Thursday, September 16, 2021

సెన్సెక్స్ @ 59000

టెలికాం, ఆటో రంగాల‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంస్క‌ర‌ణ‌ల మ‌ద్ద‌తుతో మార్కెట్ గురువారం ఉర‌క‌లెత్తింది. ఇన్వెస్ట‌ర్లు తిరిగి రిస్క్ తీసుకునే ధోర‌ణిలో ప‌డి ప‌లు రంగాల కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేశారు. బ్యాంకెక్స్ అధికంగా 2.12 శాతం లాభ‌ప‌డింది.   బిఎస్ఇ మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ల‌తో పాటు ఎన‌ర్జీ, ఫైనాన్స్, ఎఫ్ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాల సూచీలు లాభ‌ప‌డ్డాయి. ఆసియా దేశాల‌కు చెందిన షాంఘై, సియోల్‌, టోక్యో, హాంకాంగ్ ఈక్విటీ మార్కెట్లు భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్న వాతావ‌ర‌ణంలో కూడా భార‌త ఈక్విటీ మార్కెట్ ఆ ధోర‌ణికి ఎదురీది మంచి లాభాలు సాధించింది. విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు కూడా బుధ‌వారం రూ.232.84 కోట్ల విలువ గ‌ల షేర్లు కొనుగోలు చేశారు. 

సూచీల కొత్త రికార్డు

బిఎస్ఇ సెన్సెక్స్ తొలిసారి 59000 క‌న్నా పైన, నిఫ్టీ 17600 క‌న్నా పైన స్థిర‌ప‌డ్డాయి. స్టాక్ మార్కెట్ లాభ‌ప‌డ‌డం వ‌రుస‌గా ఇది మూడో రోజు. సెన్సెక్స్ 417.96 పాయింట్ల లాభంతో 59,141.16 వ‌ద్ద‌ ముగిసింది. ఇంట్రాడేలో 59,204.29 పాయింట్ల‌ను తాకింది. ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ 110.05 పాయింట్ల లాభంతో 17,629.50 వ‌ద్ద క్లోజ‌యింది. ఇంట్రాడేలో 17,644.60 పాయింట్ల‌కు తాకింది. ఇవ‌న్నీ సూచీల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిలే. 2021 సంవ‌త్స‌రంలో ఇప్పటి వరకు  సెన్సెక్స్ 11,389.83 పాయింట్లు లాభపడింది.

రూ.4.46 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన సంప‌ద‌

మూడు రోజుల వ‌రుస‌ ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.4,46,043.65 కోట్లు పెరిగి మ‌రో జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి రూ.2,60,78,355.12 కోట్ల‌కు దూసుకుపోయింది. 

--------------------------------------------------------- 

ఈ ఏడాది (2021) సెన్సెక్స్ రికార్డులు...

జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని చేరింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని తాకింది.

జూలై 7 - తొలిసారి 53000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటి, ఆ పైనే క్లోజ‌యింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటి, అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

ఆగ‌స్టు  27 - తొలిసారి 56000 కన్నా పైన క్లోజ్ అయింది.

ఆగ‌స్టు 31 - తొలిసారి 57000 కన్నా పైన క్లోజ్ అయింది. (స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.250 ల‌క్ష‌ల కోట్లు దాటింది).

సెప్టెంబ‌ర్ 3 - తొలిసారి 58000 దాటి అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.(ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.1.53 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.254.12 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది).

సెప్టెంబర్ 16 - తొలిసారి 59000 కన్నా పైన క్లోజ్ అయింది. (ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  సెన్సెక్స్ 11,389.83 పాయింట్లు లాభపడింది. ఇన్వెస్టర్ల సంపద రూ.2,60,78,355.12 కోట్లకు చేరింది). 


No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...