Thursday, May 14, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు

తిథి :  వైశాఖ బహుళ నవమి 

నక్షత్రం : శతభిషం  

అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర; మీన, కర్కాటక రాశి జాతకులు  

నిఫ్టీ :  9383.55 (-240.80)   

ట్రెండ్ మార్పు సమయం : 3.05 

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 12 గంటల వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.10 వరకు మెరుగ్గాను ఆ తర్వాత చివరి వరకు నిలకడగాను  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం :9.45 గంటల సమయానికి ఎటిపి కన్నా దిగువన  పైన ఉంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.15 సమయానికి ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 9240, 9340                  మద్దతు : 9040, 8940  

----------------------------------------------- 
సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...