Thursday, June 4, 2020

బ్యాంకుల గుండెల్లో ఎన్ పిఏ గుబుల్‌

కోవిడ్‌-19ని అదుపు చేసేందుకు ఇటీవ‌ల ఆర్ బిఐ, ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు చ‌ర్య‌ల ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది బ్యాంకుల ఎన్ పిఏలు (మొండి బ‌కాయిలు) భారీగా పెరిగిపోనున్నాయి. ఈ ఏడాది మార్చి చివ‌రి నాటికి 8.6 శాతం ఉన్న ఈ ఎన్ పిఏలు వ‌చ్చే ఏడాదికి 11.6 శాతానికి దూసుకుపోవ‌చ్చునంటున్నారు. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు ప్రామాణిక రుణాలుగా ఉన్న వాటిలో 5.5 శాతం ఖాతాలు తాజాగా ఎన్ పిఏల్లోకి జారుకోవ‌చ్చున‌ని కూడా అంటున్నారు. ఇటీవ‌ల చ‌ర్య‌ల ప్ర‌భావం వ‌ల్ల బ్యాంకుల రుణ‌విత‌ర‌ణ బాధ్య‌త పెరిగిపోవ‌డంతో పాటు ఆదాయాల‌పై తీవ్ర‌ ప్ర‌భావం ప‌డుతుంద‌ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చెబుతోంది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు ఈ ఏడాది రూ.45 వేల కోట్ల నుంచి రూ.82500 కోట్ల వ‌ర‌కు అద‌న‌పు పెట్టుబ‌డుల మ‌ద్ద‌తు అవ‌స‌రం కావ‌చ్చున‌ని అంచ‌నా వేసింది. లాక్ డౌన్  ప్ర‌భావం వ‌ల్ల రుణ గ్ర‌హీత‌ల రుణాల చెల్లింపు సామ‌ర్థ్యం భారీగా దెబ్బ తిన్న‌ద‌ని తేల్చి చెప్పింది. బ్యాంకులు ఎన్ పిఏల కోసం చేసుకునే కేటాయింపులు ఈ ఏడాది భారీగా ఉండ‌వ‌చ్చున‌ని, దీని ప్ర‌భావం వ‌ల్ల వ‌రుస‌గా ఆరో ఏడాది కూడా భారీ న‌ష్టాలు న‌మోదు చేసే ఆస్కారం ఉన్న‌ద‌ని క్రిసిల్ తెలిపింది. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...