1089 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
భారీ నష్టాల నుంచి ఉపశమనం
ఈక్విటీ మార్కెట్ సోమవారం నాటి భారీ నష్టం నుంచి మంగళవారం కొంత ఉపశమనం పొందింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన నాణ్యమైన షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు రికవరీ సాధించాయి. ఆసియా, యూరప్ః మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు భారత్ మార్కెట్‌కు ఉత్తేజం కల్పించాయి. విలువ ఆధారిత కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 1721 పాయింట్ల మేరకు దూసుకుపోయి 74859.39 పాయింట్లను నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 1089.18 పాయింట్లు లాభంతో 74227.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 374.25 పాయింట్లు లాభపడి 22535.85 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 535.6 పాయింట్లు లాభపడి 22697.20 పాయింట్ల డే గరిష్ఠ స్థాయిని తాకింది.
- ఈ సానుకూల వాతావరణం కారణంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.7,32,042.69 కోట్లు పెరిగి రూ.3,96,57,703.44 కోట్ల వద్ద ముగిసింది. స్టాక్ ఎక్స్ఛేంజిల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం సోమవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.9,040.01 కోట్ల విలువ గల ఈక్విటీలను విక్రయించగా దేశీయ సంస్థలు రూ.12,122.45 కోట్ల విలువ గల ఈక్విటీలు కొనుగోలు చేశాయి.
- ఒక్క పవర్‌గ్రిడ్ మినహా సెన్సెక్స్‌లో లిస్టయిన కంపెనీలు లాభాల్లో ముగిశాయి.
No comments:
Post a Comment