Tuesday, June 30, 2020

నిఫ్టీ జూన్ త్రైమాసికం 2009 త‌ర్వాత అత్యుత్త‌మం

దేశీయ స్టాక్ మార్కెట్ కోవిడ్, చైనా ప‌రిణామాల ప్ర‌భావం వ‌ల్ల ఇటీవ‌ల భారీగా ఊగిస‌లాడుతున్న‌ప్ప‌టికీ జూన్ త్రైమాసికంలో అత్య‌ద్భుత‌మైన ప‌నితీరు ప్ర‌ద‌ర్శించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నిఫ్టీ 19.8%, సెన్సెక్స్ 18.5 శాతం వృద్ధిని న‌మోదు చేశాయి. 2009 సంవ‌త్స‌రం త‌ర్వాత జూన్ త్రైమాసికంలో న‌మోదు చేసిన అద్భుత‌మైన వృద్ధి ఇది. మార్చిలో నాలుగు సంవ‌త్స‌రాల క‌నిష్ఠ స్థాయికి దిగ‌జారిన‌ప్ప‌టికీ క్ర‌మ‌క్ర‌మంగా ఆ ప‌త‌నం నుంచి కోలుకుంటూ ప‌దేళ్ల ఉత్త‌మ రికార్డును న‌మోదు చేయ‌గ‌లిగింద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే క‌రోనా, లిక్విడిటీ సంబంధిత ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో నిఫ్టీ స‌మీప భ‌విష్య‌త్తులో 10000-10500 ప‌రిధిలోనే క‌ద‌లాడ‌వ‌చ్చున‌న్న‌ది ఎస్ క్వైర్ కాపిట‌ల్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజ‌ర్స్ సిఇఒ సామ్రాట్ గుప్తా అభిప్రాయం. అయితే గ‌త ఏడాది ప్ర‌థ‌మార్ధంతో పోల్చితే మాత్రం ప్ర‌స్తుతం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 15 శాతం దిగువ‌న క‌ద‌లాడుతున్నాయి. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...