మ‌రింత అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌డం ప్ర‌ధాన‌మ‌ని తాను భావించిన‌ట్టు చెప్పారు. స‌రిగ్గా 40 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీవ్ర‌మైన విదేశీమార‌క ద్ర‌వ్య సంక్షోభం న‌డుమ‌న 2013లో ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న కాలంలో అస‌మాన‌త‌ల‌తో అల్లాడుతున్న ప్ర‌పంచంలో వ‌ర్థ‌మాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఎదుర్కొంటున్న క‌ఠోర స‌వాళ్ల గురించి తాను తెలుసుకోగ‌లిగాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. సుబ్బారావు ప్ర‌స్తుతం అమెరికాకు చెందిన యేల్ జాక్స‌న్  విశ్వ‌విద్యాల‌యం సీనియ‌ర్ ఫెలోగా ప‌ని చేస్తున్నారు.

Sunday, April 14, 2024

ఈ వారంలో 21320 దిగువన బేరిష్

ఏప్రిల్ 15-19 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  21519 (-1)
 
గత వారంలో నిఫ్టీ 22776 - 21504 పాయింట్ల మధ్యన కదలాడి 1 కన్నా తక్కువ పాయింట్ల నష్టంతో 21519 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 21320 కన్నాదిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22270, 22142, 21633, 20574 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22820       బ్రేక్ డౌన్ స్థాయి : 22420

నిరోధ స్థాయిలు : 22720, 22820, 22920 (22620 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21420, 21320, 21220 (21420 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    

Ø  గ్రహగతులివే...
ü మిథునంలోని పునర్వసు పాదం 2 నుంచి సింహంలోని పూర్వఫల్గుణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü మీనంలోని రేవతి పాదం 3లో బుధ సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం
ü కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2-3 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని భరణి  పాదం 3-కృత్తిక పాదం 1 మధ్యలో వృశ్చిక నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 3లో రాహువు, కన్యలోని హస్త పాదం 4లో కేతువు కర్కాటక, సింహ నవాంశల్లో సంచారం        

--------------------------------- 

మిడ్ అవర్ మెరుగు (సోమవారానికి)  
తిథి :  చైత్ర శుక్ల సప్తమి                                                             
నక్షత్రం : పునర్వసు 
అప్రమత్తం :    అశ్విని, మఖ, మూల నక్షత్ర;   మిథున, తుల  రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 2.13
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.04 వరకు నిస్తేజంగా ఉంటూ ఆ తర్వాత 12.16 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి 2.30 వరకు నిస్తేజంగా ఉంది ఆ తర్వాత  చివరి వరకు మెరుగ్గా  ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12.10  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22615, 22700     మద్దతు : 22425, 22350
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...