Wednesday, May 1, 2024

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా ఉన్న కార‌ణంగా మార్కెట్ జోరుకు అడ్డుక‌ట్ట ఏదీ ప్ర‌స్తుతం క‌నిపించ‌డంలేదు. వృద్ధి అవ‌కాశాలు మెరుగ్గా ఉండ‌డం, ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై దేశీయ ఇన్వెస్ట‌ర్ల ఆస‌క్తి,  ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అధికార ఎన్‌డిఏ అధికారం నిల‌బెట్టుకుని మూడో సారి కూడా పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్ట‌వ‌చ్చున‌న్న‌విశ్వాసం కూడా మార్కెట్ల‌ను ముందుకు న‌డిపే అంశాలే. 2024 సంవ‌త్స‌రంలో ఒక్క జ‌న‌వ‌రి నెల మిన‌హాయిస్తే మూడు నెల‌లుగా లాభ‌ప‌డుతూనే వ‌స్తున్న ఈక్విటీ మార్కెట్ మే నెల‌లో కూడా అదే జోరును కొన‌సాగిస్తుంద‌న్న‌ది నిపుణుల అంచ‌నా. నెల‌వారీగా చూసిన‌ట్ట‌యితే బిఎస్ఇ సూచీ సెన్సెక్స్ 0.67 శాతం క్షీణించినా ఫిబ్ర‌వ‌రిలో 1.04 శాతం, మార్చిలో 1.58 శాతం, ఏప్రిల్‌లో 1.12 శాతం లాభ‌ప‌డింది. మే నెల‌లో కూడా మార్కెట్ల తీరు ఇలాగే ఉండ‌వ‌చ్చున‌న్న‌ది మార్కెట్ పండితుల అభిప్రాయం. గ‌త నెల 9వ తేదీన సెన్సెక్స్ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 75124.28 వ‌ద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. అదే రోజున సెన్సెక్స్ కీల‌క‌మైన‌75000 మైలురాయిని కూడా దాటింది. కాగా గ‌త నెల 10వ తేదీన సెన్సెక్స్ తొలిసారిగా 75000 క‌న్నా పైన స్థిర‌ప‌డింది. అంత‌కు రెండు రోజుల ముందే అంటే ఏప్రిల్ 8న బిఎస్ఇలో లిస్ట‌యిన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా రూ.400 ల‌క్ష‌ల కోట్ల మైలురాయిని దాటి రూ.4,06,55,851.94 కోట్లుగా  (4.90 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) న‌మోద‌యింది. అధిక విలువ‌ల ఆందోళ‌న‌లున్న‌ప్ప‌టికీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా కొత్త రికార్డులు న‌మోదు చేశాయి.

సాంప్ర‌దాయికంగా "మే నెల‌లో అమ్ముకుని బ‌య‌ట‌ప‌డు" అనే సూత్రాన్ని మార్కెట్ పండితులు ప్ర‌బోధిస్తూ ఉంటారు. కాని ప్ర‌స్తుత మార్కెట్ తీరుకు ఆ సూత్రం వ‌ర్తించ‌ద‌ని హెడోనోవా హెడ్జ్ ఫండ్ సిఐఓ సుమ‌న్ బెన‌ర్జీ అంటున్నారు. త్వ‌ర‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న ద‌శ‌లో మార్కెట్లో స‌రికొత్త ర్యాలీ అవ‌కాశాలు అధికంగా ఉన్నందు వ‌ల్ల ఈ సాంప్ర‌దాయిక సూత్రాన్ని ప‌క్క‌న పెట్ట‌వ‌చ్చున‌ని నిపుణుల‌ సూచ‌న‌. మ‌రోప‌క్క గ‌త ద‌శాబ్ది కాలంగా మే నెల‌లో నిఫ్టీ సానుకూల రాబ‌డులు అందిస్తోంద‌ని కూడా గ‌ణాంకాలు నిరూపిస్తున్నాయ‌ని బెన‌ర్జీ అన్నారు. భార‌త్‌కు గ‌ల మెరుగైన వృద్ధి అవ‌కాశాలు, రాబోయే సంవ‌త్స‌రాల్లో స్టాక్ మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటుంద‌న్న ఊహాగానాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే దీర్ఘ‌కాలిక సంప‌ద సృష్టిపై దృష్టి పెట్ట‌డం మంచి వైఖ‌రి అవుతుంద‌న్న‌ది ఆయ‌న అభిప్రాయం. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణంలో ఇన్వెస్ట‌ర్లు స్వ‌ల్ప‌కాలిక ఆటుపోట్ల‌కు అతీతంగా ఆలోచించి నిల‌క‌డ వైఖ‌రి అనుస‌రించాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...