శుక్రవారంతో ముగిసిన సంవత్ 2076కి మార్కెట్లు శుభవీడ్కోలు పలికాయి. గత ఏడాది సంవత్ నుంచి ఈ రోజు వరకు స్టాక్ ఇండెక్స్ లు అద్భుతమైన లాభాలు సాధించాయి. గత ఎనిమిది నెలలుగా కరోనా తీవ్ర కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ మార్కెట్ జోరు మాత్రం తగ్గలేదు. అందులోనూ స్టాక్ సూచీలు గత జనవరిలో సాధించిన గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా దిగజారినా ఆ నష్టాలన్నీ పూడ్చుకోవడమే కాకుండా ఏడాది ముగిసే సమయానికి మంచి లాభాలు అందించడం ఆశావహం. గత సంవత్ నుంచి ఈ రో్జు వరకు సెన్సెక్స్ 11.22 శాతం అంటే 4384.94 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 9.80 పాయింట్లు అంటే 1136 పాయింట్లు లాభపడింది. శుక్రవారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 85.81 పాయింట్లు లాభపడి 43,443 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 29.15 పాయింట్లు లాభపడి 12719.95 వద్ద ముగిసింది. ఇవే ఈ సంవత్ ముగింపు స్థాయిలు.
- నవంబర్ 11వ తేదీన సెన్సెక్స్ నమోదు చేసిన జీవితకాల గరిష్ఠ స్థాయి 43,593.67 పాయింట్లు, అదే రోజు నమోదైన ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 43,708.47 పాయింట్లు.
- నిఫ్టీ జీవిత కాల గరిష్ఠ స్థాయి 12,749.15 పాయింట్లు. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 12,769.75 పాయింట్లు.
రేపు సాయంత్రం మూరత్ ట్రేడింగ్
హిందూ కాలెండర్ సంవత్సరం సంవత్ శుభారంభాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం స్టాక్ మార్కెట్లో ఒక గంట మూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నారు. దీంతో సంవత్ 2077కి మార్కెట్లు శ్రీకారం చుడతాయి.
No comments:
Post a Comment