Tuesday, December 31, 2024

ఈ ఏడాది లాభం రూ.77.6 ల‌క్ష‌ల కోట్లు

ఈక్విటీ ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాల పంట‌

ఈక్విటీ మార్కెట్  2024 సంవ‌త్స‌రంలో ఇన్వెస్ట‌ర్ల‌కు అద్భుత‌మైన లాభాలు పంచింది. ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 5898.75 పాయింట్లు (8.16%) లాభ‌ప‌డ‌గా నిఫ్టీ 1913.40 పాయింట్లు (8.80%) లాభ‌ప‌డింది. ఫ‌లితంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌) రూ.77,66,260.19 కోట్లు లాభ‌ప‌డి రూ.4,41,95,106.44 కోట్ల‌కు (516 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) చేరింది. బిఎస్ఇ స్మాల్‌క్యాప్ సూచీ 12,506.84 పాయింట్లు (29.30%), మిడ్‌క్యాప్ సూచీ 9605.44 పాయింట్లు (26.07%) లాభ‌ప‌డ్డాయి. ఈ ఏడాది సెప్టెంబ‌రు 27వ తేదీన సెన్సెక్స్, నిఫ్టీ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిలు న‌మోదు చేశాయి. ఆ రోజు న‌మోదైన జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిలు సెన్సెక్స్ 85,978.25 పాయింట్లు కాగా నిఫ్టీ 26,277.35 పాయింట్లు. 
సెప్టెంబ‌రు త‌ర్వాత నిస్తేజం
2024 సంవ‌త్స‌రంలో ఈక్విటీ మార్కెట్ తీవ్ర ఆటుపోట్ల‌తో సాగింది. బుల్‌, బేర్ నువ్వా, నేనా అన్న‌ట్టు పోటీ ప‌డ్డాయి. కొన్నాళ్లు బుల్‌ది పైచేయి అయితే కొన్నాళ్లు బేర్ హ‌వా న‌డిచిన‌ట్టు క‌నిపించింది. ప్ర‌ధానంగా జ‌న‌వ‌రి నుంచి సెప్టెంబ‌రు వ‌ర‌కు సూచీలు నిల‌క‌డ‌గా పురోగ‌మించ‌గా ఆ త‌ర్వాత కాలంలో మార్కెట్‌పై బుల్ ప‌ట్టు పెరిగింది. విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌, దిగ‌జారుతున్న మార్కెట్ సెంటిమెంట్, పెరుగుతున్న క్రూడ్ ధ‌ర‌లు ఈక్విటీ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న మూడో త్రైమాసికం ఆర్థిక ఫ‌లితాలు; వృద్ధి, ఆదాయాల రిక‌వ‌రీ, కేంద్ర బ‌డ్జెట్‌పై రాబోయే కాలంలో ఇన్వెస్ట‌ర్లు  దృష్టి సారిస్తార‌ని నిపుణులంటున్నారు. 
న‌ష్టాల‌తో ఏడాదికి వీడ్కోలు
సెన్సెక్స్, నిఫ్టీ మంగ‌ళ‌వారం 2024 సంవ‌త్స‌ర‌పు చివ‌రి రోజు న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 109.12 పాయింట్లు న‌ష్ట‌పోయి 78,139.01 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం నామ‌మాత్రంగా 0.10 పాయింట్లు న‌ష్ట‌పోయి 23,644.80 వ‌ద్ద  ముగిసింది. 

Monday, December 30, 2024

రుపీ @ 86?

ఫారెక్స్ రివ్యూ 2024

విదేశీ ద్ర‌వ్య మార్కెట్లో ఈ ఏడాది రూపాయి భారీ ప‌త‌నాన్ని న‌మోదు చేసింది. 2024 సంవ‌త్స‌రం మొత్తం మీద డాల‌ర్ మార‌కంలో రూపాయి విలువ 3 శాతం క్షీణించి ప్ర‌స్తుతం 85.59 వ‌ద్ద క‌ద‌లాడుతోంది. 2024 జ‌న‌వ‌రి 1వ తేదీన డాల‌ర్ మార‌కంలో 83.19గా ఉన్న రూపాయి విలువ డిసెంబ‌ర్ 27 నాటికి 85.59 వ‌ద్ద క‌ద‌లాడుతోంది. కేవ‌లం గ‌త రెండు నెల‌ల కాలంలోనే దేశీయ క‌రెన్సీ విలువ 2 రూపాయ‌లు ప‌డిపోయింది. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ అక్టోబ‌రు 10వ తేదీన తొలిసారిగా 84 స్థాయి క‌న్నా దిగ‌జార‌గా డిసెంబ‌ర్ 19వ తేదీన 85 స్థాయి క‌న్నా దిగ‌జారింది. డిసెంబ‌ర్ 27వ తేదీన తొలిసారిగా జీవిత కాల క‌నిష్ఠ స్థాయి 85.80 న‌మోదు చేసింది. రెండేళ్ల కాలంలో ఒక్క రోజులో రూపాయి ఇంత భారీగా ప‌త‌నం కావ‌డం ఇదే ప్ర‌థ‌మం. అయితే ఇత‌ర క‌రెన్సీల‌తో పోల్చితే మాత్రం రూపాయి బ‌ల‌ప‌డింది. జ‌పాన్ యెన్‌తో పోల్చితే 8.7 శాతం పుంజుకుంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 1న‌ 100 యెన్‌ల‌కు 58.99 ప‌లుకుతుండ‌గా డిసెంబ‌ర్ 27 నాటికి 54.26కి పుంజుకుంది. అలాగే యూరోతో పోల్చినా కూడా 5 శాతం లాభ‌ప‌డి డిసెంబ‌ర్ 27 నాటికి 89.11 వ‌ద్ద క‌ద‌లాడుతోంది. 
ఎందుకిలా జ‌రిగింది...? 
2024 సంవ‌త్స‌రం ప్ర‌పంచంలోని ప్ర‌ధాన క‌రెన్సీల‌తో భార‌త క‌రెన్సీ రూపాయిని తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప‌శ్చిమాసియా సంక్షోభం, రెడ్ సీ సంక్షోభం వంటివ‌న్నీ క‌రెన్సీ విలువ‌పై ప్ర‌భావం చూపాయి. ప్ర‌పంచంలోని వివిధ కేంద్ర బ్యాంకులు తీసుకున్న చ‌ర్య‌లు ఒక్క రూపాయి-డాల‌ర్ మార‌కం పైనే కాదు...అన్ని వ‌ర్థ‌మాన దేశాల క‌రెన్సీల విలువ‌ల‌నూ ప్ర‌భావితం చేశాయి. అయితే ఇత‌ర క‌రెన్సీల‌తో పోల్చితే డాల‌ర్ విలువ‌ప‌రంగానే రూపాయి బాగా న‌ష్ట‌పోయింది. కాని మ‌న క‌రెన్సీ వ‌ర్థ‌మాన మార్కెట్లకు చెందిన ఇత‌ర క‌రెన్సీల‌తో పోల్చితే త‌క్కువ ఆటుపోట్ల‌నే ఎదుర్కొన్న‌ద‌ని నాటి ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ డిసెంబ‌ర్ ద్వైమాసిక స‌మీక్ష‌లో తెలిపారు.  అయిన‌ప్ప‌టికీ రూపాయిని స్థిరీక‌రించేందుకు ఆర్‌బిఐ క్రియాశీలంగా కృషి చేయాల్సి వ‌స్తోంది. ఈ కార‌ణంగానే విదేశీ మార‌కం నిల్వ‌లు సెప్టెంబ‌ర్ చివ‌రిలో న‌మోదైన చారిత్ర‌క గ‌రిష్ఠ స్థ‌యి 70,489 కోట్ల డాల‌ర్ల స్థాయి నుంచి డిసెంబ‌ర్ 20వ తేదీ నాటికి ఆరు నెల‌ల క‌నిష్ఠ స్థాయి 64,439 కోట్ల డాల‌ర్ల స్థాయికి త‌గ్గాయి. 
అమెరికా శ‌క్తివంతం కావ‌డ‌మే కార‌ణం 
అమెరికాలో స్థూల ఆర్థిక  స్థితిగ‌తులు మెరుగుప‌డ‌డ‌మే డాల‌ర్ అనూహ్యంగా బ‌ల‌ప‌డ‌డానికి కార‌ణ‌మ‌ని నిపుణులంటున్నారు. ఈ కార‌ణంగానే అమెరిక‌న్ కేంద్ర బ్యాంక్ ద్ర‌వ్య విధానం  స‌ర‌ళం చేసింది. దీనికి తోడు న‌వంబ‌ర్‌లో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ విజయం సాధించ‌డం కూడా డాల‌ర్ బ‌లోపేతం కావ‌డానికి దోహ‌ద‌ప‌డింది. ప్ర‌ధానంగా చైనా దిగుమ‌తుల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి టారిఫ్‌లు పెంచుతామ‌న్న ఆయ‌న ప్ర‌క‌ట‌న డాల‌ర్‌కు ఎన‌లేని బ‌లాన్ని అందించింది. దీని ప్ర‌భావం భార‌త ఈక్విటీ మార్కెట్‌పై తీవ్రంగా ప‌డింది. విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు అమెరికాలో పెట్టుబ‌డుల కోసం డాల‌ర్ల‌ను ఉప‌సంహ‌రించ‌డం ప్రారంభించారు. ఒక ప‌క్క అమెరిక‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకోవ‌డంతో పాటు స‌మాంత‌రంగా యూర‌ప్‌లో బ‌ల‌హీన‌త‌లు, భౌగోళిక రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో2024 సంవ‌త్స‌రంలో డాల‌ర్ 6.9 శాతం బ‌ల‌ప‌డింది. ప్ర‌త్యేకించి ప‌శ్చిమాసియా సంక్షోభం, ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం డాల‌ర్‌ను సుర‌క్షిత‌మైన స్థాయిలో నిలిపాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎఫ్‌పిఐలు భార‌త మార్కెట్ నుంచి అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ నెల‌ల మ‌ధ్య కాలంలో రూ.1.70 ల‌క్ష‌ల కోట్ల నిధులు త‌ర‌లించుకుపోయారు. ఇది రూపాయి విలువ‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. 
2025 ప‌రిధి 83-87
డాల‌ర్ మార‌కంలో రూపాయి విలువ 2025 సంవ‌త్స‌రంలో గ‌రిష్ఠ స్థాయిలో 87, క‌నిష్ఠ స్థాయిలో 83 మ‌ధ్య‌న క‌ద‌లాడ‌వ‌చ్చున‌ని అంటున్నారు. త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న 2025-26 కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే విత్త విధానం;  ద్ర‌వ్యోల్బ‌ణం-వృద్ధికి మ‌ధ్య స‌మ‌తూకం తేవ‌డంపై ఆర్‌బిఐ వైఖ‌రి వంటి చ‌ర్య‌లు రూపాయికి మ‌ద్ద‌తు ఇవ్వ‌వ‌చ్చునంటున్నారు. ఈ ఏడాది భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 6.5 శాతం నుంచి 7.5 శాతం మ‌ధ్య వృద్ధిని న‌మోదు చేయ‌వ‌చ్చున‌ని అంచ‌నా. ఇది కూడా ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి నిల‌దొక్కుకోవ‌డానికి దారి తీయ‌వ‌చ్చున‌న్న‌ది నిపుణుల అభిప్రాయం.

Sunday, December 29, 2024

ఎగుడు దిగుడు ప‌య‌నంలోనూ లాభాల పందేర‌మే

ఈక్విటీ మార్కెట్ రివ్యూ 2024

ఈక్విటీ మార్కెట్‌కు 2024 రికార్డుల సంవ‌త్స‌రంగానే కాదు...భారీ క‌రెక్ష‌న్ల సంవ‌త్స‌రంగా కూడా నిలిచిపోనుంది. తీవ్ర‌మైన ఎగుడుదిగుడుల ప్ర‌యాణం సాగించిన‌ప్ప‌టికీ ఇన్వెస్ట‌ర్ల‌కు సానుకూల రాబ‌డులే అందించ‌డం ఈ సంవ‌త్స‌రం విశేషం. ఆటుపోట్ల‌ను త‌ట్టుకుంటూ నిలిచిన స్థూల ఆర్థిక రంగం, దేశీయ నిధుల రాక ఇందుకు అండ‌గా నిలిచాయి. ఈ ఏడాది సెప్టెంబ‌రు 27వ తేదీన‌ నిఫ్టీ చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి 26,277.25 పాయింట్ల‌ను, సెన్సెక్స్ 85,978.35 పాయింట్ల‌ను న‌మోదు చేశాయి. అయితే చివ‌రి రెండు నెల‌లూ మార్కెట్లు భారీ క‌రెక్ష‌న్ సాధించి ప్ర‌స్తుతం నిఫ్టీ 23,813 వ‌ద్ద‌, సెన్సెక్స్ వ‌ద్ద ట్రేడ‌వుతున్నాయి. ఆ చారిత్ర‌క రికార్డు స్థాయిల నుంచి సెన్సెక్స్ 8.46 శాతం, నిఫ్టీ 9.37 శాతం న‌ష్ట‌పోయాయి. 2020 సంవ‌త్స‌రంలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏర్ప‌డిన క‌రెక్ష‌న్ త‌ర్వాత చోటు చేసుకున్న మూడో భారీ క‌రెక్ష‌న్ ఇది. అయితే ఏడాది మొత్తం మీద చూసిన‌ట్ట‌యితే డిసెంబ‌ర్ 27 నాటికి సెన్సెక్స్ 6458.81 పాయింట్లు  (8.94%), నిఫ్టీ 2082 పాయింట్లు (9.58%) లాభ‌ప‌డ్డాయి. 2023 సంవ‌త్స‌రంలో సెన్సెక్స్ న‌మోదు చేసిన 11,399.52 పాయింట్లు (18.73%), నిఫ్టీ న‌మోదు చేసిన 3626.10 పాయింట్ల (20%) లాభంతో పోల్చితే మాత్రం 2024లో సూచీల జోరు త‌గ్గింద‌నే చెప్పాలి.

వ‌రుస‌గా తొమ్మిదో ఏడాది

భార‌త ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాలు పంచ‌డం ఇది వ‌రుస‌గా తొమ్మిదో ఏడాది. చివ‌రి త్రైమాసికంలో తీవ్ర‌మైన స‌వాళ్లు ఎదురైనా ఈక్విటీ మార్కెట్ మాత్రం అద్భుత‌మైన లాభాల‌నే అందించింది. ప్ర‌ధానంగా మిడ్‌క్యాప్‌లు, స్మాల్‌క్యాప్‌లు ఇత‌ర సూచీల క‌న్నా మెరుగైన ప‌నితీరు ప్ర‌ద‌ర్శించి ఇన్వెస్ట‌ర్ల‌కు మంచి లాభాలు అందించాయ‌ని విశ్లేష‌కులంటున్నారు. ఇదే స‌మ‌యంలో సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం ప్ర‌పంచంలోని ఇత‌ర పోటీ ఇండెక్స్‌ల‌తో పోల్చితే వెనుకంజ‌లో ఉన్నాయి. విదేశీ సంస్థ‌లు పెద్ద ఎత్తున నిధులు త‌రలించుకుపోవ‌డం ఇందుకు కార‌ణ‌మ‌నా స్వ‌స్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. 

అన్నీ స‌వాళ్లే...

దేశంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నుంచి ఏడాది చివ‌రిలో జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల వ‌ర‌కు ఈక్విటీ మార్కెట్ ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొంది. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ది ఒక ఎత్తైతే ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం, ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రో ఎత్తు. అన్నింటినీ మించి చివ‌రి త్రైమాసికంలో నిరాశావ‌హ‌మైన కార్పొరేట్ ఫ‌లితాలు, ఆశించిన స్థాయి క‌న్నా మంద‌గించిన ఆర్థిక వృద్ధిరేటు ఇన్వెస్ట‌ర్ల విశ్వాసాన్ని దెబ్బ తీశాయి. అమెరికాలో వ‌డ్డీరేట్ల త‌గ్గింపు అగ్నికి ఆజ్యం జోడైన‌ట్ట‌యింది. దీంతో విదేశీ ఇన్వెస్ట‌ర్లు నిధుల ఉప‌సంహ‌ర‌ణ ప్రారంభించ‌డంతో అక్టోబ‌ర్ నుంచి మార్కెట్ బేర్ గుప్పిట్లోకి వెళ్లింది. ఒక్క అక్టోబ‌ర్‌లోనే సెన్సెక్స్ 4910.72 పాయింట్లు, నిఫ్టీ 1605.50 పాయింట్లు న‌ష్టపోయాయి. ఈ నెల‌లో విదేశీ సంస్థ‌లు రికార్డు స్థాయిలో రూ.94,017 కోట్ల విలువైన నిధులు ఉప‌సంహ‌రించారు. ఇంత‌వ‌ర‌కు ఒక నెల‌లో ఎఫ్ఐఐలు ఉప‌సంహ‌రించిన అత్య‌ధిక నిధుల రికార్డు ఇదేనంటున్నారు. 

ద్ర‌వ్యోల్బ‌ణం-వ‌డ్డీరేట్లు

మ‌రోప‌క్క దేశంలో గ‌రిష్ఠ స్థాయిల్లో క‌ద‌లాడుతున్న ద్ర‌వ్యోల్బ‌ణానికి క‌ళ్లెం వేసే ప్ర‌య‌త్నంలో ఆర్‌బిఐ వ‌డ్డీరేట్ల త‌గ్గింపున‌కు స‌సేమిరా అంటోంది. వృద్ధిరేటును ఉత్తేజితం చేయ‌డానికి కీల‌క రెపోరేటును త‌గ్గించాల‌ని అటు ప్ర‌భుత్వం నుంచి ఇటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న ఒత్తిడుల‌కు ఏ మాత్రం లొంగ‌కుండా ఆర్‌బిఐ కీల‌క రెపోరేటును డిసెంబ‌ర్ స‌మీక్ష‌లో కూడా య‌థాత‌థంగానే కొన‌సాగించింది. దీంతో ప్ర‌స్తుతం దేశంలో రెపోరేటు 6.5 శాతం వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉంది. ఆర్‌బిఐ వ‌డ్డీరేట్ల‌లో య‌థాత‌థ స్థితిని కొన‌సాగించ‌డం వ‌రుస‌గా ఇది 11వ సారి. 

మార్కెట్ విలువ‌లు జూమ్‌

ప్ర‌స్తుతం భార‌త మార్కెట్ ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన మార్కెట్‌గా ఉండ‌డం కూడా క‌రెక్ష‌న్‌కు కార‌ణ‌మ‌యింది. మార్కెట్లో అధిక లిక్విడిటీ (న‌గ‌దు ల‌భ్య‌త‌) మార్కెట్ ఫండ‌మెంట‌ల్స్‌ను మించి విలువ‌లు పెరిగిపోవ‌డానికి కార‌ణ‌మ‌యింది. విలువ‌లు ఎప్పుడైతే ప‌తాక స్థాయికి చేర‌తాయో అప్పుడు మార్కెట్లో ఆరోగ్య‌క‌ర‌మైన క‌రెక్ష‌న్ ఏర్ప‌డ‌క త‌ప్ప‌ద‌ని అంటారు. ఇటీవ‌ల ఏర్ప‌డిన క‌రెక్ష‌న్‌తో విలువ‌ల ప‌రిస్థితి మెరుగుప‌డి భార‌త ఈక్విటీ మార్కెట్ బ‌లం పెరిగింద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. 



ఈ వారంలో 24200 పైన బుల్లిష్

డిసెంబర్ 30-జనవరి 3 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  23813 (+225
)  
గత వారంలో నిఫ్టీ 24781 - 23939 పాయింట్ల మధ్యన కదలాడి 225 పాయింట్ల లాభంతో 23813 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 24200  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 23796, 23874, 24228, 24154 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 24200      బ్రేక్ డౌన్ స్థాయి : 23500

నిరోధ స్థాయిలు : 24025, 24125, 24225 (23925 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 23700, 23600, 23500 (23800 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
üధనుస్సులోని మూల పాదం 2 నుంచి కుంభంలోని ధనిష్ట పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  ధనుస్సులోని  మూల పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü  వృశ్చికంలోని జ్యేష్ఠ  పాదం 3-4 మధ్యలో  బుధ సంచారం
ü కుంభంలోని ధనిష్ట  పాదం 3-4  మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని  పుష్యమి పాదం 2లో వక్రగతిలో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం3లో మిథున నవాంశలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం        


--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)  
తిథి :  మార్గశిర బహుళ  అమావాస్య                                                                  
నక్షత్రం : మూల                                    
అప్రమత్తం :   రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర;  ధనుస్సు, మేష  రాశి జాతకులు     
ట్రెండ్ మార్పు సమయం : 11.42
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.07 వరకు మెరుగ్గా  ట్రేడవుతూ తదుపరి 11.45 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.18  ఉండి 3 గంటల వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 1.30 గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 23900, 23975     మద్దతు : 23725, 23650
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, December 22, 2024

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

ప్రైమ‌రీ మార్కెట్ రివ్యూ 2024

ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌రించాయి. ఒక ఏడాదిలో నిధుల స‌మీక‌ర‌ణ‌లో ఇది ఒక కొత్త రికార్డు. ఇష్యూలు జారీ చేసే కంపెనీల్లో విశ్వాసం ఇనుమ‌డించ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డింది. హుండాయ్‌ మోటార్స్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఇష్యూ జారీ చేయ‌డం ద్వారా రూ.27,870 కోట్లు స‌మీక‌రించింది. విభోర్ స్టీల్ ట్యూబ్స్ రూ.72 కోట్ల విలువ గ‌ల అతి చిన్న ఇష్యూ జారీ చేసింది. ఇష్యూలు జారీ చేసిన వాటిలో భారీ, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కంపెనీలున్నాయి. స‌గ‌టు ఇష్యూ సైజు కూడా 2023లో రూ.867 కోట్లుండ‌గా 2024లో అది రూ.1700 కోట్ల క‌న్నా పైనే ఉంది. ఒక్క డిసెంబ‌ర్ నెల‌లోనే 15 కంపెనీలు ఇష్యూలు జారీ చేయ‌డం మార్కెట్లో నెల‌కొన్న అసాధార‌ణ బ‌లానికి సంకేతం. 2023 సంవ‌త్స‌రంలో 57 కంపెనీలు రూ.49,436 కోట్లు మాత్ర‌మే స‌మీక‌రించాయి. నిధుల స‌మీక‌ర‌ణ‌పై చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా కంపెనీలు (ఎస్ఎంఇ) కూడా ఎన‌లేని ఆస‌క్తి క‌న‌బ‌రిచాయి. మొత్తం 238 ఎస్ఎంఇలు రూ.8,700 కోట్లు స‌మీక‌రించాయి. 2023లో ఈ త‌ర‌హా కంపెనీలు స‌మీక‌రించిన రూ.4,686 కోట్ల క‌న్నా ఇది రెట్టింపు అధికం. ఎస్ఎంఇల్లో ఇన్వెస్ట్ చేయ‌డం రిస్క్‌తో కూడుకున్న వ్య‌వ‌హార‌మే అయినా ఇన్వెస్ట‌ర్లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. 

చందాల్లోను, రాబ‌డుల్లోనూ రికార్డులే 

ప‌బ్లిక్ ఇష్యూ స‌బ్‌స్క్రిప్ష‌న్ నిష్ప‌త్తులు కూడా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉన్నాయి. అతి చిన్న ఇష్యూతో మార్కెట్లోకి వ‌చ్చినా విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఇష్యూ రికార్డు స‌బ్‌స్ర్కిప్ష‌న్   సాధించింది.  ఈ ఇష్యూకి 320 రెట్లు అధిక స‌బ్‌స్ర్కిప్ష‌న్ వ‌చ్చింది. కెఆర్ఎన్  హీట్ ఎక్స్ఛేంజ‌ర్ అండ్ రిఫ్రెజిరేష‌న్‌, మ‌న్బా ఫైనాన్స్‌, ప్రెసిష‌న్ ఇంజ‌నీరింగ్ ఇష్యూల‌కి 200 రెట్లు అధిక స‌బ్‌స్క్రిప్ష‌న్ వ‌చ్చింది. అలాగే కొన్ని ఇష్యూలు లిస్టింగ్‌లో అద్భుత‌మైన రాబ‌డులు అందించాయి. విభోర్ స్టీల్ ట్యూబ్స్‌, బిఎల్ఎస్ ఇ-స‌ర్వీసెస్‌, బ‌జాజ్ హౌసింగ్ ఫైనాన్స్, కెఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజ‌ర్ కంపెనీలు లిస్టింగ్‌లో 100 శాతం పైగా లాభాలు అందించాయి. 

సుస్థిర‌తే చోద‌క శ‌క్తి

దేశంలో స్థిర‌మైన ఆర్థిక వాతావ‌ర‌ణం, కేంద్ర‌ప్ర‌భుత్వ స్థాయిలో విధానాల కొన‌సాగింపు, అన్ని రంగాల‌కు విస్త‌రించిన వృద్ధిరేటు ఐసిఓ కార్య‌క‌లాపాలు జోరుగా ఉండ‌డానికి కార‌ణ‌మ‌ని నిపుణులంటున్నారు. దీనికి తోడు ప్రైవేట్ ఈక్విటీ ఎగ్జిట్లు, స్పాన్స‌ర్ ఆధారిత అమ్మ‌కాలు, కార్పొరేట్ ఫండింగ్ వ్యూహాల్లో మార్పు వంటి అంశాలు సైతం ఐపీఓ మార్కెట్లో జొరుకి కార‌ణ‌మయ్యాయి.

నూత‌న సంవ‌త్స‌రం మ‌రింత జోరు
రాబోయే సంవ‌త్స‌రంలో (2025) కూడా ఐపీఓ మార్కెట్ జోరుగానే ఉంటుంద‌ని, 2024లో న‌మోదైన రికార్డుల‌ను చెరిపేస్తుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. ఐపిఓకి అనుమ‌తి కోరుతూ 75 కంపెనీలు చేసుకున్న ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న విభిన్న ద‌శ‌ల్లో ఉంది. దాన్ని బ‌ట్టి 2025లో వివిధ కంపెనీలు ఐపిఓల ద్వారా సేక‌రించే నిధుల ప‌రిమాణం రూ.2.5 కోట్లు దాట‌వ‌చ్చున‌ని అంటున్నారు.  వ‌చ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ప్ర‌ముఖ కంపెనీల్లో హెచ్‌డిబి ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్‌జి ఎల‌క్ర్టానిక్స్ ఇండియా (రూ.15,000 కోట్లు), హెక్సావేర్ టెక్నాల‌జీస్ (రూ.9,950 కోట్లు) ఉన్నాయి.


ఈ వారంలో 23900 పైన బుల్లిష్

డిసెంబర్ 23-27 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   
నిఫ్టీ   :  23588 (-1182
)    
గత వారంలో నిఫ్టీ 24781 - 23808 పాయింట్ల మధ్యన కదలాడి 1182 పాయింట్ల నష్టంతో 24588 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 23900  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 
- 20, 50, 100, 200 డిఎంఏలు 23980, 24316, 24441, 24176 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 23900      బ్రేక్ డౌన్ స్థాయి : 23300
నిరోధ స్థాయిలు : 23800, 23900, 24000 (23700 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 23475, 23375, 23275 (23575 దిగువన బేరిష్)
ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
üకన్యలోని హస్త  పాదం 1 నుంచి వృశ్చికంలోని విశాఖ పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  ధనుస్సులోని  మూల పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü  వృశ్చికంలోని అనురాధ  పాదం 2-4 మధ్యలో  బుధ సంచారం
ü కర్కాటకంలోని ధనిష్ట  పాదం 1-2  మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని  పుష్యమి పాదం 2-3 మధ్యలో వక్రగతిలో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం3- 4 మధ్యలో కర్కాటక నవాంశలో వక్రగతిలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4-పూర్వాభాద్ర పాదం 1 మధ్యలో మీన నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం        

--------------------------------- 


ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి) 
తిథి :  మార్గశిర బహుళ  అష్టమి                                                                   
నక్షత్రం : హస్త          
అప్రమత్తం : పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర  నక్షత్ర;  కన్య, మకర  రాశి జాతకులు     
ట్రెండ్ మార్పు సమయం : 1.21
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 10.34 వరకు మెరుగ్గా  ట్రేడవుతూ తదుపరి 12.11 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.46 వరకు నిస్తేజంగా ఉండి  ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 1.55 గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని చివరిలో క్లోజ్ చేసుకోవచ్చు.   
టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 23680, 23775     మద్దతు : 23490, 23400
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Saturday, December 14, 2024

ఈ వారంలో 25000 పైన బుల్లిష్

డిసెంబర్ 16-20 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  24769 (+91) 
   
గత వారంలో నిఫ్టీ 24792 - 24180 పాయింట్ల మధ్యన కదలాడి 91 పాయింట్ల లాభంతో 24769 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 25000  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 24588, 24607, 24424, 24169 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 25000      బ్రేక్ డౌన్ స్థాయి : 24500

నిరోధ స్థాయిలు : 24970, 25070, 25170 (24870 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 24570, 24470, 24370 (24670 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
üమిథునంలోని  ఆర్ద్ర  పాదం 2 నుంచి కర్కాటకంలోని మఖ పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  ధనుస్సులోని  మూల పాదం 1-2 మధ్యలో రవి సంచారం 
ü  వృశ్చికంలోని అనురాధ  పాదం 3-4 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం
ü కర్కాటకంలోని శ్రవణం పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం
ü వృశ్చికంలోని పుష్యమి పాదం 3లో వక్రగతిలో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం 4లో కర్కాటక నవాంశలో వక్రగతిలో  బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4లో మీన నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ప్రారంభ సెషన్ బుల్లిష్ (సోమవారానికి)  

తిథి :  మార్గశిర బహుళ  పాడ్యమి                                                                 

నక్షత్రం : ఆర్ద్ర            
                         
అప్రమత్తం :    ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి  నక్షత్ర;   మిథున, తుల రాశి జాతకులు    

ట్రెండ్ మార్పు సమయం : 11.41

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.02 వరకు మెరుగ్గా  ట్రేడవుతూ తదుపరి 12.39 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. తదుపరి చివరి వరకు  నిస్తేజంగా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 9.45 గంట సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయంలో  క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 24860, 24950     మద్దతు : 24650, 24550
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...