ఈ ఏడాది దేశంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో వేతనాల వృద్ధి 20 శాతం వరకు ఉంటుందని అంచనా. ప్రతిభను వెన్నుతట్టి ప్రోత్సహించడం, ఇన్నోవేషన్ కు పట్టం కట్టడంపై వివిధ కంపెనీలు పట్టం కడతాయని ఒక అధ్యయనంలో తేలింది. పటిష్ఠంగా ఉన్న దేశ ఆర్థిక వాతావరణమే ఇందుకు కారణం. మైకేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్ 2024 నివేదికలో ఈ అంశాలు చోటు చేసుకున్నాయి. బిఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్ & తయారీ, ఫైనాన్స్ & అకౌంటింగ్, హెల్త్ కేర్ & లైఫ్ సైన్సెస్, మానవ వనరులు, లీగల్, కంప్లయెన్స్, వస్తు సరఫరా & సరఫరా వ్యవస్థ, ప్రాపర్టీ & నిర్మాణం, సేల్స్ & మార్కెటింగ్, టెక్నాలజీ వంటి విభాగాల్లో ఈ సర్వే నిర్వహించారు.
నివేదికలో ప్రధానాంశాలు...
- సాంప్రదాయిక పరిశ్రమల్లో నియామకాలు ఊపందుకున్నాయి. తయారీ, నిర్వహణ కార్యకలాపాల్లో ఉద్యోగాలకు అధిక డిమాండు ఉంది.
- డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఎఐ, మెషీన్ లెర్నింగ్ వృత్తి నిపుణులకు డిమాండు పెరిగింది.
- రంగాలవారీగా చూస్తే ఐటి, టెక్నాలజీ రంగంలో జూనియర్ ఉద్యోగుల స్థాయిలో వేతన వృద్ధి 35-45 శాతం ఉండవచ్చు. అలాగే ఈ వృద్ధి మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 30-40 శాతం, సీనియర్ మేనేజ్ మెంట్ స్థాయిలో 20-30 శాతం ఉండవచ్చు.
- ప్రాపర్టీ , నిర్మాణ రంగంలో వేతన వృద్ధి వరుసగా 20-40 శాతం (జూనియర్) 25-45 శాతం (మిడ్‌లెవెల్ ఎగ్జిక్యూటివ్), 20-40 శాతం (సీనియర్ మేనేజ్‌మెంట్) ఉండవచ్చు.
- ఉద్యోగ మార్కెట్లో స్థితిస్థాపకత, పని సంస్కృతి, వృత్తిలో వృద్దికే అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
No comments:
Post a Comment