Wednesday, March 18, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

ప్రారంభ  సెషన్  మెరుగు 
తిథి :  ఫాల్గుణ బహుళ ఏకాదశి  
న‌క్ష‌త్రం : ఉత్తరాషాఢ/శ్రవణం    
అప్ర‌మ‌త్తం :  ఆర్ద్ర, స్వాతి, శతభిషం/పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, కుంభ, మిథున రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8468.25 (-498.25) 
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 2.48
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 1.25 వ‌ర‌కు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత  2.30 వరకు నిలకడనూ, తదుపరి చివరి వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  10 గంటల  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా ఫైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిష‌న్లు తీసుకుని 1.15 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత ఎటిపి క‌న్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోల్ చేసుకోవచ్చు  
నిరోధ స్థాయిలు :  8525, 8600, 8650
మ‌ద్ద‌తు స్థాయిలు : 8400, 8325, 8250
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

క‌రోనా క‌ల్లోల క‌డ‌లి

2 వారాలు-4 సెష‌న్ల‌లో క‌నివిని ఎరుగ‌ని ప‌త‌నాలు
చారిత్ర‌క క‌నిష్ఠ స్థాయిల‌కు ఇండెక్స్ లు

క‌రోనా ప్ర‌భావానికి స్టాక్ మార్కెట్ల‌లో క‌ల్లోలం య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతూనే ఉంది. ఏ క్ష‌ణాన ఏమౌతుందో అన్న భ‌యాల‌తో స‌గ‌టు ఇన్వెస్ట‌ర్టు తెగ‌బ‌డి అమ్మ‌కాలు సాగిస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ కుప్ప‌కూలుతున్నాయి. భార‌త్ లో దీర్ఘ‌కాలం పాటు ఎదుర‌నేదే లేద‌న్న‌ట్టు క‌దం తొక్కిన బుల్స్ క‌రో్నా దాడికి కుదేలైపోయాయి. కోలుకోలేని విధంగా బ‌క్క‌చిక్కిపోయి స‌రైన ఆస‌రా కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నాయి. భార‌త స్టాక్ మార్కెట్ ఈ వారంలో వ‌రుస‌గా రెండో రోజు భారీ న‌ష్టాల‌ను న‌మోదు చేసింది. మంగ‌ళ‌వారం ప్రారంభంలో మార్కెట్ల‌లో రిక‌వ‌రీ ఏర్ప‌డిన‌ట్టు సంకేతాలు క‌నిపించినా మ‌ధ్యాహ్నానికి అవి ఆవిరైపోయాయి. చివ‌రిలో భారీగా సాగిన అమ్మ‌కాల జోరుతో సెన్సెక్స్ వ‌రుస‌గా రెండో రోజున కూడా 811 పాయింట్ల మేర‌కు న‌ష్ట‌పోయింది. సెన్సెక్స్ 30579.09 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 230.35 పాయింట్ల న‌ష్టంతో మాన‌సిక అవ‌ధి 9000 క‌న్నా దిగువ‌న 8967.05 వ‌ద్ద ముగిసింది. దీంతో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ఏర్ప‌డిన న‌ష్టాల‌తో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.9.74 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు (సోమ‌వారం రూ.7.62 ల‌క్ష‌ల కోట్లు)  క్షీణించి
 రూ.1,19,52,066.11 కోట్ల‌కు చేరింది.

ఇన్వెస్ట‌ర్ల సంప‌ద న‌ష్టం రూ.25 ల‌క్ష‌ల కో్ట్లు
గ‌త సోమ‌, గురు వారాలు (2020 మార్చి 9, 12 తేదీలు), ఈ వారంలో సోమ‌, మంగ‌ళ‌వారాలు (తేదీలు 16, 17) క‌లిపి నాలుగు రోజుల్లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద భారీ స్థాయిలో రూ.25 ల‌క్ష‌ల కోట్లు ప‌త‌న‌మై రూ.1,19,52,066.11 కోట్ల‌కు ప‌డిపోయింది. నాలుగు సెష‌న్ల‌లో సెన్సెక్స్ న‌ష్టం 8385 పాయింట్లు కాగా నిఫ్టీ న‌ష్టం  2395 పాయింట్లు. 

ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
                   సెన్సెక్స్     నిఫ్టీ        సంప‌ద న‌ష్టం

మార్చి   9     1942        538        రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు      
మార్చి 12     2919        868        రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16     2713        758        రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17       811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు

ప్ర‌పంచ మార్కెట్ల‌లోనూ అదే తీరు..
ఆసియా అంత‌టా స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా భారీ న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. షాంఘై, సియోల్ మార్కెట్లు న‌ష్టాల్లో ముగియ‌గా హాంకాంగ్‌, టోక్యో మార్కెట్లు మాత్రం స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. యూర‌ప్ మార్కెట్లు 3 శాతం న‌ష్టాల‌తో న‌డిచాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర బ్యారెల్ కు 29.73 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది.

క‌రోనా ఎఫెక్ట్...
భార‌త్ లో మూడో క‌రోనా మ‌ర‌ణం : క‌రోనా బారిన ప‌డిన వారిలో భార‌త్ లో మ‌రొక‌రు మ‌ర‌ణించ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య మూడుకి పెరిగింది. అలాగే క‌రోనా వ్యాధి సోకిన‌ట్టుగా అనుమానిస్తున్న లేదా నిర్ధార‌ణ అయిన కేసుల సంఖ్య కూడా 125కి చేరుకుంది. మ‌రోప‌క్క  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 ఏడు వేల మందిని బ‌లి తీసుకోగా బాధితుల సంఖ్య 1.75 ల‌క్ష‌ల‌కు చేరింది.
ప్లాట్ ఫారం టికెట్‌ ధ‌ర భారీగా పెంపు :  దేశ‌వ్యాప్తంగా ప్ర‌యాణికుల ర‌ద్దీ అధికంగా ఉండే250 ప్ర‌ధాన రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాట్ ఫారం టికెట్ ధ‌ర రూ.10 నుంచి రూ.50కి పెంచారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా భారీ స‌మూహాలు గుమిగూడ‌డాన్ని నివారించేందుకు ఈ చ‌ర్య తీసుకున్నారు. ఇది మార్చి 18 నుంచి త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలుప‌డే వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది. ఈ స్టేష‌న్ల జాబితాలో సికింద్రాబాద్ కూడా ఉంది.
రాజ్ ఘాట్ మూసివేత :  న్యూఢిల్లీలో అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు నిత్యం సంద‌ర్శించే గాంధీ మ‌హాత్ముని స్మార‌కం రాజ్ ఘాట్ ను త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కు సంద‌ర్శ‌కుల‌కు మూసివేస్తున్నారు. 
తాజ్ మ‌హ‌ల్ మూసివేత :  చారిత్ర‌క ప్రేమ చిహ్నం తాజ్ మ‌హ‌ల్ కు సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తించ‌రాద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. క‌రోనా అదుపులో భాగంగా ఈ చ‌ర్య తీసుకుంది. 
పెరిగిన డిజిట‌ల్ పేమెంట్లు : క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా ప్ర‌జ‌లు డిజిట‌ల్ పేమెంట్ సాధ‌నాలు వినియోగించ‌డాన్ని ప్రోత్స‌హించాల‌న్న ఆర్‌బీఐ అడ్వైజరీ అనంత‌రం డిజిట‌ల్ పేమెంట్ల విభాగంలోని కంపెనీల‌కు కొత్త ఉత్తేజం ఏర్ప‌డింది. నెఫ్ట్, ఐఎంపిఎస్‌, యూపిఐ, భార‌త్ బిల్ పే వంటి మాధ్య‌మాల్లో చెల్లింపులు కూడా పెరిగాయి.

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

ప్రారంభ  సెషన్  నిస్తేజం   
తిథి :  ఫాల్గుణ బహుళ దశమి 
న‌క్ష‌త్రం : పూర్వాషాఢ, ఉత్తరాషాఢ   
అప్ర‌మ‌త్తం :  మృగశిర, చిత్త, ధనిష్ఠ/ ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు, మకర, వృషభ రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8967.05 (-230.35) 
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 12.59
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 12.20 వ‌ర‌కు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత  1.20 వరకు మెరుగ్గానూ, తదుపరి చివరి వరకు నిలకడగను ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  12.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా ఫైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిష‌న్లు తీసుకుని 1.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి.   
 నిరోధ స్థాయిలు :  9125, 9175,9225
మ‌ద్ద‌తు స్థాయిలు : 8900, 8850, 8800
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Monday, March 16, 2020

ప్ర‌పంచానికి తిరోగ‌మ‌నం ముప్పు

కోవిడ్‌-19 ప్ర‌భావానికి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, గ‌ల్ఫ్ సంక్షోభం, బ్రెగ్జిట్‌, ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల తీవ్రంగా దెబ్బ తిని ఉన్న ప్ర‌పంచానికి కోవిడ్‌-19 స‌రికొత్త స‌వాలును విసిరింది. కోవిడ్-19 వంద‌కి పైగా దేశాల‌ను చుట్టుముట్టింది. ల‌క్ష‌లాది మంది క‌రోనా బారిన ప‌డ్డారు. చైనా అత్య‌ధికంగా న‌ష్ట‌పోగా ఇట‌లీ రెండో స్థానంలో నిలిచింది. ఇంకా ఎన్నో దేశాలు భారీ క‌ల్లోలం ఎదుర్కొంటున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఈ ఏడాది అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్ తిరోగ‌మ‌నంలో ప‌డ‌తాయ‌ని అమెరికాకు చెందిన జెపి మోర్గాన్ హెచ్చ‌రించింది. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాది మొద‌టి త్రైమాసికంలో 2 శాతం, రెండో త్రైమాసికంలో 3 శాతం ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేసే ఆస్కారం ఉన్న‌ద‌ని, అదే స‌మ‌యంలో యూరోపియ‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ 1.8 శాతం, 3.3 శాతం క్షీణ‌త ఎదుర్కొన‌వ‌చ్చున‌ని పేర్కొంది. ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాల్లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు మూసివేయ‌డం, భారీగా ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యే వేడుక‌లు, కార్య‌క్ర‌మాల‌పై నిషేధం విధించ‌డం వంటి ప‌రిణామాలు ప్ర‌ధానంగా తిరోగ‌మ‌నానికి దారి తీయ‌వ‌చ్చున‌ని ఆ బ్యాంకు తెలిపింది. 1835 నుంచి ఏర్ప‌డిన ప్ర‌తీ ఒక్క తిరోగ‌మ‌నంలోనూ మూడు ప్ర‌మాద ఘంటిక‌లు మోగించాయ‌ని, కోవిడ్‌-19 కూడా ఇందుకు అతీతం ఏమీ కాద‌ని గోల్డ్ మాన్ శాచ్ హెచ్చ‌రించింది. తాజాగా ప‌లు సినిమాల విడుద‌ల వాయిదా ప‌డింది. సినిమా షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. 

క్రూడాయిల్ ధ‌ర‌ల భారీ ప‌త‌నం
దేశ‌వ్యాప్తంగా డిమాండు భారీగా క్షీణించ‌డంతో క్రూడాయిల్ ధ‌ర‌లు 2016 స్థాయికి ప‌డిపోయాయి. రెండు సెష‌న్ల‌లోనే బ్యారెల్ క్రూడాయిల్ ధ‌ర 35 శాతం ప‌డిపోయి 32 డాల‌ర్ల‌కు దిగ‌జారింది. క్రూడాయిల్ ధ‌ర‌ల ప‌త‌నాన్ని నిలువ‌రించేందుకు ఆయిల్ ఉత్ప‌త్తి దేశాల‌న్నీ భారీగా ఉత్ప‌త్తిని త‌గ్గించాల‌న్న కీల‌క ప్ర‌తిపాద‌న‌తో ఈ నెల 6వ తేదీన‌ స‌మావేశ‌మైన ఒపెక్ దేశాల కూట‌మి ఆ విష‌యంలో ఏకాభిప్రాయానికి రాలేక‌పోయింది. సౌదీ అరేబియా, ర‌ష్యా క్రూడాయిల్ ఉత్ప‌త్తి త‌గ్గించేందుకు నిరాక‌రించాయి. 

మార్కెట్లు కల్లోలితం 

మార్కెట్ రివ్యూ 

ప్ర‌పంచాన్ని చుట్టుముడుతున్న కోవిడ్‌-19

క‌రోనా (కోవిడ్‌-19) ప్ర‌భావానికి ప్ర‌పంచం యావ‌త్తు అత‌లాకుత‌లం అయిపోతోంది. దీన్ని దీటుగా ఎదుర్కోవాలంటే ప్ర‌పంచం యావ‌త్తు ఒక‌టిగా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందుకు సంఘ‌టిత చ‌ర్య‌లు అత్యంత కీల‌కం. ఆ దిశ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కీల‌క‌మైన ప్ర‌తిపాద‌న ఒక‌టి చేశారు. సార్క్ దేశాల‌న్నీ క‌లిసి ఒక అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌తిపాద‌న‌. ఆ నిధికి భార‌త్ ప్రాథ‌మికంగా కోటి డాల‌ర్లు (రూ.72 కోట్లు) త‌న వాటాగా అందిస్తుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. సార్క్ స‌భ్య‌దేశాల అగ్ర‌నేత‌ల‌తో ఆయ‌న వీడియో  కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆ కాన్ఫ‌రెన్స్ లో శ్రీ‌లంక అధ్య‌క్షుడు గొటాబ‌యా రాజ‌ప‌క్సా, మాల్దీవుల అధ్య‌క్షుడు మ‌హ‌మ్మ‌ద్ సోలిహ్‌, నేపాల్ ప్ర‌ధాని కెపి శ‌ర్మ సోలి, భూటాన్ ప్ర‌ధాని లోట్సే షెరింగ్‌, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా, ఆఫ్గ‌న్ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌ని, పాక్ ప్ర‌ధాని ప్ర‌త్యేక ప్ర‌తినిధి జాఫ‌ర్ మీర్జా పాల్గొన్నారు. అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు జి-7 సంస‌న్న దేశాల కూట‌మి కూడా చేయి క‌లిపి ఇలాంటి గ్లోబ‌ల్  నిధి ఒక‌టి ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ప్ర‌భావం మ‌రింత విస్తృతంగా, అధికంగా ఉంటుంది.

ఈక్విటీ మార్కెట్లలో భారీ విధ్వంసం 
కోవిడ్‌-19 ప్ర‌భావానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు భారీ క‌ల్లోలంలో చిక్కుకున్నాయి. గ‌త కొంత కాలంగా బుల్స్ చిందుల‌ను చ‌వి చూసిన భార‌త మార్కెట్ కూడా ఈ ప్ర‌భావానికి అతీతం కాలేదు. ఇన్వెస్ట‌ర్లు తెగ‌బ‌డి అమ్మ‌కాలు సాగిస్తున్నారు. దీని ప్ర‌భావం వ‌ల్ల గ‌త వారంలో కేవ‌లం రెండే రెండు రోజుల్లో భారీ విధ్వంసం జ‌రిగింది. మంగ‌ళ, గురు (2020 మార్చి 9, 11 తేదీ లు )  వారాల్లో కేవ‌లం 48 గంట‌ల్లో జ‌రిగిన క‌ల్లోలంలో భార‌త స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు సెన్సెక్స్ 3473 పాయింట్లు (9.24%), నిఫ్టీ 1034 పాయింట్లు (9.41%) న‌ష్ట‌పోయాయి. దీంతో ఒక్క వారంలోనే ఇన్వెస్ట‌ర్ల సంప‌ద 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు తుడిచిపెట్టుకుపోయింది. తాజా స‌మాచారం ప్ర‌కారం (15వ తేదీ) దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 108కి చేర‌గా ఒక్క మ‌హారాష్ట్రలోనే 32 కేసులు న‌మోద‌య్యాయి.

ట్రేడింగ్ విరామం
శుక్ర‌వారంనాడు కూడా భారీ స్థాయిలో ఆటుపోట్లు త‌లెత్తి సూచీలు 10 శాతానికి పైగా న‌ష్ట‌పోవ‌డంతో స్వ‌ల్ప స‌మ‌యం పాటు స‌ర్క్యూట్ బ్రేక‌ర్లు యాక్టివేట్ చేసి ట్రేడింగ్ నిలిపివేయాల్సి వ‌చ్చింది. గ‌త 12 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌లో ట్రేడింగ్ నిలిపివేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఇన్వెస్ట‌ర్లు తెగ‌బ‌డి అమ్మ‌కాలు సాగించి భారీ స్థాయిలో న‌ష్టాలు మూట‌గ‌ట్టుకోవ‌ల‌సిన ప‌రిస్థితిని త‌ప్పించ‌డానికి ఈ స‌ర్క్యూట్ బ్రేక‌ర్లు ఉప‌యోగిస్తారు.

గ‌త వారంలో జ‌రిగిన భారీ విధ్వంసంలో దేశంలో మార్కెట్ విలువ‌లో టాప్ 10 స్థానంలో ఉన్న కంపెనీలు రూ.4,22,393.44 కోట్ల సంప‌ద న‌ష్ట‌పోయాయి. మార్కెట్ కు చోద‌క శ‌క్తులుగా ఉండే టిసిఎస్, ఆర్ఐఎల్ భారీ న‌ష్టాన్ని చ‌వి చూశాయి. న‌ష్టంలో టిసిఎస్ అగ్ర‌గామిగా ఉంది. ఈ కంపెనీ రూ.1,16,549.07 కోట్లు న‌ష్ట‌పోవ‌డంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6,78,168.49 కోట్ల‌కు దిగ‌జారింది. రూ.1,03,425.15 కోల్పోయిన ఆర్ఐఎల్ రెండో స్థానంలో ఉంది. గ‌త వారం ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.7,01,693.52 కోట్ల‌కు క్షీణించింది. ఒక ద‌శ‌లో ఈ కంపెనీ 10 వేల కోట్ల రూపాయ‌ల మార్కెట్ విలువ‌ను దాటి భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో ఒక రికార్డు నెల‌కొల్పింది. వీటితో పాటు ఇన్ఫోసిస్‌, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్‌, హిందుస్తాన్ యునీలీవ‌ర్‌, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్, భార‌తి ఎయిర్ టెల్‌, హెచ్ డిఎఫ్ సి ఉన్నాయి. ఇప్ప‌టికీ ఆర్ఐఎల్ దేశంలో మార్కెట్ విలువ‌లో అగ్ర‌గామి కంపెనీగా కొన‌సాగుతోంది.

మ‌రి కొంత కాలం ప‌రిస్థితి ఇంతేనా...?
ఈ వారంలో స్టాక్ మార్కెట్ మ‌రింత అధికంగా ఆటుపోట్లు ఎదుర్కొన‌డం లేదా రిలీఫ్ ర్యాలీ సాధించే ఆస్కారం ఉన్న‌ద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇన్వెస్ట‌ర్లు మ‌రి కొంత కాలం క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిశితంగా గ‌మనిస్తూ ఉండ‌డంతో పాటు కేంద్రీయ బ్యాంకులు, ప్ర‌భుత్వాలు ఏవైనా ఉద్దీప‌న‌లు ప్ర‌క‌టిస్తాయా అని నిశితంగా దృష్టి సారిస్తార‌ని వారంటున్నారు. మార్కెట్ లో స్వ‌ల్ప రిలీఫ్ ర్యాలీలు వ‌చ్చినా అవి స్వ‌ల్ప‌కాలిక‌మే అవుతాయ‌న్న‌ది వారి అభిప్రాయం. 2008 ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం త‌ర్వాత తొలిసారిగా మార్కెట్లు క‌నిష్ఠ స‌ర్క్యూట్ల‌ను తాకాయ‌ని, కాని త్వ‌ర‌లోనే మంచి బౌన్స్ బ్యాక్ ఏర్ప‌డ‌వ‌చ్చున‌ని ఇండియా నివేశ్ ఇన్ స్టిట్యూష‌న‌ల్ ఈక్విటీస్ హెడ్ విన‌య్ పండిట్ అంటున్నారు. 

Sunday, March 15, 2020

వారానికి ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌

10250 పైన ముగిస్తే బుల్లిష్‌
(తేదీలు మార్చి 16-మార్చి 20, 2002 మ‌ధ్య వారానికి)
గ‌త వారం నిఫ్టీ ముగింపు :  9955 (-1034)
నిఫ్టీ గ‌త వారం 10752-8855 పాయింట్ల మ‌ధ్య‌న విస్తృత ప‌రిధిలో క‌ద‌లాడి చివ‌రికి 1034 పాయింట్ల న‌ష్టంతో 9955 వ‌ద్ద నెగిటివ్ గా ముగిసింది.
- కొత్త ఆస్ర్టో మాసంలో ఫిబ్ర‌వ‌రి 24-27 తేదీల మ‌ధ్య కాలంలో ఏర్ప‌డిన ప‌రిధి 12013-11537. గత వారాంతానికి  అన్ని స్థాయిల  కన్నా దిగజారింది.
- 20, 50, 100, 200 చ‌ల‌న స‌గ‌టు (డిఎంఏ) స్థాయిలు 11354, 11817, 11905, 11654. ఇవి నిరోధ‌, మ‌ద్ద‌తు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్ర‌స్తుతం అన్ని డిఎంఏల క‌న్నా దిగువ‌న ఉంది. కాని 50 డిఎంఏ, 200 డిఎంఏ క‌న్నా పైనే ఉండ‌డం దీర్ఘ‌కాలిక బుల్లిష్ ట్రెండ్ చెక్కు చెద‌ర‌లేద‌న‌డానికి సంకేతం. వారాంతానికి 11300 క‌న్నా పైన ముగిస్తే స్వ‌ల్ప‌కాలిక ట్రెండ్ బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 10250    బ్రేక్ డౌన్ స్థాయి : 9700
నిరోధ స్థాయిలు : 10100, 10175, 10250 (10025 పైన బుల్లిష్‌)
మ‌ద్ద‌తు స్థాయిలు : 9800, 9725, 9650 (9875 దిగువ‌న బేరిష్‌) 
ఇన్వెస్ట‌ర్ల‌కు సూచ‌న...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీల‌కం. 
----------------------- 
ప్రారంభ, ముగింపు  సెషన్లు మెరుగు  (సోమవారానికి)
తిథి :  ఫాల్గుణ బహుళ అష్టమి 
న‌క్ష‌త్రం :  జ్యేష్ఠ, మూల 
అప్ర‌మ‌త్తం :  కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ/రోహిణి,హస్త, శ్రవణం శ్రవణం న‌క్ష‌త్ర జాత‌కులు, మకర, వృషభ  న‌క్ష‌త్ర జాత‌కులు, వృశ్చిక, మీన రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9590.15 (-868.25)
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 11. 1
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 11.10 వ‌ర‌కు మెరుగ్గానూ, ఆ త‌ర్వాత 1.59 వరకు నిస్తేజంగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత  చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం 11 గంటల స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిష‌న్లు తీసుకుని 11.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 11.45 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 1.45 సమయానికి, 2.15 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.  
 నిరోధ స్థాయిలు :  10000, 10050,10100
మ‌ద్ద‌తు స్థాయిలు : 9900, 9850, 9800
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Thursday, March 12, 2020

స్టాక్ మార్కెట్ మ‌హాప‌త‌నం

- క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు వారంలోనే రెండు భారీ ప‌త‌నాలు న‌మోదు
- మార్చి 12న 2919 పాయింట్లు, 10న 1941 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్ 
- రెండు సెష‌న్ల‌లోనూ రూ.19 ల‌క్ష‌ల కోట్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఆవిరి

కోవిడ్‌-19ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించ‌డం స్టాక్ మార్కెట్ల‌లో భారీ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. కోవిడ్‌-19 ప్ర‌పంచ‌వ్యాప్తంగా 107 దేశాల‌కు విస్త‌రించ‌గా 4200 వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.1,17,330 మందికి క‌రోనా సోకింది. దీనికి తోడు కోవిడ్‌-19ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించ‌డం మార్కెట్ల‌లో క‌ల్లోలాన్ని ప‌తాక స్థాయికి చేర్చింది. ఇన్వెస్ట‌ర్లు భ‌యోత్పాతంతో సాగించిన భారీ అమ్మ‌కాల ప్ర‌భావానికి స్టాక్ ఇండెక్స్ లు చారిత్ర‌క మ‌హాప‌త‌నాలు న‌మోదు చేశాయి. 

గురువారంనాడు (2020 మార్చి, 12) సెన్సెక్స్ భారీ స్థాయిలో 2919 పాయింట్లు న‌ష్ట‌పోయింది. సెన్సెక్స్ చ‌రిత్ర‌లో మ‌హా ప‌త‌నం ఇదే. రెండు రోజుల క్రిత‌మే సోమ‌వారంనాడు (మార్చి 10) న‌మోదైన 1941 పాయింట్ల భారీ ప‌త‌నం రికార్డును ఇది తుడిచిపెట్టేసింది. ఇలా రెండు రోజుల విరామంలో ఏర్ప‌డిన రెండు భారీ ప‌త‌నాల్లో సెన్సెక్స్ 4860 పాయింట్లు న‌ష్ట‌పోగా ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.19 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు ఆవిరైపోయింది. 

12 ల‌క్ష‌ల కోట్లు హాంఫ‌ట్‌
క‌రోనా స్టాక్ మార్కెట్ లో సృష్టించిన క‌ల్లోలానికి ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.11,27,160.65 కోట్ల మేర‌కు తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ గురువారం మార్కెట్ ముగిసే స‌మ‌యానికి రూ.1,25,86,398.07 కోట్ల‌కు దిగ‌జారింది.

17 నెల‌ల క‌నిష్ఠానికి రూపాయి
క‌రోనాతో ఏర్ప‌డిన అనిశ్చితి కార‌ణంగా స్టాక్ మార్కెట్ తో పాటు ఫారెక్స్ మార్కెట్ కూడా ప్ర‌భావితం అయింది. అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 60 పైస‌లు న‌ష్ట‌పోయి తాజాగా 17 నెల‌ల క‌నిష్ఠ స్థాయి 74.28కి దిగ‌జారింది. వ‌రుస‌గా నాలుగో రోజున కూడా విదేశీ ఇన్వెస్ట‌ర్లు నిక‌ర అమ్మ‌కందారులుగా నిలిచారు. ఈ నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎఫ్ పిఐలు 446 కోట్ల డాల‌ర్లు (రూ.33,163 కోట్లు) ఉప‌సంహ‌రించిన‌ట్టు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి.

ప్ర‌పంచ మార్కెట్ల‌దీ అదే దారి
క‌రోనా వైర‌స్ పై పోరాటంలో భాగంగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ యూర‌ప్ నుంచి అమెరికాకు ప్ర‌యాణాల‌ను నెల రోజుల పాటు నిషేధించ‌డం, క్రూడాయిల్ ధ‌ర‌ల భారీ ప‌త‌నం ప్ర‌భావంతో ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ చారిత్ర‌క ప‌త‌నాలు న‌మోదు చేశాయి. ప్ర‌పంచం మ‌రోసారి తిరోగ‌మ‌నంలోకి పోతుంద‌న్న భ‌యాలు ఇన్వెస్ట‌ర్లు తెగ‌బ‌డి అమ్మ‌కాలు సాగించ‌డానికి కార‌ణ‌మ‌యింది. సిడ్నీ మార్కెట్ 7.4% ప‌త‌నం న‌మోదు చేసింది. 2008 ఆర్థిక సంక్షోభ స‌మ‌యంలో ఏర్ప‌డిన భారీ ప‌త‌నం త‌ర్వాత న‌మోదైన మ‌రో భారీ  ప‌త‌నం ఇదే.
- టోక్యో మార్కెట్ 4.4 శాతం న‌ష్ట‌పోయింది. దీంతో ఇటీవ‌ల గ‌రిష్ఠ స్థాయిల నుంచి 20 శాతం ప‌త‌నం పూర్తి కావ‌డంతో ఆ మార్కెట్ బేర్ ద‌శ‌లోకి ప‌డిపోయింది. 
- చైనాలో ప‌రిస్థితి అదుపులోకి వ‌స్తున్న‌ద‌న్న వార్త‌ల‌తో షాంఘై మార్కెట్ అతి త‌క్కువ‌గా 1.5 శాతం ప‌త‌నం న‌మోదు చేసింది.
- ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడు రోడ్రిగో ద‌త‌ర్తే క‌రోనా ప‌రీక్ష చేయించుకుంటార‌న్న వార్త‌ల ప్ర‌భావంతో మ‌నీలా ఎక్స్ఛేంజి 10 శాతం న‌ష్ట‌పోయింది. 
- గ‌ల్ఫ్ ప్రాంత సూచీల్లో దుబాయ్ ఎక్స్ఛేంచి 8 శాతం, సౌదీ ఎక్స్ఛేంజి 3 శాతం, క‌తార్ ఎక్స్ఛేంజి 4.5 శాతం న‌ష్ట‌పోయాయి.

17 నెల‌ల క‌నిష్ఠానికి రూపాయి
క‌రోనాతో ఏర్ప‌డిన అనిశ్చితి కార‌ణంగా స్టాక్ మార్కెట్ తో పాటు ఫారెక్స్ మార్కెట్ కూడా ప్ర‌భావితం అయింది. అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 60 పైస‌లు న‌ష్ట‌పోయి తాజాగా 17 నెల‌ల క‌నిష్ఠ స్థాయి 74.28కి దిగ‌జారింది. వ‌రుస‌గా నాలుగో రోజున కూడా విదేశీ ఇన్వెస్ట‌ర్లు నిక‌ర అమ్మ‌కందారులుగా నిలిచారు. ఈ నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎఫ్ పిఐలు 446 కోట్ల డాల‌ర్లు (రూ.33,163 కోట్లు) ఉప‌సంహ‌రించిన‌ట్టు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. 
--------------------------------- 

బేర్ మార్కెట్ అంటే...
అడ్డూ ఆపూ లేకుండా నిరాటంకంగా అమ్మ‌కాలు సాగిన స్థితిని బేర్ మార్కెట్ గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఏదైనా ఒక షేరు లేదా ఇండెక్స్ ఇటీవ‌ల ట్రేడ‌యిన గ‌రిష్ఠ స్థాయి నుంచి 20 శాతం ప‌త‌న‌మైతే అది బేర్ మార్కెట్ అని నిర్వ‌చించారు. ఈ నిర్వ‌చ‌నం ప్ర‌కారం 2020 మార్చి 12వ తేదీన నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజి ఇండెక్స్ నిఫ్టీ బేర్ ద‌శ‌లోకి జారుకోగా సెన్సెక్స్ బేర్ స్థితికి స్వ‌ల్ప‌దూరంలో ఉంది. జ‌న‌వ‌రిలో న‌మోదైన గ‌రిష్ఠ స్థాయిల నుంచి స్టాక్ ఇండెక్స్ లు 20 శాతం ప‌త‌న‌మ‌య్యాయి. జ‌న‌వ‌రి 14వ తేదీన జీవిత కాల గ‌రిష్ఠ స్థాయిల‌ను న‌మోదు చేసిన ఇండెక్స్ లు గురువారం నాటికి రెండున్న‌ర సంవ‌త్స‌రాల క‌నిష్ఠ స్థాయిల‌కు ప‌డిపోయాయి. 

బేర్ మార్కెట్ల చ‌రిత్ర ఇదీ...
చ‌రిత్ర‌లో ఇప్ప‌టికి ప‌లు బేర్ మార్కెట్లు వ‌చ్చాయి. ప్ర‌తీ సంద‌ర్భంలోనూ బేర్ మార్కెట్ ఏర్ప‌డ‌డానికి ఒక్కో కార‌ణం ఉంది. 1980 ద‌శ‌కంలో బేర్ మార్కెట్ కు ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల‌, అధిక వ‌డ్డీరేట్లు కార‌ణం. అలాగే 2000 సంవ‌త్స‌రంలో బేర్ మార్కెట్ కు టెక్ బ‌బుల్ కార‌ణం కాగా 2008లో బేర్ మార్కెట్ కు అమెరికాలో హౌసింగ్‌, స‌బ్ ప్రైమ్ సంక్షోభం కార‌ణ‌మ‌యింది. 2020లో వాణిజ్య యుద్దం, చ‌మురు యుద్ధంతో మార్కెట్ తీవ్ర ఆటుపోట్ల‌లో న‌డుస్తున్న త‌రుణంలో పేట్రేగిన క‌రోనా వైర‌స్ ప‌త‌నాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది. ఫ‌లితంగా ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికా మార్కెట్ స‌హా ప‌లు మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి ప్ర‌వేశించాయి. 
----------------------------------

మార్చి 31 వ‌ర‌కు ఢిల్లీలో సెల‌వులు
క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌రింత‌గా వ్యాపించ‌కుండా అరిక‌ట్టే ల‌క్ష్యంతో ఢిల్లీ ప్ర‌భుత్వం మార్చి 31 వ‌ర‌కు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌న్నింటికీ సెల‌వు ప్ర‌క‌టించింది. అలాగే సినిమా హాళ్లు కూడా మార్చి 31 వ‌ర‌కు మూసి ఉంటాయి.

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌ 

ప్రారంభ, ముగింపు  సెషన్లు మెరుగు  

తిథి :  ఫాల్గుణ బహుళ పంచమి 
న‌క్ష‌త్రం :  స్వాతి 
అప్ర‌మ‌త్తం :  ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి న‌క్ష‌త్ర జాత‌కులు, వృశ్చిక, మీన   న‌క్ష‌త్ర జాత‌కులు, వృశ్చిక, మీన రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 9590.15 (-868.25)
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 1.58
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.15 వ‌ర‌కు మెరుగ్గానూ, ఆ త‌ర్వాత 1.55 వరకు నిస్తేజంగాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి 3.10 వరకు  మరో సారి మెరుగ్గా ఉండి  తర్వాత  చివరి వరకు నిస్తేజంగా  ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం 10.15 స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన  ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్   పొజిష‌న్లు తీసుకుని 1.45 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి.  3.10 తర్వాత  ఎటిపి  కన్నా పైకే వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని చివరిలో క్లోజ్ చేయవ చ్చు.   
నిరోధ స్థాయిలు :  9650, 9700, 9750
మ‌ద్ద‌తు స్థాయిలు : 9540, 9500, 9450
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Wednesday, March 11, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

మిడ్  సెషన్ నిస్తేజం 
తిథి :  ఫాల్గుణ బహుళ తదియ 
న‌క్ష‌త్రం :  చిత్త 
అప్ర‌మ‌త్తం :  పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర న‌క్ష‌త్ర జాత‌కులు, వృశ్చిక, మీన రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 10458.40 (+6.95)
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 10.53
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.30 వ‌ర‌కు నిలకడగాను, ఆ త‌ర్వాత 12.40 వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.55 వరకు  నిలకడగా  ఉండి  తర్వాత  చివరి వరకు మెరుగ్గా  ట్రేడ్ కావ‌చ్చు..
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం 10.30 స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన  ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 12.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 3 గంటల తర్వాత  ఎటిపి  కన్నా పైకే వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని చివరిలో క్లోజ్ చేయవ చ్చు.   
నిరోధ స్థాయిలు :  10510, 10550, 10600
మ‌ద్ద‌తు స్థాయిలు : 10410, 10360, 10300
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Sunday, March 8, 2020

వారానికి ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌

11300 పైన ముగిస్తే బుల్లిష్‌
(మార్చి 9-మార్చి 13, 2002 మ‌ధ్య వారానికి)
గ‌త వారం నిఫ్టీ ముగింపు :  10990 (-212)
నిఫ్టీ గ‌త వారం 11433-10827 పాయింట్ల మ‌ధ్య‌న విస్తృత ప‌రిధిలో క‌ద‌లాడి చివ‌రికి 212 పాయింట్ల న‌ష్టంతో 10990 వ‌ద్ద నెగిటివ్ గా ముగిసింది.
- కొత్త ఆస్ర్టో మాసంలో ఫిబ్ర‌వ‌రి 24-27 తేదీల మ‌ధ్య కాలంలో ఏర్ప‌డిన ప‌రిధి 12013-11537. గత వారాంతానికి 10827 వరకు దిగజారింది.
- 20, 50, 100, 200 చ‌ల‌న స‌గ‌టు (డిఎంఏ) స్థాయిలు 11786, 11993, 11835, 11670. ఇవి నిరోధ‌, మ‌ద్ద‌తు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్ర‌స్తుతం అన్ని డిఎంఏల క‌న్నా దిగువ‌న ఉంది. కాని 50 డిఎంఏ, 200 డిఎంఏ క‌న్నా పైనే ఉండ‌డం దీర్ఘ‌కాలిక బుల్లిష్ ట్రెండ్ చెక్కు చెద‌ర‌లేద‌న‌డానికి సంకేతం. వారాంతానికి 11300 క‌న్నా పైన ముగిస్తే స్వ‌ల్ప‌కాలిక ట్రెండ్ బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 11300    బ్రేక్ డౌన్ స్థాయి : 10700
నిరోధ స్థాయిలు : 11150, 11225, 11300 (11075 పైన బుల్లిష్‌)
మ‌ద్ద‌తు స్థాయిలు : 10840, 10765, 10695 (10915 దిగువ‌న బేరిష్‌) 
ఇన్వెస్ట‌ర్ల‌కు సూచ‌న...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీల‌కం. 
----------------------- 
గ్ర‌హ‌గ‌తులివే...
- సింహం లోని పుబ్బ పాదం 2 నుంచి తులలోని  విశాఖ పాదం 1 మ‌ధ్య‌లో చంద్ర సంచారం
- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2-3 మ‌ధ్య‌లో ర‌వి సంచారం
- కుంభంలోని ధ‌నిష్ట పాదం 2-3 మ‌ధ్య‌లో బుధ సంచారం
- మేషం లోని అశ్విని పాదం 4 నుంచి  భరణి 2 మధ్యలో శుక్ర సంచారం
- ధ‌నుస్సులోని పూర్వాషాఢ  పాదం 3-4 మ‌ధ్య‌లో కుజ సంచారం
- మకరంలోని ఉత్త‌రాషాఢ పాదం 3లో కుంభ న‌వాంశ‌లో శ‌ని సంచారం
- ధ‌నుస్సులోని ఉత్తరాషాఢ పాదం 1లో ధ‌నుస్సు న‌వాంశ‌లో బృహ‌స్ప‌తి సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 2లో రాహువు, ధ‌నుస్సులోని మూల పాదం 4లో కేతు సంచారం
------------------------------------------ 
మిడ్  సెషన్ మెరుగు  (సోమవారానికి)
తిథి :  ఫాల్గుణ శుక్ల పౌర్ణిమ  
న‌క్ష‌త్రం :  పుబ్బ 
అప్ర‌మ‌త్తం :  మృగశిర , చిత్త , ధనిష్ఠ న‌క్ష‌త్ర జాత‌కులు, తుల , కుంభ రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 10989 (-212)
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 9.25
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.10 వ‌ర‌కు నిలకడగాను, ఆ త‌ర్వాత 12.05 వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.15 వరకు  మెరుగ్గా ఉంది ఆ తర్వాత చివరి వరకు నిలకడగా  ట్రేడ్ కావ‌చ్చు..
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం 12.15 స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన‌ ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్‌  పొజిష‌న్లు తీసుకుని 2.15 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  11040, 11080
మ‌ద్ద‌తు స్థాయిలు : 10950, 10910
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

రెపోరేటు య‌థాత‌థం

ప‌శ్చిమాసియా సంక్షోభం ప్ర‌త్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ల‌ను భ‌య కంపితుల్ని చేస్తున్న వాతావ‌ర‌ణంలో భార‌త రిజ‌ర్వ్ బ...