Monday, April 21, 2025

5 రోజులు-రూ.32 ల‌క్ష‌ల కోట్లు


మ‌న స్టాక్ మార్కెట్ క‌నివిని ఎరుగ‌ని ర్యాలీలో దూసుకుపోతోంది. మొత్తం మీద బుల్స్ మార్కెట్‌పై ప‌ట్టు సాధించాయి. ఈ నెల 2వ తేదీన ట్రంప్ విధించిన సుంకాల ప్ర‌భావంతో చారిత్ర‌క న‌ష్టాల‌ను చ‌వి చూసిన మార్కెట్ త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో బ‌ల‌మైన ర్యాలీలో ప్ర‌వేశించింది. అందులోనూ గ‌త ఐదు ట్రేడింగ్ సెష‌న్లుగా క‌నివిని ఎరుగ‌ని ర్యాలీ సాధించింది. ఫ‌లితంగా ఐదు ట్రేడింగ్ సెష‌న్ల‌లో సెన్సెక్స్ 5561.35 పాయింట్లు, నిఫ్టీ 1726.40 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. ఈ ర్యాలీ కార‌ణంగా ఐదు సెష‌న్ల‌లో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.32,03,295.80 కోట్లు పెరిగి రూ.4,25,85,629.02 కోట్ల‌కు (5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) చేరింది. ఇక వ‌రుస‌గా ఐదో రోజు కూడా లాభ‌ప‌డిన సెన్సెక్స్ సోమ‌వారం 855.30 పాయింట్లు లాభ‌ప‌డి 79,408.50 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1081.85 పాయింట్ల లాభంతో 79,635.05 వ‌ర‌కు కూడా వెళ్లింది. ఇక నిఫ్టీ 273.90 పాయింట్ల లాభంతో 24,125.55 వ‌ద్ద క్లోజ‌యింది. బిఎస్ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ సూచీలు స‌హా రంగాల‌వారీ సూచీల‌న్నీ లాభాల్లోనే  ముగిశాయి. అమెరిక‌న్ మార్కెట్ పైన‌, ట్రంప్ వాణిజ్య విధానాల పైన న‌మ్మ‌కం కోల్పోయిన విదేశీ ఇన్వెస్ట‌ర్లు మెరుగైన లాభాల కోసం భార‌త మార్కెట్ వైపు మ‌ళ్లీ దృష్టి సారించ‌డం ఈ ర్యాలీకి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులంటున్నారు. 

No comments:

Post a Comment

ఈ వారంలో 25250 పైన బుల్లిష్

జూలై 28 - ఆగస్టు 01 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  24837 (-131 )       గత వారంలో నిఫ్టీ 25248 - 24806 పాయింట్ల మ...