కొత్త సంవత్సరానికి శుభ స్వాగతం
భారత స్టాక్ మార్కెట్ కొత్త హిందూ సంవత్సరం మొదటి సెషన్ లో సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ స్టాక్ లు ర్యాలీకి ఉత్తేజం ఇచ్చాయి. కోవిడ్-19కి వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయని అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా ప్రకటించడం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ను బలపరిచింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడడం కూడా మార్కెట్ కు ఉత్తేజం ఇచ్చింది. రోజులో సెన్సెక్స్ 44161.16 పాయింట్ల జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకి చివరికి 314.73 పాయింట్ల లాభంతో 43952.71 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 43952.71 పాయింట్ల జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకి 93.95 పాయింట్ల లాభంతో 12874.20 వద్ద క్లోజయింది.
- 6.24 శాతం లాభంతో టాటా స్టీల్ లాభపడిన షేర్లలో అగ్రస్థానంలో నిలవగా ఎస్ బిఐ, హెచ్ డిఎఫ్ సి ద్వయం, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టి, మారుతి, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. ఎన్ టిపిసి, హెచ్ సిఎల్ టెక్, ఒఎన్ జిసి, ఇన్ఫోసిస్ ఐటిసి, పవర్ గ్రిడ్, హెచ్ యుఎల్ నష్టాల్లో ముగిశాయి.
- రంగాలవారీగా బిఎస్ఇ ఇండస్ర్టియల్స్ ఇండెక్స్ 2.27 శాతం లాభపడింది. మెటల్, కాపిటల్ గూడ్స్, ఫైనాన్స్, బ్యాంకెక్స్, రియల్టీ సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. ఇందుకు భిన్నంగా ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్, టెక్నాలజీ, ఐటి, ఎనర్జీ, ఎఫ్ఎంసిజి నష్టాల్లో ముగిశాయి.
-----------------------------------
ఇంట్రాడే గరిష్ఠ స్థాయిలు
సెన్సెక్స్ - 44161.16
నిఫ్టీ - 12934.05
ముగింపు గరిష్ఠ స్థాయిలు
సెన్సెక్స్ - 43952.71
నిఫ్టీ - 12874.20
-------------------------------------
ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లు శుభారంభాన్నిచ్చాయి. దీనికి తోడు కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు మరో వ్యాక్సిన్ విజయవంతంగా పురోగమిస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. అయినప్పటికీ కరోనా భయాలు ఇంకా సమసిపోలేదు. ఈ పరిస్థితిలో ఇన్వెస్టర్లు స్వల్పకాలానికి లాభాలు స్వీకరించడమే మంచిది.
- వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్
No comments:
Post a Comment