క్రూడాయిల్, ఫారెక్స్, ఈక్విటీ అన్ని మార్కెట్లూ దిగువకే...
కోవిడ్-19 ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, ఫారెక్స్, ఈక్విటీ మార్కెట్లు కల్లోలితం అయ్యాయి. ఫ్యాక్టరీలు మూతపడడంతో పాటు కార్లు, విమానాలు తిరగడం కూడా నిలిచిపోయినందు వల్ల కనివిని ఎరుగని స్థాయిలో ఆయిల్ డిమాండు పడిపోయిన ప్రభావం మంగళవారం ఫారెక్స్, ఈక్విటీ మార్కెట్లపై కూడా పడింది. అమ్మకాల ఒత్తిడి పెరిగిపోవడం ఈ మార్కెట్లను భారీ క్షీణత దిశగా నడిపించింది.
ఇక ఆయిల్ మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే ఒకపక్క ధరలు పడిపోవడం, మరోపక్క కొనేవారు లేక ఆయిల్ ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు భారీ స్థాయిలో పేరుకుపోయి ఇంక నిల్వ ఉంచలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా సోమవారం రాత్రి అమెరికాలో వెస్ట్ టెక్సాస్ మే కాంట్రాక్టుల క్రూడాయిల్ డెలివరీ ధర 120 శాతం క్షీణించి జీరో కన్నా దిగువ పడిపోయింది. బ్యారెల్ ధర మైనస్ 3.70 డాలర్లు పలికింది. గల్ఫ్ సంక్షోభం సమయంలో కూడా ఇంత దిగజాలేదంటున్నారు. ఇక మంగళవారం స్పాట్ మార్కెట్ లో బెంచ్‌మార్క్ ఆయిల్ కాంట్రాక్టుల ధర బ్యారెల్ ఒక దశలో బ్యారెల్ 11.79 డాలర్లు పలికి చివరికి 15.65 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ప్రమాణాలు గల బ్రెంట్ క్రూడాయిల్ ధర కూడా 19.85 డాలర్లు పలికింది.
ఈక్విటీ ఇండెక్స్ ల భారీ పతనం
ఇంధన మార్కెట్ కల్లోలం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లపై కూడా పడింది. ఈక్విటీ పెట్టుబడులు కొనసాగించే విషయంలో ఇన్వెస్టర్ల విముఖత కారణంగా భారీ ఎత్తున అమ్మకాలు సాగడంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, హాకాంగ్, దక్షిణ కొరియా, ఆస్ర్టేలియా, షాంఘై సూచీలన్నీ భారీ నష్టాలు నమోదు చేశాయి. తుది వార్తలందే సమయానికి అమెరికాలోని వాల్ స్ర్టీట్ కూడా భారీ నష్టాల బాటలోనే ఉంది.
ఇంధన మార్కెట్ కల్లోలం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లపై కూడా పడింది. ఈక్విటీ పెట్టుబడులు కొనసాగించే విషయంలో ఇన్వెస్టర్ల విముఖత కారణంగా భారీ ఎత్తున అమ్మకాలు సాగడంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, హాకాంగ్, దక్షిణ కొరియా, ఆస్ర్టేలియా, షాంఘై సూచీలన్నీ భారీ నష్టాలు నమోదు చేశాయి. తుది వార్తలందే సమయానికి అమెరికాలోని వాల్ స్ర్టీట్ కూడా భారీ నష్టాల బాటలోనే ఉంది.
విదేశీ మార్కెట్ల ప్రభావంతో భారత మార్కెట్ లో కూడా అమ్మకాలు భారీగా సాగాయి. సెన్సెక్స్ 1011.29 పాయింట్లు దిగజారి 30636.71 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 280.40 పాయింట్లు పతనమై 8981.50 వద్ద క్లోజయింది. సెన్సెక్స్ లోని 30 షేర్లలో 27 షేర్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 12% నష్టపోగా బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మహీంద్రా, ఒఎన్ జిసి, మారుతి షేర్లు కూడా 6 నుంచి 9 శాతం నడుమ నష్టపోయాయి.
రూ.3.30 లక్షల కోట్లు ఆవిరి
ఇండెక్స్ ల భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద (స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ) రూ.3,30,408.87 కోట్ల మేరకు నష్టపోయి రూ.1,20,42,172.38 కోట్లకు దిగజారింది.
- ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకం ప్రభావం ఫారెక్స్ మార్కెట్ పై కూడా పడింది. అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 30 పైసలు దిగజారి 76.83 వద్ద ముగిసింది.
No comments:
Post a Comment