Friday, May 24, 2024

విదేశీ మార‌కం నిల్వ‌ల చారిత్ర‌క రికార్డు

దేశంలో విదేశీ మార‌కం నిల్వ‌లు చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయికి చేరాయి. మే 17వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వ‌లు 454.9 కోట్ల డాల‌ర్ల (4.549 బిలియ‌న్) మేర‌కు పెరిగి 64,870  డాల‌ర్ల‌కు (648.7 బిలియ‌న్‌)  చేరాయి. ఇది ఫారెక్స్ నిల్వ‌ల చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి. ఫారెక్స్ నిల్వ‌లు పెర‌గ‌డం వ‌రుస‌గా ఇది మూడో వారం. ఇదే వారంలో బంగారం నిల్వ‌లు 124.4 కోట్ల డాల‌ర్ల (1.244 బిలియ‌న్‌) మేర‌కు పెరిగి 5719.5 కోట్ల డాల‌ర్ల‌కు (57.195 బిలియ‌న్‌) చేరాయి. 

తొలిసారి ఓటు వేయ‌డంలో థ్రిల్లే వేర‌బ్బా...

72 సంవ‌త్స‌రాల వ‌య‌సులో తొలిసారి ఓటు వేస్తున్న ప‌న‌గ‌డియా

అర్వింద్ ప‌న‌గ‌డియా. వ‌య‌సు 72 సంవ‌త్స‌రాలు (జ‌న‌నం 1952  సెప్టెంబ‌రు 30). ఆయ‌న ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌. కొలంబియా విశ్వ‌విద్యాల‌యంలో అర్థ శాస్ర్తంలో ప్రొఫెస‌ర్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 16వ ఫైనాన్స్  క‌మిష‌న్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేంద్రంలో న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ‌తంలోని ప్ర‌ణాళికా సంఘాన్ని ర‌ద్దు చేసి దాని స్థానంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు తొలి వైస్ చైర్మ‌న్‌గా 2015 జ‌న‌వ‌రి నుంచి 2017 ఆగ‌స్టు వ‌ర‌కు ప‌ని చేశారు. 72 సంవ‌త్స‌రాల వ‌య‌సులో తొలిసారిగా ఓటుహ‌క్కు వినియోగించుకుంటున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్న‌ద‌ని ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదేమిటి 72 సంవ‌త్స‌రాల్లో ఒక్క‌సారి కూడా ఓటు వేయ‌లేదా, ఎందుక‌లా అనుకుంటున్నారా! నిజ‌మే ఎవ‌రికైనా అలాగే అనిపిస్తుంది. కాని ఆయ‌న స్వ‌దేశంలో క‌న్నా అమెరికాలో ఉన్న రోజులే ఎక్కువ‌. ఈ కార‌ణంగా దేశంలో ఎన్నిక‌లు జ‌రిగిన స‌మ‌యాల్లో ఇక్క‌డ లేక‌పోవ‌డ‌మే ఆయ‌న జీవితంలో ఓటు హ‌క్కు వినియోగించుకోలేక‌పోవ‌డానికి కార‌ణం. మీరు ఇన్నాళ్లూ ఓటు హ‌క్కు వినియోగించుకోక‌పోవ‌డానికి కార‌ణం అమెరిక‌న్ పౌర‌స‌త్వం క‌లిగి ఉండ‌డ‌మా లేక ఎన్నిక‌ల స‌మ‌యంలో దేశంలో లేక‌పోవ‌డ‌మా అన్న ప్ర‌శ్న‌కు రెండోదే స‌రైన స‌మాధాన‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఢిల్లీలో లోక్‌స‌భ ఎన్నిక‌ల ఆరో విడ‌త  పోలింగ్ నేడు (2024 మే 25) జ‌రుగ‌నుంది. ఈ సారి దేశంలో ఉన్న కార‌ణంగా ఆయ‌న జీవితంలో తొలిసారిగా ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. "ప్ర‌పంచాన్ని రెండుగా విభ‌జించ‌వ‌చ్చు. ఓటు వేసిన వారు, ఓటు వేయ‌ని వారు. రేపు నేను మొద‌టి వ‌ర్గంలో చేర‌బోతున్నందుకు ఉత్సాహంగా ఉంది. జీవితంలో తొలిసారి ఓటు వేయ‌బోతుండ‌డం ఎంతో ఆనందంగా ఉంది" అని ఆయ‌న త‌న ఎక్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 2012 సంవ‌త్స‌రంలో కేంద్ర‌ప్ర‌భుత్వం ప‌న‌గ‌డియాను దేశ మూడో అత్యున్న‌త పౌర పుర‌స్కారం ప‌ద్మ భూష‌ణ్‌తో స‌త్క‌రించింది. 

Tuesday, May 21, 2024

5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు

మార్కెట్ విలువ‌లో బిఎస్ఇ కొత్త రికార్డు 

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజిలో (బిఎస్ఇ) లిస్టింగ్ అయిన కంపెనీల ఉమ్మ‌డి మార్కెట్ విలువ మంగ‌ళ‌వారం  (2024 మే 21వ తేదీ) 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల మైలురాయిని తాకింది. మార్కెట్ న‌ష్టాల్లోనే ముగిసినా ఇంట్రాడేలో ఈ రికార్డు న‌మోదు కావ‌డం విశేషం. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి అది మ‌రో చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి 4.97 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల (రూ.4,14,62,306.56) వ‌ద్ద స్థిర‌ప‌డింది. బిఎస్ఇ ప్ర‌ధాన సూచీ సెన్సెక్స్  మంగ‌ళ‌వారం 52.63 పాయింట్ల న‌ష్టంతో 73953.31 వ‌ద్ద ముగిసింది. ఈ మైలురాయిని చేర‌డంతో భార‌త స్టాక్ మార్కెట్ విలువ ప‌రంగా ప్ర‌పంచంలో ఐదో స్థానానికి చేరింది. అమెరికా, చైనా, జ‌పాన్‌, హాంకాంగ్ త‌ర్వాతి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సెక్స్ 1713.05 పాయింట్లు లాభ‌ప‌డింది. 2024 ఏప్రిల్ 9వ తేదీన చారిత్ర‌క గ‌రిష్ఠ స్ఠాయి 75124.28 పాయింట్ల‌ను న‌మోదు చేసింది. 

మార్కెట్ విలువ‌లో మైలురాళ్లివే...

2023 న‌వంబ‌రు 29  - తొలిసారిగా 4 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు తాకింది.

2021 మే 24 - తొలిసారిగా 3 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌ను తాకింది.

2017 జూలై 10 - తొలిసారిగా 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లను తాకింది.

2007 మే 28 - తొలిసారిగా 1 ల‌క్ష కోట్ల డాల‌ర్ల‌ను తాకింది.

  • మార్కెట్ విలువ 1 ల‌క్ష కోట్ల డాల‌ర్ల నుంచి 1.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌ను (2014 జూన్ 6) తాక‌డానికి 2566 రోజులు ప‌ట్టింది. అంటే సుమారుగా ఏడు సంవ‌త్స‌రాలు.
  •  మార్కెట్ విలువ 1.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల నుంచి 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేర‌డానికి 1130 రోజులు ప‌ట్టింది. 1 ల‌క్ష కోట్ల డాల‌ర్ల నుంచి 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేర‌డానికి ప‌ట్టిన స‌మ‌యం 10 సంవ‌త్స‌రాలు. 
  • 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల నుంచి 2.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు (2020 డిసెంబ‌రు 16)  చేర‌డానికి 1255 రోజులు ప‌ట్టింది. 

Monday, May 20, 2024

ఈ వారంలో 22800 పైన బుల్లిష్

మే 21-24 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  22466 (+411) 
   
గత వారంలో నిఫ్టీ 22520 - 21821 పాయింట్ల మధ్యన కదలాడి 411 పాయింట్ల లాభంతో 22466 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22800  కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22115, 22305, 22422, 22420 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

- దీర్ఘకాలిక, మధ్యకాలిక ధోరణులు రెండూ బుల్లిష్ గానే ఉన్నాయి. ఈ వారాంతానికి 23800 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ధోరణి కూడా బుల్లిష్ అవుతుంది.   

బ్రేకౌట్ స్థాయి : 22800      బ్రేక్ డౌన్ స్థాయి : 22200

నిరోధ స్థాయిలు : 22700, 22800, 22900 (22600 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21300, 21200, 22100 (22400 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 
 
Ø  గ్రహగతులివే...
ü తులలోని స్వాతి  పాదం 1 నుంచి వృశ్చికంలోని జ్యేష్ట పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü వృషభంలోని కృత్తిక పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü మేషంలోని అశ్విని పాదం 4-3 మధ్యలో బుధ సంచారం
ü వృషభంలోని కృత్తిక  పాదం 2-భరణి పాదం 2 మధ్యలో శుక్ర సంచారం
ü మీనంలోని రేవతి పాదం 1-3 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని కృత్తిక పాదం 3లో  కుంభ  నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2లో వృషభ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1లో రాహువు, కన్యలోని హస్త పాదం 3లో కేతువు ధనుస్సు, మిథున నవాంశల్లో సంచారం        

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (మంగళవారానికి)  

తిథి :  వైశాఖ శుక్ల త్రయోదశి                                                            

నక్షత్రం : స్వాతి     
అప్రమత్తం :    ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; వృశ్చిక, మీన  రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 12.17
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 9.59 వరకు నిలకడగా ఉంటూ ఆ తర్వాత 12.08 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి 2.16 వరకు నిలకడగా ఉంది తదుపరి చివరి  వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 9.30 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22600, 22675     మద్దతు : 22400, 22325
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, May 14, 2024

ముంబై రెస్టారెంట్ల " డెమోక్ర‌సీ డిస్కౌంట్‌"

మండుతున్న ఎండ‌లు. సూర్య‌ప్ర‌తాపానికి బొబ్బ‌లెక్కిపోతున్న శ‌రీరాలు. ఎండిపోతున్న గొంతులు. మామూలుగానే ఎన్నిక‌లంటే ఉండే నిరాస‌క్త‌త‌. దానికి తోడు ఇలాంటి కార‌ణాలు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు ప్ర‌జ‌లు ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రావ‌డంలేదు. అలాంటి వారిని బ‌య‌ట‌కు ర‌ప్పించేందుకు ముంబైలోని రెస్టారెంట్లు న‌డుం బిగించాయి. ముంబై న‌గ‌రంలో 21వ తేదీన ఐదో విడ‌త‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతుంది.  ఈ పోలింగ్ ను దృష్టిలో పెట్టుకుని ముంబైలోని రెస్టారెంట్లు రెండు రోజుల పాటు డెమోక్ర‌సీ డిస్కౌంట్ పేరిట ఒక వినూత్న‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించాయి. మే 20, 21 తేదీల్లో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. దీని కింద ముంబై వాసులెవ‌రైనా రెస్టారెంట్ కు వెళ్లి క‌డుపు నిండుగా తిని బ్రేవ్ మ‌ని త్రేన్చిన త‌ర్వత 20 శాతం డిస్కౌంట్‌తో బిల్లు వారి చేతికి వ‌స్తుంది. రెస్టారెంట్లు దానికి "డెమోక్ర‌సీ డిస్కౌంట్" అని పేరు పెట్టాయి. ఆ ర‌కంగా తాము ప్ర‌జ‌లు ఓటు వేసేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చేలా త‌మ వంతు కృషి చేస్తున్నామ‌ని భార‌త జాతీయ రెస్టారెంట్ల సంఘం (ఎన్ఆర్ఏఐ) ముంబై చాప్ట‌ర్ ప్రెసిడెంట్ రాచెల్ గోయెంకా తెలిపారు.  "ముంబై న‌గ‌రానికి స‌మాజం ప‌ట్ల ఎప్పుడూ ఇలాంటి బాధ్య‌త ఒక‌టుంటుంది. ఎన్ఆర్ఏఐ ఛ‌త్రం కింద ప‌లు బ్రాండ్లు ఇందులో భాగ‌స్వాముల‌వుతున్నాయి" అని ఆయ‌న చెప్పారు. ముంబై న‌గ‌ర వాసులే ఈ డిస్కౌంట్ పొందేందుకు అర్హులు. వారు త‌మ ఓట‌ర్ ఐడిని, ఓటు వేసిన‌ట్టుగా ధ్రువీక‌రిస్తూ వేలిపై ఇంక్ ముద్ర‌ను చూపించాల్సి ఉంటుంది. అలాంటి వారికి అయ్యే మొత్తం బిల్లుపై 20 శాతం డిస్కౌంట్ వ‌ర్తింప‌చేసి ఫైన‌ల్ బిల్లు ఇస్తారు. 

Sunday, May 12, 2024

ఈ వారంలో 22055 పైన బుల్లిష్

మే 13-17 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  22055 (-421)
 
గత వారంలో నిఫ్టీ 22476 - 21932 పాయింట్ల మధ్యన కదలాడి 421 పాయింట్ల న‌ష్టంతో 22055 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22355 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22115, 22305, 22422, 22420 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22355       బ్రేక్ డౌన్ స్థాయి : 21750

నిరోధ స్థాయిలు : 22255, 22355, 22455 (22155 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21850, 21750, 22650 (21950 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 

Ø  గ్రహగతులివే...
ü కర్కాటకంలోని పునర్వసు  పాదం 4 నుంచి సింహంలోని పుబ్బ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  మేషంలోని కృత్తిక పాదం 1-వృషభంలోని కృత్తిక పాదం 2 మధ్యలో రవి సంచారం 
ü మేషంలోని అశ్విని పాదం 1-3 మధ్యలో బుధ సంచారం
ü మేషంలోని భరణి పాదం 3-కృత్తిక పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 4-రేవతి పాదం 1 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని కృత్తిక పాదం 2-3 మధ్యలో మకర  నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2లో వృషభ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 1లో రాహువు, కన్యలోని హస్త పాదం 3లో కేతువు ధనుస్సు, మిథున నవాంశల్లో సంచారం        

--------------------------------- 

ప్రారంభం మెరుగు (సోమవారానికి)  
తిథి :  వైశాఖ శుక్ల షష్ఠి                                                                
నక్షత్రం : పునర్వసు/పుష్యమి     
                          
అప్రమత్తం :   అశ్విని, మఖ, మూల; భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; కర్కాటక, వృశ్చిక   రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 11.22
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.26 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 11.20 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి  చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 9.30 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 10.30 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22150, 22225     మద్దతు : 21950, 21875
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, May 5, 2024

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్  

నిఫ్టీ   :  22476 (+56)
 
గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయింట్ల లాభంతో 22476 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22775 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 22471, 22332, 22409, 22316 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22725       బ్రేక్ డౌన్ స్థాయి : 22125

నిరోధ స్థాయిలు : 22675, 22775, 22875 (22575 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 22225, 22125, 22025 (22175 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    
Ø  గ్రహగతులివే...
ü మీనంలోని రేవతి పాదం 3 నుంచి మిథునంలోని మృగశిర పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  మేషంలోని భరణి పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü మీనంలోని రేవతి పాదం 3-మేషంలోని అశ్విని పాదం 1 మధ్యలో బుధ సంచారం
ü మేషంలోని భరణి పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం
ü మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 3-4 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని కృత్తిక పాదం 2లోమకర  నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 2లో రాహువు, కన్యలోని హస్త పాదం 4లో కేతువు కర్కాటక, సింహ నవాంశల్లో సంచారం      

--------------------------------- 

ప్రారంభం మెరుగు (సోమవారానికి)  

తిథి :  చైత్ర బహుళ త్రయోదశి                                                               

నక్షత్రం : రేవతి                               
అప్రమత్తం :  కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర; మీన, కర్కాటక రాశి జాతకులు    
ట్రెండ్ మార్పు సమయం : 12.15
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.54 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 1.07 వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి  చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 2 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 3.15 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 22570, 22670     మద్దతు : 22370, 22290
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...