ప్రారంభ సెషన్ మెరుగు
తిథి : చైత్ర బహుళ చతుర్దశి
నక్షత్రం : పూర్వాభాద్ర/ఉత్తరాభాద్ర
అప్రమత్తం : భరణి, పుబ్బ, పూర్వాషాఢ/కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ
నక్షత్ర జాతకులు, మేష, సింహ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9261.85 (-4.90)
ట్రెండ్ మారే వేళ : 10.21
ధోరణి : నిఫ్టీ ఫ్యూచర్స్10.20 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి 12.15 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.45 వరకు నిలకడగాను, తదుపరి చివరి వరకు మెరుగ్గానూ ట్రేడయ్యే ఆస్కారంగా ఉంది.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.05 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. తదుపరి 2.45 తర్వాత ఎటిపి పైకి వస్తే మరిన్ని లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
నిరోధ స్థాయిలు : 9350, 9425, 9500
మద్దతు స్థాయిలు : 9200, 9125, 9050
గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన మాత్రమే. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.
------------------------------ ------------------------
సూచన...
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి లేదా ఇతర మద్దతు స్థాయిల వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కాని సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచనను టెక్నికల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ర్టో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభనష్టాలు ఆధారపడి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవలం ఏమి జరవచ్చుననేది సూచనగా చెబుతాడు. పై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి...
- భువనగిరి అమరనాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నికల్ అనలిస్ట్
No comments:
Post a Comment