రిటైలర్ల సర్వేలో తేలిన నిజం
కరోనా వైరస్ సృష్టించిన అలజడి పుణ్యమా అని పలు వర్గాల కస్టమర్ల ప్రాధాన్యతలు గణనీయంగా మారిపోయాయి. లాక్ డౌన్ ముందు కాలంలో ఎగబడి షాపింగ్ కు పరుగులు తీసిన వారే ఇప్పుడు షాపింగ్ పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. దేశంలో రిటైల్ వినియోగదారుల ధోరణులపై రిటైలర్స్ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవం బట్టబయలయింది. లాక్ డౌన్ ముగిసి షాపింగ్ మాల్స్, హోటళ్లు ఒక్కటొక్కటిగా తెరుచుకుంటున్న ప్రస్తుత తరుణంలో కస్టమర్ల అభిమతం తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించారు. లాక్ డౌన్ ముగిసినా దేశంలో కరోనా కేసులు విజృంభిస్తూ ఉండడంతో పలువురు ఇప్పట్లో షాపింగ్ కు వెళ్లేది లేదనే అభిప్రాయమే ప్రకటించారు. మొత్తం 4239 మందిని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. మూడు నెలల నిరంతర లాక్ డౌన్ కారణంగా కుప్పకూలిన రిటైల్ రంగాన్ని అంత త్వరగా తిరిగి పట్టాలకెక్కిస్తామన్న ఆశలు దీనితో అంతరించిపోయాయి. రిటైల్ రంగం రికవరీ జాప్యం అవుతుందనేందుకు ఇది ఒక సంకేతమని ఆర్ఏఐ పేర్కొంది. అలాగే కస్టమర్లలో భయాన్ని పోగొట్టి వారిని షాపింగ్ కు అనుకూలంగా మార్చాలంటే పారిశుధ్యం, భద్రత చర్యలు పెంచాలని, సురక్షితమైన షాపింగ్ అనుభవం ఉంటుందన్న భరోసా వారికి కల్పించాలని ఆ సంఘం చెబుతోంది.
ఆర్ఏఐ సర్వేలో వివిధ ప్రశ్నలకు కస్టమర్ల నుంచి వచ్చిన సమాధానాలిలా ఉన్నాయి...
1) షాపింగ్ వ్యయాలు...
ఎ) భారీగా తగ్గించుకుంటాం 37%
బి) తగ్గించుకుంటాం 41%
సి) గతం కన్నా మారదు 16%
2) షాపింగ్ కు వెళ్తారా?
ఎ) వచ్చే 3 నెలల్లో ప్రయత్నిస్తాం 62%
బి) 3-12 నెలల్లో 32%
సి)ఇప్పట్లో అలాంటిది లేదు 6%
3) ఏ వస్తువులు కొంటారు?
ఎ) ఆహారం, దుస్తులు, నిత్యావసరాలు 52 శాతం
బి) ఎలక్ర్టానిక్స్ 31%
సి) సౌందర్య సాధనాలు 25%
No comments:
Post a Comment