Sunday, September 26, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17550 దిగువన బేరిష్      

(సెప్టెంబర్ 27-అక్టోబర్ 1 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17853 (+268)

గత వారంలో నిఫ్టీ 17326 - 17948 పాయింట్ల మధ్యన కదలాడి 268 పాయింట్ల లాభంతో 17853 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17550 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 17048, 16421, 15608, 15240 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18150      బ్రేక్ డౌన్ స్థాయి : 17550

నిరోధ స్థాయిలు : 18000, 18075, 18150 (17925 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17700, 17625, 17550 (17775 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  
 
గ్రహగతులివే...   
 
- వృషభంలోని రోహిణి పాదం 3 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- కన్యలోని హస్త పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
తులలోని చిత్త  పాదం 3లో బుధ సంచారం
- తులలోని విశాఖ పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం 
- కన్యలోని హస్త పాదం 2లో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లోమేష నవాంశలో వక్రగతిలో శని సంచారం
వృషభంలోని రోహిణి పాదం 1లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం 

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)

తిథి : భాద్రపద బహుళ షష్టి              

నక్షత్రం : రోహిణి 

అప్రమత్తం :   పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; మిథున , తుల  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17853.20    (+30.25)   

ట్రెండ్ మార్పు సమయం :  10.52

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.08 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 12.22 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.28 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.20 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.20 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17925, 18000        మద్దతు : 17775, 17700
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, September 24, 2021

సెన్సెక్స్ ష‌ష్ఠి పూర్తి

స్టాక్ మార్కెట్ శుక్ర‌వారం (24 సెప్టెంబ‌ర్, 2021) మ‌రో చారిత్రక మైలురాయిని చేరింది. స‌రిగ్గా 31 సంవ‌త్స‌రాల కాలంలో సెన్సెక్స్ చారిత్ర‌క‌మైన 60000 పాయింట్ల శిఖ‌రంపై గ‌ర్వంగా నిలిచింది.

ఇండెక్స్ ల తీరిదే...
బిఎస్ఇ సెన్సెక్స్ - 163.11 పాయింట్ల లాభంతో 60,048.47 వ‌ద్ద క్లోజ్‌. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 60,333 పాయింట్లు.
ఎన్ఎస్ఇ నిఫ్టీ - 30.25 పాయింట్ల లాభంతో 17,853.20 వ‌ద్ద క్లోజ్‌. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 17,947.65 పాయింట్లు.

1000 నుంచి 60000కి ప్ర‌యాణం...
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి 1986లో ఏర్పాటు కాగా 1990 జూలై 25వ తేదీన‌ తొలిసారిగా సెన్సెక్స్ 1000 పాయింట్ల మైలురాయిని చేరింది. అప్ప‌టి నుంచి 60000 పాయింట్ల మైలురాయిని చేర‌డానికి 31 సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్టింది. ఈ 31 సంవ‌త్స‌రాల ప్ర‌యాణం ఎన్నో ఎగుడుదిగుడుల‌తో సాగింది. ఇంత‌కాలం సెన్సెక్స్ ప్ర‌యాణం ఒక తీర‌యితే 2021 సంవ‌త్స‌రంలో ప్ర‌యాణం మ‌రోతీరుగా సాగింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో కూడా సెన్సెక్స్ రికార్డు బుల్ ర‌న్ లో దూసుకుపోతూ రెండు కీల‌క మైలురాళ్లు దాటింది. 2021 జ‌న‌వ‌రి 21న తొలిసారి  50000 పైన నిల‌దొక్కుకున్న సెన్సెక్స్ కేవ‌లం 9 నెల‌ల కాలంలోనే మ‌రో కీల‌క మైలురాయి 60000 క‌న్నా పైన నిల‌దొక్కుకుంది.

31 సంవ‌త్స‌రాల‌ ప్ర‌యాణంలో సెన్సెక్స్ మైలురాళ్లు 

1990 జూలై 25 - 1000 పాయింట్లు
2006 ఫిబ్ర‌వ‌రి 6 - 10000 పాయింట్లు
2007 అక్టోబ‌ర్ 29 - 20000 పాయింట్ల‌
2015 మార్చి 4 - 30000 పాయింట్లు
2019 మే 23 - 40000 పాయింట్లు
2021 జ‌న‌వ‌రి 21 - 50000 పాయింట్లు
2021 సెప్టెంబ‌ర్ 24 -60000 పాయింట్లు

సెన్సెక్స్ ఆవిర్భావం - దేశంలోని తొలి స్టాక్ ఎక్స్ఛేంజి సెన్సెక్స్. 1986లో దీన్ని ప్రారంభించారు. 1990 జ‌న‌వ‌రి 25న సెన్సెక్స్ తొలిసారిగా 1000 పాయింట్ల మైలురాయిని దాటింది. 2006 ఫిబ్ర‌వ‌రి 7న 10,000 పాయింట్ల జీవిత కాల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది.

ఈ 31 సంవ‌త్స‌రాల ప్ర‌యాణంలో హ‌ర్ష‌ద్ మెహ‌తా కుంభ‌కోణం (1992);  ముంబై, బిఎస్ఇ భ‌వ‌నం వ‌ద్ద‌ పేలుళ్లు (1993;  కార్గిల్ యుద్ధం (1999);  అమెరికా, భార‌త పార్ల‌మెంటుపై ఉగ్ర‌వాద దాడులు (2001);  స‌త్యం కుంభ‌కోణం (2007);  ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం (2008);  పిఎన్ బి కుంభ‌కోణం;  క‌రోనా మ‌హ‌మ్మారి వంటి ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొంది. ఇదే కాలంలో ఎన్నో ఆరోగ్య‌వంత‌మైన ప‌రిణామాలు కూడా చ‌వి చూసింది. 

2021 సెన్సెక్స్ రికార్డులివే...

2021 జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని చేరింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని తాకింది.

జూలై 7 - తొలిసారి 53000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటి, ఆ పైనే క్లోజ‌యింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటి, అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

ఆగ‌స్టు  27 - తొలిసారి 56000 కన్నా పైన క్లోజ్ అయింది.

ఆగ‌స్టు 31 - తొలిసారి 57000 కన్నా పైన క్లోజ్ అయింది. 

(స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.250 ల‌క్ష‌ల కోట్లు దాటింది).

సెప్టెంబ‌ర్ 3 - తొలిసారి 58000 దాటి అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

(ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.1.53 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.254.12 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది).

సెప్టెంబర్ 16 - తొలిసారి 59000 కన్నా పైన క్లోజ్ అయింది. (ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  సెన్సెక్స్ 11,389.83 పాయింట్లు లాభపడింది. ఇన్వెస్టర్ల సంపద రూ.2,60,78,355.12 కోట్లకు చేరింది).

సెప్టెంబర్ 24 - తొలిసారి 60000 కన్నా పైన క్లోజ్ అయింది. 

------------------------------------- 

107 రోజుల్లో కోటి ఖాతాలు...

ఈక్విటీ మార్కెట్ ప‌ట్ల స‌గ‌టు ఇన్వెస్ట‌ర్లు ఆక‌ర్షితుల‌వుతున్నారు. 107 రోజుల్లో కోటి కొత్త ఇన్వెస్ట‌ర్‌ ఖాతాలు న‌మోదు కావ‌డ‌మే ఇందుకు తార్కాణం. జూన్ 6వ తేదీన 7 కోట్ల ఖాతాల నుంచి సెప్టెంబ‌ర్ 21వ తేదీ నాటికి ఇన్వెస్ట‌ర్ ఖాతాలు 8 కోట్ల మైలురాయిని దాటాయి. అతి త‌క్కువ కాలంలో కోటి ఖాతాలు న‌మోదైన రికార్డు ఇదే. కేవ‌లం గ‌త 12 నెల‌ల కాలంలోనే (2020 మే 23 నుంచి) 2 కోట్ల కొత్త ఖాతాలు న‌మోద‌య్యాయి. 2008 ఫిబ్ర‌వ‌రిలో కోటి ఖాతాల మైలురాయి దాటింది. 2011 జూలైలో 2 కోట్లు, 2014 జ‌న‌వ‌రిలో 3 కోట్లు, 2018 ఆగ‌స్టులో 4 కోట్ల మైలురాళ్లు దాటాయి.  2020 మేలో 5 కోట్లు, 2021 జ‌న‌వ‌రి 19న 6 కోట్లు మైలురాళ్ల‌ను దాటాయి.

---------------------------------------- 

"సెన్సెక్స్ 60000 పాయింట్ల మైలురాయిని చేర‌డం భార‌త‌దేశం వృద్ధి సామ‌ర్థ్యానికి నిద‌ర్శ‌నం. భారీ సంఖ్య‌లో ఇన్వెస్ట‌ర్లు నేరుగా  గాని లేదా ప‌రోక్షంగా మ్యూచువ‌ల్ ఫండ్ మార్గంలో గాని ఈక్విటీ మార్కెట్ లోకి వ‌స్తున్నారు. ఇటీవ‌ల కాలంలో షేర్ల ధ‌ర‌ల ప‌రిధి  విస్తృతంగా ఉంది. ఈ విజ‌యానికి భార‌త పౌరులు, ఇన్వెస్ట‌ర్లంద‌రికీ నా శుభాకాంక్ష‌లు". 
- ఆశిష్ కుమార్ చౌహాన్‌, ఎండి అండ్ సిఇఓ
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి 
------------------------------------------- 

త‌గ్గిన‌ప్పుడు కొనండి...
ద‌లాల్ స్ర్టీట్ లో సెంటిమెంట్ బుల్లిష్ గా ఉంద‌ని, క‌రెక్ష‌న్ ఏర్ప‌డి ఏ మాత్రం త‌గ్గినా కొనుగోళ్ల‌కి మంచి అవ‌కాశ‌మ‌ని ఈక్విటీ మాస్ట‌ర్ సీనియ‌ర్ రీసెర్చ్ అన‌లిస్ట్ బ్ర‌జేష్ భాటియా స‌ల‌హా ఇచ్చారు. "ఇప్పుడు కొనుగోళ్లు విస్తృతంగా ఉన్నాయి, లార్జ్ క్యాప్ ల‌తో పాటు మిడ్ క్యాప్ లు, స్మాల్ క్యాప్ ల‌లో కూడా కొనుగోళ్లు జ‌రుగుతున్నాయి. మార్కెట్లో ఈ ఉత్సాహం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు కొన‌సాగ‌వ‌చ్చు. ఆటుపోట్లు కూడా ఉన్న‌ప్ప‌టికీ ఈక్విటీ సూచీల ప‌య‌నం ఊర్ధ్వ‌ముఖంగానే సాగ‌వ‌చ్చు" అన్నారు.  

"ఈ 60000 శిఖ‌రంపై కూడా మంచి నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యాలు, మ‌ధ్య‌కాలం నుంచి దీర్ఘ‌కాలంలో వృద్ధి సామ‌ర్థ్యం గ‌ల బ‌ల‌మైన కంపెనీల‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయాల‌ని  ఇన్వెస్ట‌ర్ల‌కు స‌ల‌హా ఇస్తున్నాం. కొనుగోళ్లు ద‌శ‌ల‌వారీగానే  చేప‌ట్టండి. మొత్తం నిధుల‌న్నింటినీ ఈ స్థాయిలోనే లాక్ చేసుకోకండి." 
- శ్రీ‌కాంత్ చౌహాన్‌, హెడ్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్), కోట‌క్ సెక్యూరిటీస్‌

"మార్కెట్ విలువ‌లు గ‌రిష్ఠంగా ఉన్న మాట నిజం. కాని అదే స‌మ‌యంలో మ‌రో కోణంలో ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉంది. అందుకే ఈక్విటీల్లో త‌క్కువ పెట్టుబ‌డులు పెట్ట‌వ‌ద్దు. అయితే పోర్ట్ ఫోలియోల‌ను రీ బాలెన్స్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత పోర్ట్ ఫోలియోలో ఉన్న లోపాల‌ను స‌రిదిద్దుకుని, వెనుక‌బ‌డిన మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ల‌లోని నిధుల‌ను లార్జ్ క్యాప్ ల‌కు మార్చుకోవ‌చ్చు." 
- నిమిష్ షా, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీస‌ర్‌, వాట‌ర్ ఫీల్డ్ అడ్వైజ‌ర్స్

Thursday, September 23, 2021

ఆగ‌ని బుల్ చిందు

ఈక్విటీ మార్కెట్ లో జోరు ఇంకా ఆగేలా లేదు. బుల్స్ మ‌రోసారి రెచ్చిపోయాయి. ఈక్విటీ సూచీలు కొత్త రికార్డులు న‌మోదు చేశాయి. అమెరిక‌న్‌ ఫెడ‌ర‌ల్ ప్ర‌క‌టించిన క‌ఠిన వైఖ‌రికి జంక‌ని అంత‌ర్జాతీయ ఈక్విటీలు పాజిటివ్ ట్రెండ్ క‌న‌బ‌డ‌చ‌డంతో పాటు రూపాయి బ‌ల‌ప‌డ‌డం ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను బ‌ల‌ప‌రిచింది. ఇన్వెస్ట‌ర్లు అన్ని విభాగాల్లోనూ పెట్టుబ‌డులు పెట్ట‌డంతో సెన్సెక్స్ 60,000 పాయింట్ల కొత్త మైలురాయికి అత్యంత స‌మీపంలో 59,885.36 వ‌ద్ద 958.03 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ చ‌రిత్ర‌లో ఇది ఒక కొత్త క్లోజింగ్ రికార్డు. ఒక ద‌శ‌లో సెన్సెక్స్ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 59,957.25 పాయింట్ల‌ను తాకింది. నిఫ్టీ 17,843.90 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని తాకిన అనంత‌రం 276.30 పాయింట్ల లాభంతో కొత్త గ‌రిష్ఠ స్థాయి 17,822.95 వ‌ద్ద ముగిసింది.

- విభాగాల‌వారీగా చూస్తే ఒక్క ఎఫ్ఎంసిజి మిన‌హా రియ‌ల్టీ, బ్యాంకెక్స్, ఎన‌ర్జీ, ఫైనాన్స్, కేపిట‌ల్ గూడ్స్, ఇండ‌స్ర్టియ‌ల్స్ సూచీలు 8.71 శాతం వ‌ర‌కు లాభ‌ప‌డ్డాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభ‌ప‌డ్డాయి. 

మార్కెట్ విలువ‌లో కొత్త రికార్డు

గురువారం నాటి రికార్డు లాభాల‌తో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.3,16,778.1 కోట్లు పెరిగి రూ.2,61,73,374.32 కోట్ల‌కు చేరింది. 

ఏడాది మొత్తం జోరే

స్టాక్ మార్కెట్ ఏడాది మొత్తం జోరులోనే ఉంది. 2020 మార్చిలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏర్ప‌డిన ర‌క్త‌పాతం అనంత‌రం 2021 సెప్టెంబ‌ర్ లో 59000 పాయింట్ల‌కు చేరే నాటికి సెన్సెక్స్ 110 శాతానికి పైగా  లాభ‌ప‌డింది. 2021 జ‌న‌వ‌రిలో తొలిసారిగా  సెన్సెక్స్ 50000 పాయింట్లు దాటింది.  ఆగ‌స్టు 31 నుంచి సెప్టెంబ‌ర్ 3వ తేదీ మ‌ధ్య కాలంలో 57000 నుంచి 58000 పాయింట్ల‌కు (1000 పాయింట్లు-3 రోజులు) చేరింది. సెప్టెంబ‌ర్ 23 నాటికి  2021 సంవ‌త్స‌రంలో సెన్సెక్స్ 12,347.86 పాయింట్లు లాభ‌ప‌డింది.

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

సాధారణంగా మెరుగు 

తిథి : భాద్రపద బహుళ చతుర్థి               

నక్షత్రం : భరణి 

అప్రమత్తం :  మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర;   మిథున, తుల  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17822.95    (+276.30)   

ట్రెండ్ మార్పు సమయం :  3.29

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.19 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.34 వరకు నిలకడగా, తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.40 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17900, 17975        మద్దతు : 17750, 17675
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, September 22, 2021

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ముగింపు సెషన్ మెరుగు 

తిథి : భాద్రపద బహుళ తదియ                 

నక్షత్రం : అశ్విని 

అప్రమత్తం :  రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; మిథున, తుల  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17546.65    (-15.35)   

ట్రెండ్ మార్పు సమయం :  1.11

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.25 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.38 వరకు నిస్తేజంగా, తదుపరి 2.44 వరకు బలహీనంగా ట్రేడవుతూ చివరిలో మెరుగ్గా మారవచ్చు.   

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17625, 17675        మద్దతు : 17475, 17425
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, September 20, 2021

ముగింపు సెషన్ బలహీనం

తిథి : భాద్రపద బహుళ పాడ్యమి             

నక్షత్రం : ఉత్తరాభాద్ర  

అప్రమత్తం :     భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; మేష, సింహ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  17396.90    (-188.25)   

ట్రెండ్ మార్పు సమయం :  10.13

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.07 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.20 వరకు మెరుగ్గా, తదుపరి 2.26 వరకు  నిస్తేజంగా ట్రేడవుతూ చివరిలో బలహీనంగా మారవచ్చు.   

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.15 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17475, 17525        మద్దతు : 17325, 17250
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, September 19, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17275 దిగువన బేరిష్      

(సెప్టెంబర్ 20-24 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17585 (+216)

గత వారంలో నిఫ్టీ 17269 - 17793 పాయింట్ల మధ్యన కదలాడి 216 పాయింట్ల లాభంతో 17585 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17275 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 16828, 16421, 15526, 15125 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17875      బ్రేక్ డౌన్ స్థాయి : 17275

నిరోధ స్థాయిలు : 17725, 17800, 17875 (17650 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17425, 17350, 17275 (17500 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

గ్రహగతులివే...   
 
- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1 నుంచి మేషంలోని భరణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- కన్యలోని ఉత్తర పాదం 2-4 మధ్యలో రవి సంచారం 
- కన్యలోని చిత్త పాదం 2 నుంచి తులలోని చిత్త  పాదం 3 మధ్యలో బుధ సంచారం
- తులలోని స్వాతి పాదం 3 నుంచి విశాఖ పాదం 1 మధ్యలో శుక్ర సంచారం 
- కన్యాలోని ఉత్తర పాదం 4 నుంచి హస్త పాదం 1 మధ్యలో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 1లోమేష నవాంశలో వక్రగతిలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 1లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం 

--------------------------------- 

 మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి)

తిథి : భాద్రపద శుక్ల పౌర్ణమి               

నక్షత్రం : పూర్వాభాద్ర  

అప్రమత్తం :    అశ్విని, మఖ, మూల నక్షత్ర; మీన, కర్కాటక  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  16529.10    (+164.70)   

ట్రెండ్ మార్పు సమయం :  9.32

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.35 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.50 వరకు నిస్తేజంగాను, తదుపరి 2.56 వరకు  మెరుగ్గానూ ట్రేడవుతూ తదుపరి బలహీనంగా మారవచ్చు.   

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 10.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.50 తర్వాత మెరుగ్గా ఉంటె మర్రిన్ని లాంగ్ పొజిషన్లఫై ద్రుష్టి పెట్టవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17660, 17725        మద్దతు : 17510, 17450
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Thursday, September 16, 2021

సెన్సెక్స్ @ 59000

టెలికాం, ఆటో రంగాల‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంస్క‌ర‌ణ‌ల మ‌ద్ద‌తుతో మార్కెట్ గురువారం ఉర‌క‌లెత్తింది. ఇన్వెస్ట‌ర్లు తిరిగి రిస్క్ తీసుకునే ధోర‌ణిలో ప‌డి ప‌లు రంగాల కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేశారు. బ్యాంకెక్స్ అధికంగా 2.12 శాతం లాభ‌ప‌డింది.   బిఎస్ఇ మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ల‌తో పాటు ఎన‌ర్జీ, ఫైనాన్స్, ఎఫ్ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాల సూచీలు లాభ‌ప‌డ్డాయి. ఆసియా దేశాల‌కు చెందిన షాంఘై, సియోల్‌, టోక్యో, హాంకాంగ్ ఈక్విటీ మార్కెట్లు భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్న వాతావ‌ర‌ణంలో కూడా భార‌త ఈక్విటీ మార్కెట్ ఆ ధోర‌ణికి ఎదురీది మంచి లాభాలు సాధించింది. విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు కూడా బుధ‌వారం రూ.232.84 కోట్ల విలువ గ‌ల షేర్లు కొనుగోలు చేశారు. 

సూచీల కొత్త రికార్డు

బిఎస్ఇ సెన్సెక్స్ తొలిసారి 59000 క‌న్నా పైన, నిఫ్టీ 17600 క‌న్నా పైన స్థిర‌ప‌డ్డాయి. స్టాక్ మార్కెట్ లాభ‌ప‌డ‌డం వ‌రుస‌గా ఇది మూడో రోజు. సెన్సెక్స్ 417.96 పాయింట్ల లాభంతో 59,141.16 వ‌ద్ద‌ ముగిసింది. ఇంట్రాడేలో 59,204.29 పాయింట్ల‌ను తాకింది. ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ 110.05 పాయింట్ల లాభంతో 17,629.50 వ‌ద్ద క్లోజ‌యింది. ఇంట్రాడేలో 17,644.60 పాయింట్ల‌కు తాకింది. ఇవ‌న్నీ సూచీల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిలే. 2021 సంవ‌త్స‌రంలో ఇప్పటి వరకు  సెన్సెక్స్ 11,389.83 పాయింట్లు లాభపడింది.

రూ.4.46 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన సంప‌ద‌

మూడు రోజుల వ‌రుస‌ ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.4,46,043.65 కోట్లు పెరిగి మ‌రో జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి రూ.2,60,78,355.12 కోట్ల‌కు దూసుకుపోయింది. 

--------------------------------------------------------- 

ఈ ఏడాది (2021) సెన్సెక్స్ రికార్డులు...

జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని చేరింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని తాకింది.

జూలై 7 - తొలిసారి 53000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటి, ఆ పైనే క్లోజ‌యింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటి, అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

ఆగ‌స్టు  27 - తొలిసారి 56000 కన్నా పైన క్లోజ్ అయింది.

ఆగ‌స్టు 31 - తొలిసారి 57000 కన్నా పైన క్లోజ్ అయింది. (స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.250 ల‌క్ష‌ల కోట్లు దాటింది).

సెప్టెంబ‌ర్ 3 - తొలిసారి 58000 దాటి అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.(ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.1.53 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.254.12 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది).

సెప్టెంబర్ 16 - తొలిసారి 59000 కన్నా పైన క్లోజ్ అయింది. (ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  సెన్సెక్స్ 11,389.83 పాయింట్లు లాభపడింది. ఇన్వెస్టర్ల సంపద రూ.2,60,78,355.12 కోట్లకు చేరింది). 

Sunday, September 5, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

17025 దిగువన బేరిష్    

(సెప్టెంబర్ 6-10 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  17324 (+619)

గత వారంలో నిఫ్టీ 17340 - 16765 పాయింట్ల మధ్యన కదలాడి 619 పాయింట్ల లాభంతో 17324 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17025 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 16356, 16125, 15343, 14920 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17575      బ్రేక్ డౌన్ స్థాయి : 17025

నిరోధ స్థాయిలు : 17475, 17500, 17575 (17400 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17175, 17100, 17025 (17250 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------  

గ్రహగతులివే...   
 
- సింహంలోని మఖ పాదం 3 నుంచి తులలోని స్వాతి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- సింహంలోని పుబ్బ పాదం 2-4 మధ్యలో రవి సంచారం 
- కన్యలోని హస్త పాదం 2-4 మధ్యలో బుధ సంచారం
- కన్యలోని చిత్త పాదం 3-4 మధ్యలో శుక్ర సంచారం 
- కెన్యాలోని ఉత్తర పాదం 2 లో కుజ సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 4లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని శ్రవణం పాదం 2లో వృషభ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- వృషభంలోని రోహిణి పాదం 1లో రాహువు, వృశ్చికంలోని అనురాధ పాదం 3లో కేతువు సంచారం 

--------------------------------- 

ఉదయం సెషన్  మెరుగు  (సోమవారానికి)

తిథి : భాద్రపద శుక్ల పాడ్యమి              

నక్షత్రం : మఖ  

అప్రమత్తం :   రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర; కన్య, మకర రాశి జాతకులు   
 
నిఫ్టీ :  16529.10    (+164.70)   

ట్రెండ్ మార్పు సమయం :  11.57

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.30 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.45 వరకు నిస్తేజంగాను, తదుపరి చివరి వరకు  బలహీనంగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17400, 17475        మద్దతు : 17250, 17175
----------------------------------------------  
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, September 3, 2021

3 రోజులు-1000 పాయింట్లు

బుల్ ర‌న్ లో సెన్సెక్స్ జోరు

భార‌త స్టాక్ మార్కెట్ ప్ర‌ధాన సూచి సెన్సెక్స్ కేవ‌లం మూడు రోజుల్లో వెయ్యి పాయింట్లు లాభ‌ప‌డింది. శుక్ర‌వారం తొలిసారిగా 58 వేల మైలురాయిని దాటింది. ఇన్వెస్ట‌ర్లు రిస్క్ తీసుకునే ధోర‌ణిలోకి వెళ్ల‌డం, సానుకూల స్థూల ఆర్థిక గ‌ణాంకాలు, విదేశీ నిధుల రాక‌లో నిల‌క‌డ ధోర‌ణి మార్కెట్ ను ప‌రుగులు తీయించాయి. వ‌రుస‌గా రెండో రోజు కూడా లాభ‌ప‌డిన సెన్సెక్స్ 277.41 పాయింట్లు లాభ‌ప‌డి జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 58129.95 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ మ‌రో జీవిత‌కాల గ‌రిష్ఠ రికార్డు 58194.79 పాయింట్ల‌ను తాకింది. సెన్సెక్స్ 57000 శిఖ‌రాన్ని అధిరోహించిన కేవ‌లం మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే వెయ్యి పాయింట్లు లాభ‌ప‌డి 58000 మైలురాయిని కూడా దాటింది. ఆరు వ‌రుస సెష‌న్ల‌లో ఐదింటిలో సెన్సెక్స్ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిలు న‌మోదు చేస్తూనే వ‌చ్చింది. ఎన్ఎస్ఇ ప్ర‌ధాన సూచి నిఫ్టీ 89.45 పాయింట్లు లాభ‌ప‌డి 17323.60 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. ఇంట్రాడేలో 17340.10 పాయింట్ల‌ను తాకింది. నిఫ్టీకి ఇవి రెండూ కొత్త జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిలే. మొత్తం మీద రెండు సూచీల‌కు ఇది అద్భుత‌మైన లాభాలు అందించిన వారంగా నిలిచింది. వారంలో సెన్సెక్స్ 2005.23 పాయింట్లు, నిఫ్టీ 618.40 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి.  బిఎస్ఇ ఎన‌ర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్‌, మెట‌ల్‌, క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్ సూచీలు 3.60 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు 0.41 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. 

సంప‌ద‌లో రికార్డు

ఈ ర్యాలీ మ‌ద్ద‌తుతో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.1.53 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.254.12 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. ఈ సంవ‌త్స‌రంలో (2021) ఇప్ప‌టివ‌ర‌కు సెన్సెక్స్ 10,378.62 పాయింట్లు లాభ‌ప‌డింది.  

-------------------------------------------- 

2021 సెన్సెక్స్ రికార్డులివే...

2021 జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని చేరింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని తాకింది.

జూలై 7 - తొలిసారి 53000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటి, ఆ పైనే క్లోజ‌యింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటి, అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

ఆగ‌స్టు  27 - తొలిసారి 56000 కన్నా పైన క్లోజ్ అయింది.

ఆగ‌స్టు 31 - తొలిసారి 57000 కన్నా పైన క్లోజ్ అయింది. 

(స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.250 ల‌క్ష‌ల కోట్లు దాటింది).

సెప్టెంబ‌ర్ 3 - తొలిసారి 58000 దాటి అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

Thursday, September 2, 2021

బుల్ హ‌ల్ చ‌ల్‌

గ‌స్టు నెల అంతా వీర‌విహారం చేసిన స్టాక్‌మార్కెట్ బుల్ ఈ నెల ఒక‌టో తేదీన స్వ‌ల్పంగా వెనుక‌డుగేసిన‌ట్టు క‌నిపించినా రెండో రోజు రెచ్చిపోయాయి. స్థూల ఆర్థిక గ‌ణాంకాల ప‌ట్ల సంతృప్తి పొందిన ఇన్వెస్ట‌ర్లు భారీగా నిధులు ఇన్వెస్ట్ చేయ‌డంతో ప్ర‌పంచ షేర్లు లాభాల్లో దూసుకుపోవ‌డం భార‌త మార్కెట్ కు ఉత్తేజంనింపింది. ఐటి, ఎఫ్ఎంసిజి, బ్యాంకు షేర్ల కొనుగోళ్ల‌తో స్టాక్ ఇండెక్స్ లు కొత్త శిఖ‌రాల‌కు చేరి కొత్త శిఖ‌రాల్లోనే క్లోజ‌య్యాయి. సెప్టెంబ‌ర్ రెండ‌వ తేదీన బిఎస్ఇ సెన్సెక్స్ 514.33 పాయింట్లు లాభ‌ప‌డి కొత్త జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 57852.54 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఒక్క ఆగ‌స్టు నెల‌లోనే సెన్సెక్స్ 9 శాతం లాభ‌ప‌డి 57000 పాయింట్ల‌ను దాటింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 157.90 పాయింట్ల లాభంతో  17234.15 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. బిఎస్ఇ ఎఫ్ఎంసిజి, ఐటి, క‌న్స్యూర్ డ్యూర‌బుల్స్, టెక్నాల‌జీ, బేసిక్ మెటీరియ‌ల్స్, రియ‌ల్టీ ఇండెక్స్ లు 1.56 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాల సూచీలు మాత్ర‌మే న‌ష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.93 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. సెన్సెక్స్ లోని 30 షేర్ల‌లో 22 లాభాల్లో ముగిశాయి. 

చిన్న షేర్ల‌ లాభాల పంట‌

ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 1వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం చిన్న షేర్లు ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాల‌పంట పండించాయి. ఈ ఏడాది ర్యాలీలో భాగంగా బిఎస్ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 30.36 శాతం (6270.61 పాయింట్లు), మిడ్ క్యాప్ ఇండెక్స్ 18.19 శాతం (3672.12 పాయింట్లు) లాభ‌ప‌డిన‌ట్టు ఆర్థిక సంవ‌త్స‌రం తొలి ఐదు నెల‌ల తీరుపై జ‌రిగిన విశ్లేష‌ణ‌లో తేలింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 16.24 శాతం (57,552.39 పాయింట్లు) లాభ‌ప‌డింది. ఆగ‌స్టులో సెన్సెక్స్, నిఫ్టీల‌తో పోల్చితే స్మాల్ క్యాప్‌, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు కాస్తంత మంద‌కొడిగానే ఉన్న‌ప్ప‌టికీ మొత్తం మీద మెరుగైన ప‌నితీరునే ప్ర‌ద‌ర్శించాయ‌ని విశ్లేష‌కులంటున్నారు. ఆగ‌స్టు 4వ తేదీన మిడ్ క్యాప్ ఇండెక్స్ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 23,872.83 పాయింట్ల‌ను న‌మోదు చేయ‌గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 27,323.18 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. ఆగ‌స్టు నెల‌లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.31 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం లాభ‌ప‌డ్డాయి. కార్పొరేట్ కంపెనీల మెరుగైన ఆర్థిక ఫ‌లితాలు, మెరుగు ప‌డిన మార్కెట్ సెంటిమెంట్‌, త‌గినంత లిక్విడిటీ స్టాక్ మార్కెట్ల‌ను ఆదుకున్నాయి. ఏప్రిల్‌, మే నెల‌ల్లో క‌రోనా 2.0 క‌ల్లోలం సృష్టించినా స్టాక్ మార్కెట్ మాత్రం ఆ దాడిని త‌ట్టుకుని నిల‌బ‌డింది. ఎగుమ‌తులు, రోజువారీ ఇ-వే బిల్లులు, స్థూల ప‌న్ను వ‌సూళ్లు, ఆటో అమ్మ‌కాలు కూడా మార్కెట్ ను సానుకూల బాట‌లో నిలిపాయ‌ని, క‌రోనా దాడిని త‌ట్టుకుని కూడా మార్కెట్ నిల‌బ‌డ‌డానికి అదే కార‌ణ‌మ‌ని మోతీలాల్ ఓస్వాల్ ఎవిపి స్నేహ పోద్దార్ అన్నారు.  సాధార‌ణంగా స్థానిక ఇన్వెస్ట‌ర్లు చిన్న షేర్ల పైన‌, విదేశీ ఇన్వెస్ట‌ర్లు బ్లూచిప్ షేర్ల పైన మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తార‌ని విశ్లేష‌కులంటున్నారు. బ్లూచిప్ ల‌తో పోల్చితే ఐదో వంతు విలువ ప‌లికే షేర్ల‌ను మిడ్ క్యాప్ ఇండెక్స్, ప‌దో వంతు విలువ ఉండే షేర్ల‌ను స్మాల్ క్యాప్ ఇండెక్స్ ట్రాక్ చేస్తాయి. 

గ‌త ఏడాది సూచీల లాభాలు

గ‌త ఆర్థిక‌సంవ‌త్స‌రంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 114.89 శాతం (11040.89 పాయింట్లు), మిడ్ క్యాప్ ఇండెక్స్ 90.93 శాతం (9611.38 పాయింట్లు) లాభ‌ప‌డ్డాయి. సెన్సెక్స్ 68 శాతం (20,040.66 పాయింట్లు) లాభ‌ప‌డింది. 

రెండు మూడేళ్లు జోరే...

వ‌చ్చే రెండు మూడు సంవ‌త్స‌రాల కాలంలో స్టాక్ మార్కెట్ మంచి వృద్ధినే సాధించ‌వ‌చ్చున‌ని అంటున్నారు. ఆర్థిక వృద్ధికి దీటుగా స్మాల్ క్యాప్‌, మిడ్ క్యాప్ కంపెనీలు కూడా ప్ర‌యోజ‌నం పొందుతాయ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. అయితే స్మాల్ క్యాప్ స్టాక్ ల విష‌యంలో రిటైల్ ఇన్వెస్ట‌ర్లు అమిత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డ‌మే కాస్తంత ఆందోళ‌న‌క‌ర‌మైన అంశ‌మ‌న్న‌ది కొంద‌రి వాదం. 

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...