Sunday, November 15, 2020

సంవత్ 2077 ఎలా ఉంటుంది... ?

 శనివారం దీపావళి పర్వ దినాన సంవత్ 2077 ప్రారంభం అయింది.  హిందూ క్యాలెండర్  ప్రకారం విశిష్టమైనదిగా భావించే సంవత్ ప్రారంభం రోజున ప్రతి ఏడాది సాయంత్రం ఒక గంట సేపు సాంప్రదాయకంగా మూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ఏడాది సంవత్ మార్కెట్ కు శుభారంభాన్నే అందించింది. అయితే కొత్త  సంవత్  ఎలా ఉండబోతోంది అనే అంశం గ్రహగతులు, టెక్నికల్స్ ఆధారంగా పరిశీలిద్దాం. 


సూర్య చంద్రులు ధనుర్లగ్నంలో 11 వ ఇంటిలో ఉండగా సంవత్ ప్రారంభం అయింది. బుధుడు, చంద్రుడు 11 వ ఇంట తులా రాశి సమాచారంలో ఉన్నారు. శుక్రుడు 11 వ ఇంట కన్యలోను, బుధుడు ధనుస్సులో ఉచ్ఛ దశలోను, కుజుడు 4 వ ఇంట మీన రాశిలోను, రాహువు 6వ ఇంట తులా సంచారంలోను ఉన్నారు. 

ఈ గ్రహగతులను బట్టి ఈ దిగువన సూచించిన తేదీల్లో ఆటుపోట్ల తో ట్రేడింగ్ సాగవచ్చు.

నవంబర్ 30;  2021 మార్చి 16; ఏప్రిల్ 6; జూన్ 4, 22; జులై 21; ఆగస్ట్  8; అక్టోబర్ 3

కీలక తేదీలు 

2021 మార్చి 11; ఏప్రిల్ 14, 21, 25; జులై 7, 22, 29; ఆగస్ట్ 2; అక్టోబర్ 1, 12; నవంబర్ 10, 19

నిరోధ స్థాయిలు :  13000, 13500, 14250, 15000, 16000

మద్దతు స్థాయిలు :  12500, 12000, 11250, 10250, 9250

కోవిడ్ వాక్సిన్ కు సంబంధించిన పరిణామాలతో పాటుఅంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడులు, ప్రభుత్వ విధానాలు-సంస్కరణలు, ఆర్ బిఐ ద్రవ్య విధానం, వ్యాపార వాతావరణం, కరెన్సీ ఆటుపోట్లు వంటివన్నీ ఇటు మార్కెట్ కదలికల పైన, అటు ఆర్ధిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...