Monday, March 16, 2020

ప్ర‌పంచానికి తిరోగ‌మ‌నం ముప్పు

కోవిడ్‌-19 ప్ర‌భావానికి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, గ‌ల్ఫ్ సంక్షోభం, బ్రెగ్జిట్‌, ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల తీవ్రంగా దెబ్బ తిని ఉన్న ప్ర‌పంచానికి కోవిడ్‌-19 స‌రికొత్త స‌వాలును విసిరింది. కోవిడ్-19 వంద‌కి పైగా దేశాల‌ను చుట్టుముట్టింది. ల‌క్ష‌లాది మంది క‌రోనా బారిన ప‌డ్డారు. చైనా అత్య‌ధికంగా న‌ష్ట‌పోగా ఇట‌లీ రెండో స్థానంలో నిలిచింది. ఇంకా ఎన్నో దేశాలు భారీ క‌ల్లోలం ఎదుర్కొంటున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఈ ఏడాది అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్ తిరోగ‌మ‌నంలో ప‌డ‌తాయ‌ని అమెరికాకు చెందిన జెపి మోర్గాన్ హెచ్చ‌రించింది. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాది మొద‌టి త్రైమాసికంలో 2 శాతం, రెండో త్రైమాసికంలో 3 శాతం ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేసే ఆస్కారం ఉన్న‌ద‌ని, అదే స‌మ‌యంలో యూరోపియ‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ 1.8 శాతం, 3.3 శాతం క్షీణ‌త ఎదుర్కొన‌వ‌చ్చున‌ని పేర్కొంది. ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాల్లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు మూసివేయ‌డం, భారీగా ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యే వేడుక‌లు, కార్య‌క్ర‌మాల‌పై నిషేధం విధించ‌డం వంటి ప‌రిణామాలు ప్ర‌ధానంగా తిరోగ‌మ‌నానికి దారి తీయ‌వ‌చ్చున‌ని ఆ బ్యాంకు తెలిపింది. 1835 నుంచి ఏర్ప‌డిన ప్ర‌తీ ఒక్క తిరోగ‌మ‌నంలోనూ మూడు ప్ర‌మాద ఘంటిక‌లు మోగించాయ‌ని, కోవిడ్‌-19 కూడా ఇందుకు అతీతం ఏమీ కాద‌ని గోల్డ్ మాన్ శాచ్ హెచ్చ‌రించింది. తాజాగా ప‌లు సినిమాల విడుద‌ల వాయిదా ప‌డింది. సినిమా షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. 

క్రూడాయిల్ ధ‌ర‌ల భారీ ప‌త‌నం
దేశ‌వ్యాప్తంగా డిమాండు భారీగా క్షీణించ‌డంతో క్రూడాయిల్ ధ‌ర‌లు 2016 స్థాయికి ప‌డిపోయాయి. రెండు సెష‌న్ల‌లోనే బ్యారెల్ క్రూడాయిల్ ధ‌ర 35 శాతం ప‌డిపోయి 32 డాల‌ర్ల‌కు దిగ‌జారింది. క్రూడాయిల్ ధ‌ర‌ల ప‌త‌నాన్ని నిలువ‌రించేందుకు ఆయిల్ ఉత్ప‌త్తి దేశాల‌న్నీ భారీగా ఉత్ప‌త్తిని త‌గ్గించాల‌న్న కీల‌క ప్ర‌తిపాద‌న‌తో ఈ నెల 6వ తేదీన‌ స‌మావేశ‌మైన ఒపెక్ దేశాల కూట‌మి ఆ విష‌యంలో ఏకాభిప్రాయానికి రాలేక‌పోయింది. సౌదీ అరేబియా, ర‌ష్యా క్రూడాయిల్ ఉత్ప‌త్తి త‌గ్గించేందుకు నిరాక‌రించాయి. 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...