భారతవిదేశీ రుణభారం 2023 సంవత్సరంలో 64,679 కోట్ల డాలర్ల (రూ.54.91 లక్షల కోట్లు) స్థాయిలో ఉంది. ఒక్క 2023 సంవత్సరంలోనే రుణభారం 3100 కోట్ల డాలర్ల (రూ.2.63 లక్షల కోట్లు) మేరకు పెరిగింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన అంతర్జాతీయ రుణ నివేదికలో ఈ వివరాలున్నాయి. రుణాలపై చెల్లించే వడ్డీ కూడా 2022 నాటి 1508 కోట్ల డాలర్ల నుంచి 2254 కోట్ల డాలర్లకు పెరిగింది.
నివేదిక ముఖ్యాంశాలు...
- దీర్ఘకాలిక రుణాలు 7 శాతం పెరిగి 49,800 కోట్ల డాలర్లకు చేరగా స్వల్పకాలిక రుణాల పరిమాణం మాత్రం 1263.2 కోట్ల డాలర్లకు తగ్గింది.
- ఎగుమతుల్లో శాతం పరంగా విదేశీ రుణం 80 శాతానికి చేరింది. రుణాల సర్వీసింగ్ ఎగుమతుల పరిమాణంలో 10 శాతం ఉంది.
- 2023 సంవత్సరం నాటికి నికర రుణ ప్రవాహం 3342 కోట్ల డాలర్లు కాగా నికరంగా ఈక్విటీ నిధుల రాక 4694 కోట్ల డాలర్లుంది.
No comments:
Post a Comment